Noah
-
Israel-Hamas war: హమాస్ రాక్షసత్వం
టెల్ అవీవ్: ప్రఖ్యాత రచయిత్రి జేకే రౌలింగ్ రచించిన హ్యారీ పోట్టర్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. చిన్నపిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక నోయా డాన్ ఆటిజం బాధితురాలు. ఆమెకు హ్యారీ పోట్టర్ సాహసాలంటే చెప్పలేనంత ఇష్టం. ఈ సిరీస్‌లో వచ్చిన పుస్తకాలన్నీ చదివేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు నోయా డాన్‌ను అపహరించారు. ఆమె నాన్నమ్మతోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు బందీలుగా గాజాకు చేరారు. వారంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియరాలేదు. అసలు బతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆటిజం బాధితురాలైన నోయా డాన్‌ను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌ను కోరింది. హ్యారీపోట్టర్ పాత్రధారి ఆహార్యంతో ఉన్న నోయా డాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది షేర్ చేశారు. హమాస్ చెర నుంచి నోయా డాన్‌ను విడిపించేందుకు చొరవ చూపాలంటూ జేకే రౌలింగ్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జేకే రౌలింగ్ వెంటనే స్పందించారు. హ్యారీ పోట్టర్ అభిమాని కిడ్నాప్ అయ్యారని తెలుసుకొని చలించిపోయారు. ఆమెకు విముక్తి కలి్పంచాలని హమాస్‌ను అభ్యరి్థంచారు. నోడా డాన్ క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రౌలింగ్ ప్రతిస్పందన తర్వాత ఇజ్రాయెల్ వ్య«థకు నోయా డాన్ ఒక ప్రతీకగా మారిపోయారు. ఇజ్రాయెల్ పౌరులంతా ఆమె గురించి చర్చించుకున్నారు. క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. కానీ, ఇంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది. నోయా డాన్తోపాటు ఆమె నాన్నమ్మ కార్మెలా మృతదేహాన్ని బుధవారం గాజాలో గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నోయా డాన్ ఇక లేదని తెలిసి ఇజ్రాయెల్ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలికను హమాస్ మిలిటెంట్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. ‘‘అమ్మా, నాకు చాలా భయమేస్తోంది. ఎవరో బూచాళ్లు మన ఇంట్లోకి వచ్చారు. వెంటనే వచ్చి నన్ను నీతో తీసుకెళ్లు’’.. బయటకు వెళ్లిన తన తల్లితో ఫోన్లో నోయా డాన్ చివరి సంభాషణ ఇది. -
నోవా లైల్స్ ‘డబుల్’
బుడాపెస్ట్ (హంగేరీ): అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ‘డబుల్’ సాధించాడు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటికే 100 మీటర్ల స్ప్రింట్‌లో విజేతగా నిలిచిన అతను ఇప్పుడు 200 మీటర్ల పరుగులో కూడా అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అంచనాలకు తగినట్లుగానే సత్తా చాటిన లైల్స్ 19.52 సెకన్లలో పరుగు పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో ఎరియోన్ నైటాన్ (అమెరికా – 19.75 సెకన్లు) రజతం సాధించగా, లెట్సిలో టె»ొగో (బోట్స్వానా – 19.81 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ 200 మీటర్ల పరుగులో లైల్స్‌కు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. గత ఏడాది ఒరెగాన్‌లో జరిగిన పోటీల్లోనూ అతను బంగారు పతకం సాధించాడు. తద్వారా బోల్ట్ తర్వాత ఒకే ఈవెంట్లో వరుసగా కనీసం మూడు స్వర్ణాలు గెలిచిన రెండో అథ్లెట్‌గా లైల్స్ నిలిచాడు. 4గీ100 మీటర్ల రిలేలో అమెరికా జట్టు ఫైనల్ చేరింది. ఇందులో కూడా భాగంగా నిలిచి విజయం సాధిస్తే లైల్స్ ఖాతాలో మూడో స్వర్ణం చేరుతుంది. ప్రపంచ రికార్డుకు చేరువై... 100 మీటర్ల స్ప్రింట్‌లో రజతం సాధించిన షెరికా 200 మీటర్ల ఈవెంట్లో తన పరుగుకు మరింత పదును పెట్టింది. ఈ జమైకా అథ్లెట్ 200 మీటర్ల పరుగులో రెండో అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుందిు. 