లై డిటెక్టర్‌ను కనెక్ట్ చేసుకుని ఇంటర్వూ ఇస్తున్న నోహ్
సాక్షి, వెబ్ డెస్క్ : ‘వచ్చే ఎన్నికల్లోనూ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతుంది.’ ఇవి 2030 నుంచి 2018లోకి వచ్చిన ఓ వ్యక్తి చెబుతున్న మాటలు. వ్యక్తి ఏంటి?. 2030 నుంచి 2018కి రావడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా?. అవును. తానో టైమ్ ట్రావెలర్‌ను అని టైమ్ ట్రావెలింగ్ మెషీన్‌లో వెనక్కు ప్రయాణిస్తూ 2018లో చిక్కుకున్నానని అతడు చెప్పాడు.
ఇంకా ఆశ్యర్యం ఏంటంటే.. అతను చెబుతున్న విషయాల్నీ వాస్తవాలేనని ‘లై డిటెక్టర్’ చెబుతోంది. అంతేకాదు, అతడి మణికట్టులో టైమ్ ట్రావెలింగ్ చెందిన చిప్ కూడా లభించింది. ఇంతకీ ఆ టైమ్ ట్రావెలర్ ఏం చెబుతున్నాడు? 2030లో అతను ఏం చూశాడు? ఇక్కడికి ఎలా వచ్చాడో చూడండి.
2030వ సంవత్సరం నుంచి టైమ్ ట్రావెలింగ్ ద్వారా 2018కు వచ్చి తాను ఇక్కడ చిక్కుకున్నట్లు నోహ్ తెలిపాడు. అపెక్స్ టీవీ అనే చానెల్ నోహ్ ఇంటర్వూను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంగతులను నోహ్ వివరించాడు. డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవుతాడని, భూ తాప తీవ్రత భారీగా పెరుగుతుందని, 2028 కల్లా ప్రజలు అంగాకర గ్రహంపై జీవించడం మొదలు పెడతారని చెప్పాడు.
2030లో ‘ఇలనా రికికే’ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తున్నట్లు తెలిపాడు. క్వాంటమ్ కంప్యూటర్స్ అనే సంస్థ తయారు చేసిన టైమ్ ట్రావెలింగ్ మిషీన్ ద్వారా అతడు ప్రస్తుత కాలానికి వచ్చినట్లు వెల్లడించాడు. కాగా, లై డిటెక్టర్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి గుండె చప్పుడు రేటును అదుపు చేసుకోవాలి. అయితే, ఇలా చేయడం కష్ట సాధ్యం.
Comments
Please login to add a commentAdd a comment