time traveller
-
టైమ్ ట్రావెల్ నిజమేనా? ఈ ఫొటో దానికి సాక్ష్యమా?
టైమ్ ట్రావెల్ అనేది ఒక విచిత్ర భావన. దీని గురించి చర్చలు కూడా జరుగుతుంటాయి. టైమ్ ట్రావెల్ అనేది వాస్తవికతకు దూరంగా ఉంటుంది. సినిమాల్లో టైం ట్రావెల్‌ని చూసిన ప్రేక్షకులు ఎంతగానో ఆశ్చర్యపోతుంటారు. టైమ్ ట్రావెల్ గురించి తెలుసుకుంటే అలా ట్రావెల్ చేసి, తమ గతం చూసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది. నిజానికి టైమ్ ట్రావెల్ అనేది ఇంకా సాధ్యం కాలేదు. అయితే టైమ్ ట్రావెల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటప్పుడు టైమ్ ట్రావెల్ నిజమని అనిపిస్తుంటుంది. ఇటీవల విదేశీ మీడియాలో ఇలాంటి ఒక ఫొటో వైరల్‌గా మారి, తెగ చర్చలకు దారితీసింది. ఇది టైమ్ ట్రావెల్‌ను రుజువు చేసే ఫొటో అని చెబుతున్నారు. డైలీ స్టార్ న్యూస్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం 2016వ సంవత్సరంలో ఐస్లాండ్ దేశానికి సంబంధించిన ఫేస్బుక్ గ్రూప్‌లో ఒక ఫోటో షేర్ అయ్యింది. ఈ ఫోటోపై ఈ నాటికీ చర్చలు జరుగుతున్నాయి. అందులో కనిపిస్తున్నది టైమ్ ట్రావెలర్ అయి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదన వెనుక ఒక ఆధారం కూడా ఉందని చెబుతున్నారు. టైమ్ ట్రావెల్ చేస్తున్న వ్యక్తిని పరిశీలించినప్పుడు.. అతను మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అయితే ఈ ఫోటో 1943లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఐస్లాండ్లోని రెక్జావిక్‌లో తీసినదని నివేదికలో పేర్కొన్నారు. అ ఫొటోలో జనం రద్దీ కనిపిస్తుంది. సైనికులు అటూఇటూ తిరుగుతూ కనిపిస్తారు. అయితే ఒక వ్యక్తి ఓ షాపు దగ్గర ఫోన్లో మాట్లాడుతున్నట్టు కనిపిస్తాడు. అతడే టైమ్ ట్రావెల్ చేసిన వ్యక్తి అని పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకుంటే ఆ సమయంలో ఫోన్లు అందుబాటులో లేవు. ఈ ఫొటోలో అమెరికన్ సైనికులు రోడ్డు మీద వెళుతుండగా వారి ముఖాల్లో కొంచెం ఆందోళన కనిపిస్తోంది. అయితే ఫోన్లో మాట్లాడుతున్న వ్యక్తి ముఖంలో అలాంటి ఆందోళన కనిపించడం లేదు. కాగా రోడ్డుపై నడుస్తున్నవారు చలిని తట్టుకునేందుకు ట్రెంచ్ కోట్లు ధరించి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫొటో షేర్ చేసిన ఫేస్బుక్ బృందం ఇది 1943లో తీసిన ఫొటోగా పేర్కొంది. ఇది కూడా చదవండి: 21 కి.మీ. పరిగెత్తితే 11 కిలోలు తగ్గుతారా?.. దీనిలో నిజమెంత? -
టైం ట్రావెల్ చేయనున్న కమెడియన్.. ఏకంగా రూ.50లక్షల ఖర్చుతో..!
తమిళసినిమా: టైం ట్రావెల్ చేయడానికి యోగిబాబు సిద్ధమవుతున్నారు. దర్శకుడు ఆర్.కన్నన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కథాంశంతో ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో యోగిబాబు కథానాయకుడిగా చేయనున్నారు. దీనికి పెరియాండవర్ అనే పేరును నిర్ణయించినట్లు దర్శకుడు తెలిపారు. యోగిబాబు శివుడిగా నటించనున్నట్లు చెప్పారు. నాయకిగా ఒక ప్రముఖ నటిని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. చిత్రం కోసం వీసీఆర్ రోడ్డులో రూ.50లక్షలతో శివాలయం సెట్‌ను వేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. చదవండి: Adivi Sesh: పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అడివి శేష్ -
ఓటీటీలోకి నాగ చైతన్య.. టైమ్ ట్రావెల్ కథలో జర్నలిస్ట్‌గా !