21.41 సెకన్లలో షెరికా పరుగులు పూర్తి చేసింది. గాబ్రియెల్ థామస్ (అమెరికా – 21.18 సెకన్లు), షకారి రిచర్డ్సన్ (అమెరికా – 21.92 సెకన్లు)లకు వరుసగా రజత, కాంస్యాలు దక్కాయి. ప్రపంచ రికార్డు ఇప్పటికీ అమెరికాకు చెందిన ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ (21.34 సెకన్లు) పేరిటే ఉంది. 1988లో ఆమె ఈ టైమింగ్‌ను నమోదు చేసింది. గత ఏడాది కూడా ఈ ఈవెంట్లో షెరికా స్వర్ణం సాధించింది. ఆసియా రికార్డుతో ఫైనల్లోకి భారత 4్ఠ400 రిలే బృందం ప్రదర్శన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత 4్ఠ400 మీటర్ల రిలే బృందం అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ఆసియా రికార్డుతో ఫైనల్‌కు అర్హత సాధించింది. తొలి హీట్‌లో మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. మొహమ్మద్ అనస్ యాహియా, అమోజ్ జాకబ్, మొహమ్మద్ అజ్మల్ వరియత్తోడి, రాజేశ్ రమేశ్ భాగంగా ఉన్న భారత్ ఈ రేసును 2 నిమిషాల 59.05 సెకన్లలో పూర్తి చేసింది. ఇది కొత్త ఆసియా రికార్డు కావడం విశేషం. ఈ హీట్స్‌లో అమెరికా జట్టు మొదటి స్థానంలో నిలవగా, గ్రేట్ బ్రిటన్ టీమ్‌కు మూడో స్థానం దక్కింది. నేడు ఫైనల్ రేస్ జరుగుతుంది. -
హరియాణాలో ఆగని బుల్డోజర్ డ్రైవ్
గురుగ్రామ్: హరియాణాలోని నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు మరో వర్గం వ్యక్తులు చేసిన రాళ్లదాడి తదనంతర ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో సమాధానం చెబుతోంది. నూహ్ అల్లర్ల సంబంధ సీసీటీవీ వీడియోలో పోలీసులు గుర్తించిన నిందితులకు చెందిన దుకాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టంచేశారు. మూడో రోజైన శనివారం సైతం ఈ బుల్డోజర్ డ్రైవ్ కొనసాగింది. అయితే, నల్హార్ వైద్య కళాశాలకు చెందిన 2.6 ఎకరాల భూమిలో కట్టిన అక్రమ నిర్మాణాలనే తాము కూల్చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. నూహ్ అల్లర్ల నిందితులను లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అయితే నూహ్ జిల్లాలో పరిస్థితి కాస్తంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలదాకా కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ధీరేంద్ర చెప్పారు. భయంతో తరలిపోతున్న వలసకార్మికుల్లో భరోసా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. డెప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ సెక్టార్ 58, 70 సమీపంలోని పలు మురికివాడల్లో పర్యటించి వలసకార్మికులతో మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా పనులకు వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. -
హరియాణాలో మళ్లీ ఉద్రిక్తత
గురుగ్రామ్: మత ఘర్షణలతో అట్టుడికిన హరియాణాలోని నూహ్ జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి 11.30 గంటలకు ఓ వర్గానికి చెందిన రెండు ప్రార్థనా మందిరాలు స్వల్పంగా దగ్ధమయ్యాయి. ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే, ఒక ప్రార్థనా మందిరం కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో, మరొకటి గుర్తుతెలియని కారణాలతో మంటలు అంటుకోవడంతో దగ్ధమైనట్లు పోలీసులు చెప్పారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని చెదరగొట్టారు. గురుగ్రామ్‌లోనూ ఉద్రిక్తత కొనసాగుతోంది. కాగా, హరియాణాలో మత ఘర్షణలకు సంబంధించి ఇప్పటిదాకా 93 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) ప్రసాద్ చెప్పారు. 176 మందిని అరెస్టు చేశామని, వీరిలో 78 మందిని పీడీ చట్టం కింద అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. నూహ్ అల్లర్లలో అరెస్టయిన యువకులు -
మళ్లీ మతం మంటలు!
