![Nuh violence: 176 people arrested, 78 taken into preventive detention so far - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/4/NUH.jpg.webp?itok=b0hERel1)
గురుగ్రామ్: మత ఘర్షణలతో అట్టుడికిన హరియాణాలోని నూహ్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఓ వర్గానికి చెందిన రెండు ప్రార్థనా మందిరాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరూ గాయపడలేదు.
అయితే, ఒక ప్రార్థనా మందిరం కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో, మరొకటి గుర్తుతెలియని కారణాలతో మంటలు అంటుకోవడంతో దగ్ధమైనట్లు పోలీసులు చెప్పారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా, హరియాణాలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) ప్రసాద్ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు.
నూహ్ అల్లర్లలో అరెస్టయిన యువకులు
Comments
Please login to add a commentAdd a comment