అక్కినేని నాగచైతన్య టాలీవుడ్ గుడ్ బాయ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో కింగ్ నాగార్జునతో కలిసి నటించి హిట్ కొట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు చైతూ. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో లాల్ సింగ్ చద్దా సినిమాలో నాగా చైతన్య నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడిగా రాశిఖన్నా నటిస్తుండగా.. అవికా గోర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ వెబ్ సిరీస్ ద్వారా నాగ చైతన్య ఓటీటీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సిరీస్‌లో చై జర్నలిస్ట్‌గా, నెగెటివ్ పాత్రలో చేస్తున్నట్లు సమాచారం. అందులో చైతన్య మేకోవర్ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్. మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ను ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సీజన్లో 8 నుంచి 10 ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. అలాగే ఇది టైమ్ ట్రావెల్ స్టోరీ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఒకవేళ చైతూ టైమ్ ట్రావెల్ వంటి కాన్సెప్ట్ ఉన్న వెబ్ సిరీస్‌లో జర్నలిస్ట్‌గా నెగెటివ్ రోల్ చేస్తే మంచి ఛాలెంజింగ్ పాత్ర దొరికినట్లే. ఈ పాత్రలో చైతూ ఎలా అలరిస్తాడో వేచి చూడాలి. -
‘డిసెంబర్ 25న ప్రపంచానికి భారీ షాక్.. మారనున్న జీవితాలు’
Self Proclaimed Time Traveller on Dec 25 The World Will Change: నిజంగానే మనిషికి కాలంలోకి ప్రయాణించగల శక్తి వస్తే.. మన జీవితాలు ఎలా ఉండేవో కదా. ఇన్ని మరణాలు, యుద్ధాలు, కన్నీళ్లు ఇవేవి ఉండేవి కావేమో. లేదంటే ఇంతకంటే రాక్షసంగా ఉండేవారమేమో. ఏది ఏమైనా కాలంలోకి ప్రయాణిస్తే.. అనే ఊహ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్టయ్యాయి. రీల్ మీద ఓకే కానీ.. వాస్తవంగా కాలంలోకి ప్రయాణించడం అనేది అసాధ్యం అని అందరికి తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టైమ్ ట్రావెలర్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ టిక్‌టాక్ యూజర్.. తాను 2027 నుంచి వచ్చానని భూమ్మీద తానే చివరి వ్యక్తిని అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇతడి జాబితాలోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. ఇతడైతే ఏకంగా త్వరలోనే భూమి మీద నమ్మశక్యం కానీ మార్పులు చోటు చేసుంటాయని తెలిపాడు. ఆ వివరాలు.. (చదవండి: ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?) 5ఎంటీటీ అనే ఈ టిక్‌టాక్ అకౌంట్‌కు 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొనన్ని రోజుల క్రితం ఈ యూజర్ తన టిక్‌టాక్ అకౌంట్లో నమ్మశక్యం కానీ విషయాలు పోస్ట్ చేశాడు. ‘‘డిసెంబర్ 20న ఎనిమిది మంది మనుషులకు సూర్యుని తరంగాల ద్వారా సూపర్ పవర్స్ వస్తాయి. ఇక డిసెంబర్ 25న ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురు చేసే సంఘటన చోటు చేసుకోనుంది. ఇది మానవాళి జీవితాలను శాశ్వతంగా మారుస్తుంది’’ అన్నాడు. అంతేకాక ‘‘ఈ రెండు రోజులను భవిష్యత్ తరాలు వందల ఏళ్ల పాటు గుర్తుంచుకుంటాయి. మానవ జీవితాలు ఎలా మారాయో చర్చించుకుంటాయి. ఈ రెండు రోజుల