విశ్వాసాల ప్రాతిపదికగా చెలరేగిపోయే మూక మనస్తత్వం ఆధునిక నాగరికతకు అత్యంత ప్రమాదకారి సుమా అని రెండు వందల యేళ్లనాడు అమెరికా మాజీ అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ హెచ్చరించారు. తరాలు మారినా, అప్పటితో పోలిస్తే ఎంతో ప్రగతి సాధించినా ఆ ప్రమాదకర మనస్తత్వాన్ని వదులుకోలేని బలహీనత కొందరిని పట్టిపీడిస్తోంది. ఒక పక్క మూడు నెలల క్రితం ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్లో చోటుచేసుకున్న అత్యంత దుర్మార్గమైన ఉదంతాలపై పార్లమెంటు లోపలా, వెలుపలా రోజూ ఆందోళన వ్యక్తమవుతోంది. దానిపై చర్చకు విపక్షం పట్టుబడుతోంది. సర్వోన్నత న్యాయస్థానం సైతం మణిపుర్ దురంతాలపై దృష్టి సారించి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందనీ, రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందనీ కటువుగా వ్యాఖ్యానించింది. ఈలోగానే హరియాణాలో దుండగులు చెలరేగిపోయారు. వరసగా రెండురోజులపాటు అడ్డూ ఆపూ లేకుండా సాగిన హింసాకాండతో అక్కడి నూహ్, గురుగ్రామ్ పట్టణాలు అట్టుడికిపోయాయి. ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయి 75 మంది గాయాల పాలయ్యాక, ఒక ప్రార్థనా స్థలంతో పాటు పలు దుకాణాలు తగలబడ్డాక ఇందుకు కారకులని భావిస్తున్న 116 మందిని అరెస్టు చేశారు. హింసాకాండకు ప్రేరేపించిన ఉదంతమేమిటి, ఎవరు ముందుగా దాడికి దిగారన్నది దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. అయితే నిఘా వ్యవస్థ, శాంతిభద్రతల విభాగం పటిష్టంగా ఉన్నచోట ఎవరి ఆటలూ సాగవు. జాగ్రదావస్థలో లేని సమాజంలోనే మూకలు చెలరేగుతాయి. భివానీలో ఇద్దరు ముస్లిం యువకుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, తప్పించుకు తిరుగుతున్న మోను మానెసార్ అనే యువకుడు తాను ర్యాలీకి రాబోతున్నానని ఒక వీడియో సందేశం పంపటంతో నూహ్‌లో ఉద్రిక్తత ఏర్పడిందని పోలీసులకు సమాచారం లేదంటే ఆశ్చర్యం కలుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏదో యాదృచ్ఛికంగా మొదలైనట్టు కనబడిన దాడి వెంట వెంటనే వేరే ప్రాంతాలకు విస్తరించటం, రెండు వర్గాలూ మారణాయుధాలు ధరించి చెలరేగి పోవటం దేన్ని సూచిస్తోంది? కొందరికి బులెట్ గాయాలు కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎంత దిగ జారిందో అర్థమవుతుంది. పరస్పరం దాడులకు ఇరువైపులా దుండగులు అన్నివిధాలా సిద్ధంగానే ఉన్నారు. ఏమాత్రం సంసిద్ధత లేకుండా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది ప్రభుత్వ యంత్రాంగమే! ఏమనుకోవాలి దీన్ని? మణిపుర్ దుండగులు ఆ రాష్ట్రాన్నే కాదు, దేశాన్నే అంతర్జాతీయంగా అపఖ్యాతిపాలు చేశాక, సాఫ్ట్వేర్ సంస్థలతోపాటు ఎన్నో బహుళజాతి కార్పొరేట్ సంస్థలు కొలువు దీరిన హరియాణాలో సైతం అలాంటి మూకే విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా విరుచుకుపడిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. సాయుధ పోలీసు బలగాలను తరలించి, 144 సెక్షన్ విధించి అంతా సవ్యంగా ఉన్నదని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండగానే గురుగ్రామ్ అంటుకుంది. అక్కడి మిలీ నియం సిటీ, బాద్షాపూర్ ప్రాంతాల్లో దుకాణాల దహనం, లూటీలు పోలీసుల సాక్షిగా కొనసాగాయి. గొడవలు జరిగిన ప్రతిచోటా స్థానికులు చెప్పే మాటలే ఇప్పుడు నూహ్, గురుగ్రామ్ ప్రాంత వాసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చాన్నాళ్లుగా ఆ ప్రాంతాలకు వస్తున్నారని, స్థానిక యువతను సమావేశపరిచి అవతలి మతం గురించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నినాదాలు చేస్తున్నారన్నది వారి మాటల సారాంశం. స్థానికులు కొన్ని రోజులుగా గమనించిన అంశాలపై నిఘా విభాగానికి ముందస్తు సమాచారం లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. దేశ రాజధానికి సమీపంలో ఉండే ప్రాంతంలో ఈ దుఃస్థితి ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సైతం తలవంపులు తీసుకురాదా? వచ్చే నెలలో న్యూఢిల్లీలో జీ–20 శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. దానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలతో సహా పలువురు దేశాధినేతలు తరలిరాబోతున్నారు. కనీసం హరియాణా ప్రభుత్వానికి ఈ స్పృహ అయినా ఉందా లేదా అనిపిస్తోంది. దేశంలో చెదురుమదురుగా మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న మాట వాస్తవమే అయినా, విచ్చలవిడిగా మారణాయుధాలతో మూకలు చెలరేగిన సందర్భాలు అదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో లేవు. కానీ ఉన్నట్టుండి రెండు రాష్ట్రాల్లోనూ రాక్షస మూకలు చెలరేగాయి. ప్రభు త్వంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్నవారు ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా మెలగాలి. లేనట్ట యితే సమస్య మరింత జటిలమవుతుంది. నూహ్ సమీపంలోని ఒక ప్రముఖ ఆలయంలో అనేక మంది యాత్రీకులను నిర్బంధించారని హరియాణా హోంమంత్రి అనిల్ విజ్ చేసిన ప్రకటన అటు వంటిదే. అందుకు సమర్థనగా నిర్బంధితుల్లో కొందరు తనకు లొకేషన్ కూడా పంపారని చెప్పారు. కానీ ఆ ఆలయ అర్చకుడు దీపక్ శర్మ కథనం భిన్నంగా ఉంది. దర్శనానంతరం తిరిగి వెళ్లిన 2,500 మంది భక్తులు బయట ఉద్రిక్తతలుండటం గమనించి తమంత తాము వెనక్కొచ్చి పరిస్థితి చక్క బడ్డాక వెళ్తామని చెప్పారని ఆయనంటున్నారు. ఏ మతానికి చెందిన ప్రజానీకమైనా శాంతినే కోరుకుంటారు. ఏదో ఉపద్రవం జరిగిపోతోందన్న భయాందోళనలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందామని చూసేవారు ఎప్పుడూ ఉంటారు. అలాంటి శక్తులపై కన్నేసి ఉంచితే, వారిని మొగ్గలోనే తుంచితే సమాజంలో సామరస్యపూర్వక వాతావరణం సులభంగా ఏర్పడుతుంది. మన మతస్తులనో, మన కులస్తులనో భావించి ఏ వర్గమైనా పట్టనట్టు ఊరుకుంటే అంతిమంగా అది మొత్తం సమాజానికే చేటు కలిగిస్తుంది. మణిపుర్, హరియాణాల్లో చోటుచేసుకున్న ఉదంతాలు అందరికీ కనువిప్పు కావాలి. అటువంటి శక్తులను ఏకాకులను చేయటంలో అందరూ ఒక్కటి కావాలి. -
ఆశ్చర్యం: 2030 నుంచి 2018కి వచ్చాడు..!