నాడు చోటు చేసుకోబోయే సంఘటనల తర్వాత.. నేను నిజమైన టైమ్ ట్రావేలర్ని అని జనాలు నమ్ముతారు’’ అని తెలిపాడు. (చదవండి: ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే?) అంతేకాక 2027 నాటికి స్వీడన్, నార్వే, యూకే, ఫిన్లాండ్ దేశాలు కలిసి అతి పెద్ద పవర్‌హౌస్‌ను నిర్మిస్తాయని.. మిగతా చిన్న దేశాలు దీనిలో చేరాలని ఆశిస్తాయని చెప్పుకొచ్చాడు. ఇక 2024లో 35 వేల ఏళ్ల క్రితం నాటి బంకర్ ఒకటి వెలుగు చూస్తుది. అర్జెంటినాలో ఈ బంకర్‌ని గుర్తిస్తారు. దీనిలో అనేక రహస్యాలు ఉంటాయి. పురాతన కాలం నాటివి, సాంకేతకతకు సంబంధించిన రహస్యాలు ఆ బంకర్లో ఉంటాయి. చదవండి: ‘2027 నుంచి వచ్చాను.. భూమ్మీద నేనే చివరి వ్యక్తిని’ -
‘2027 నుంచి వచ్చాను.. భూమ్మీద నేనే చివరి వ్యక్తిని’
Tiktok Time Traveler 2027: టైమ్ ట్రావెలింగ్ గురించి ఇప్పటికే చాలా కథలు, కథనాలు వెలువడ్డాయి. ఇక టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు టైమ్ ట్రావెలింగ్ మీద ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. నిజంగా కాలంలోకి ప్రయాణించగలిగితే.. మన జీవితాలు ఎలా ఉండేవో కదా. ఇప్పటికైతే.. కాలంలోకి ప్రయాణించడం అనేది సినిమాల్లో తప్ప వాస్తవంగా ఎక్కడా చోటు చేసుకోలేదు. భవిష్యత్తులో చెప్పలేం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే తాజాగా టిక్‌టాక్‌లో ఈ టైమ్‌ట్రావెలింగ్ ట్రెండ్ నడుస్తోంది. ఓ టిక్‌టాక్ యూజర్ తాను టైం ట్రావెలర్‌ని అని.. 2027 నుంచి ప్రస్తుత కాలానికి వచ్చానని.. భూమ్మీద తాను మాత్రమే మిగిలి ఉన్నానని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజనులు ప్రశ్నలతో సదరు యూజర్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: ఇప్పట్లో ప్రపంచం అంతం కాదు.. ఇదిగో ప్రూఫ్‌లు) టిక్‌టాక్ యూజర్ యూనికోసోబ్రెవివియంట్ సోమవారం 21 సెకన్ల నిడివి గల వీడియోని తన టిక్‌టాక్ అకౌంట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాడు. దీనిలో ఎత్తైన బిల్డింగ్లు, పార్క్ చేసి ఉన్న కార్లు తప్ప మనుషులు కనిపించలేదు. ఇక యూజర్ కనిపించకుండా కేవలం మాటలు మాత్రమే వినిపిస్తాయి. దీనిలో అతడు ‘‘నా పేరు జేవియర్.. నేను 2027 నుంచి ప్రస్తుత కాలానికి వచ్చాను. ఈ భూమ్మీద మిగిలి ఉన్న ఏకైక మనిషిని నేనే’’ అనడం వీడియోలో వినిపిస్తుంది. (చదవండి: ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?) ఈ వీడియో తెగ వైరలయ్యింది. ఇప్పటివరకు దీని 2.2 మిలియన్ల మందికి పైగా చూశారు. ఇక దీనిపై నెటిజనులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రోడ్డు మీద ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు. కచ్చితంగా ఇది లాక్డౌన్లో తీసిన వీడియోనే. ఇంట్లో కూర్చుని పిచ్చెక్కి ఇలాంటి వీడియోలు తీశాడేమో.. ఈ ప్రపంచంలో నువ్వే చివరి వ్యక్తివి అయితే ట్రాఫిక్ లైట్లు ఎలా కనిపిస్తున్నాయి’’ అంటూ ప్రశ్నించసాగారు. (చదవండి: టిక్‌టాక్‌తో చిత్ర విచిత్రంగా కన్ను కొట్టేస్తున్నారు) -
ఇప్పట్లో ప్రపంచం అంతం కాదు.. ఇదిగో ప్రూఫ్‌లు