సాక్షి, వెబ్ డెస్క్ : ‘వచ్చే ఎన్నికల్లోనూ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతుంది.’ ఇవి 2030 నుంచి 2018లోకి వచ్చిన ఓ వ్యక్తి చెబుతున్న మాటలు. వ్యక్తి ఏంటి?. 2030 నుంచి 2018కి రావడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా?. అవును. తానో టైమ్ ట్రావెలర్‌ను అని టైమ్ ట్రావెలింగ్ మెషీన్లో వెనక్కు ప్రయాణిస్తూ 2018లో చిక్కుకున్నానని అతడు చెప్పాడు. ఇంకా ఆశ్యర్యం ఏంటంటే.. అతను చెబుతున్న విషయాల్నీ వాస్తవాలేనని ‘లై డిటెక్టర్’ చెబుతోంది. అంతేకాదు, అతడి మణికట్టులో టైమ్ ట్రావెలింగ్ చెందిన చిప్ కూడా లభించింది. ఇంతకీ ఆ టైమ్ ట్రావెలర్ ఏం చెబుతున్నాడు? 2030లో అతను ఏం చూశాడు? ఇక్కడికి ఎలా వచ్చాడో చూడండి. 2030వ సంవత్సరం నుంచి టైమ్ ట్రావెలింగ్ ద్వారా 2018కు వచ్చి తాను ఇక్కడ చిక్కుకున్నట్లు నోహ్ తెలిపాడు. అపెక్స్ టీవీ అనే చానెల్ నోహ్ ఇంటర్వూను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంగతులను నోహ్ వివరించాడు. డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవుతాడని, భూ తాప తీవ్రత భారీగా పెరుగుతుందని, 2028 కల్లా ప్రజలు అంగాకర గ్రహంపై జీవించడం మొదలు పెడతారని చెప్పాడు. 2030లో ‘ఇలనా రికికే’ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తున్నట్లు తెలిపాడు. క్వాంటమ్ కంప్యూటర్స్ అనే సంస్థ తయారు చేసిన టైమ్ ట్రావెలింగ్ మిషీన్ ద్వారా అతడు ప్రస్తుత కాలానికి వచ్చినట్లు వెల్లడించాడు. కాగా, లై డిటెక్టర్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి గుండె చప్పుడు రేటును అదుపు చేసుకోవాలి. అయితే, ఇలా చేయడం కష్ట సాధ్యం. -
రక్తం కారేలా లిప్‌లాక్!
ముద్దంటే చేదా అనేది పాతకాలపు నాటి మాట. ప్రస్తుతం సినీ పరిశ్రమలో లిప్‌లాక్ ఉన్న ప్రాధ్యాన్యం అంతా ఇంతా కాదు. యువ హీరో, హీరోయిన్లు ఎలాంటి సంకోచం లేకుండా గాఢ చుంబనానికి సై అంటున్నారు. ఇక హాలీవుడ్లో అయితే చెప్పనక్కర్లేదు. అయితే ‘హ్యారీ పోటర్’ హీరోయిన్ ఎమ్మా వాట్సన్‌కు ముద్దు సీన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ‘నోవా’ అనే రచన ఆధారంగా ఓ హాలీవుడ్ చిత్రం రూపొందుతోంది. ఆ చిత్రంలో డ గ్లస్ బూత్‌కు భార్యగా ఎమ్మా నటిస్తోంది. ఈ చిత్రంలో పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరూ గాఢంగా ముద్దుపెట్టుకునే సీన్లో నటించారు. అయితే ఆ సన్నివేశాన్ని అనుకున్న విధంగా తీయడానికి నాలుగైదు సార్లు షూటింగ్లో సీన్‌ను రిపీట్ చేశారట. ఆ ముద్దు సీన్లో ఎమ్మా పెదాలకు గాయమై రక్తం కారిందట. దాంతో ఆమెకు ప్రథమ చికిత్స తప్పలేదు. ‘ముద్దు సీన్లో నా పెదవికి గాయమై రక్తం కారింది. డగ్లస్ ముక్కుకు కూడా గాయమైంద’ని వాట్సన్ తెలిపింది. -
హీరోయిన్ పెదవుల నుంచి రక్తం కారేలా లిప్ లాక్!
తెరమీద లిప్ లాక్ లు ప్రేక్షకులకు బ్రహ్మండమైన అనుభూతిని కలిగిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచడానికి లిప్ లాక్ సీన్ షూటింగ్ లో హీరో, హీరోయిన్స్ వాళ్ల కష్టం దేవుడెరుగు. అయితే 'హ్యారీ పోటర్' హీరోయిన్ ఎమ్మా వాట్సన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. డగ్లస్ బూత్ తో కలిసి చేసిన లిప్ లాక్ సన్నివేశం వాట్సన్ కు పెదాల నుంచి రక్తం కారేలా చేసింది. గాఢ చుంబనం కారణంగా పెదాలకు గాయమై రక్తం కారడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలిసింది. పాఠకులను విశేషంగా ఆకట్టుకున్న ఓ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఓ చిత్రంలో పరుగెత్తుకుంటూ వచ్చి గాఢంగా ముద్దు పెట్టుకోవాలి. ఫర్ ఫెక్షన్ కోసం ఆ సీన్ ను పదే పదే షూట్ చేయడంతో వాట్సన్ పెదాలకు గాయమై రక్తం కారడం జరిగిందన్నారు. ఈ షూటింగ్ లో డగ్లస్ ముక్కుకు కూడా గాయమైందట.