లాస్ ఏంజెల్స్: భూగోళం అంతం గురించి ఎన్నో వార్తలు వింటున్నాం. ఆ రోజు అంతమైతది.. ప్రపంచంలో జీవి అనేదే ఉండదు.. భూగోళం మునిగిపోతుంది అని తదితర విషయాలు ప్రజలను భయాందోళన రేకెత్తించేలా వస్తుంటాయి. పైగా బ్రహ్మాంగారు చెప్పారు.. ఇదిగో సూచనలు.. సంకేతాలు అంటూ చెబుతూ మరికొందరు చెబుతుంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒకరు మన ఆదిత్య-369 సినిమాలో మాదిరి ఒక వ్యక్తి భవిష్యత్ కాలానికి వెళ్లి వచ్చాడట. ఇప్పట్లో భూగోళం అంతం కాదని తేల్చి చెప్పాడు. 5 వేల సంవత్సరానికి మాత్రం ప్రపంచం ఉండదంటూ.. ఇదిగో నేను చెప్పే దానికి ప్రూఫ్‌లుగా చెబుతూ కొన్ని ఫొటోలు చూపిస్తున్నాడు. ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎడ్వర్డ్ అనే ప్రయాణికుడు ఈ విషయాన్ని తెలిపాడు. ఓ యూట్యూబ్ ఛానల్ అపెక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేను భవిష్యత్‌కు వెళ్లానని.. ఆ సమయంలో భూగోళం అంతా నీటిలో మునిగిపోయి ఉంది’ అని వివరించాడు. ఇవిగో వాటికి ప్రూఫ్ అంటూ కొన్ని ఫొటోలను చూపించాడు. నీటిలో ఒక నగరమంతా మునిగి ఉన్న ఫొటోను బహిర్గత పరిచాడు. కేవలం భవనాలు తప్పా ఇంకేమీ కనిపించడం లేదు. ఐదు వేల సంవత్సరంలో భూగోళం మునిగిపోయింది అని చెప్పాడు. 2004లో తాను 3 వేల సంవత్సరాలు దాటి భవిష్యత్ కాలానికి వెళ్లినట్లు తెలిపాడు. ‘నేనొక కథ చెబితే మీకు అద్భుతంగా అనిపిస్తుంది. 2004లో నేను ఓ సీక్రెట్ మిషన్ ద్వారా భవిష్యత్ కాలానికి వెళ్లాను. అమెరికాలోని లాస్ఏంజెల్స్ నగరమంతా నీటిలో మునిగిపోయి ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా అలా జరిగింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన అనంతరం వాటికి సంబంధించిన ఫొటోలను లాబోరేటరిలో చూడగా ఈ విషయం తెలిసింది’ అని ఎడ్వర్డ్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూ 2018 ఫిబ్రవరిలో చేయగా తాజాగా మళ్లీ బయటకు వచ్చి సంచలనంగా మారింది. ‘అప్పుడు నేను ఓ చెక్కపై నిలబడ్డా. నేనొక్కడినే కాదు ఇళ్లు, భవనాలు అన్నీ కలపతో చేసి ఉన్నవే. అప్పుడు నేను ఇది లాస్ ఏంజిల్స్ నగరంగా గుర్తించా.’ అని వివరించాడు. అయితే ఇంటర్వ్యూ ఇచ్చిన ఎడ్వర్డ్ ముఖం కనిపించకుండా చేశారు. అతడి స్వరాన్ని కూడా కొద్దిగా మార్చి ప్రసారం చేశారు. అతడికి ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఇది నేను తొలిసారి చేసిన ‘టైమ్ యాత్ర’ కాదు అని ఎడ్వర్డ్ చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ప్రపంచం అంతం అవుతుందనే వార్తలు గతంలో కూడా చాలా వచ్చాయి. ఎడ్వర్డ్ చెబుతున్న దాన్ని చూస్తుంటే ఇప్పట్లో ప్రపంచం అంతం కాదనే విషయం స్పష్టమవుతోంది. మన పిల్లలు తాతముత్తాలు అయినా కూడా ఈ భూగోళం సురక్షితంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్తతోనైనా ఇకపై భూగోళం అంతం వార్తలు నమ్మొద్దు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?
గడియారం గిర్రున వెనక్కి తిరిగితే... ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి రావచ్చు... గిర్రున ముందుకు తిరిగితే... ఫ్యూచర్‌ని చూడొచ్చు. ఇంగ్లిష్ సినిమాల్లో ఇలాంటి కథలు కామన్. తెలుగు ప్రేక్షకులకూ పాస్ట్నీ, ఫ్యూచర్‌నీ చూపించిన ఘనత ‘ఆదిత్య 369’ది. అప్పట్లో గ్రాఫిక్స్ సౌకర్యం లేని రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం అంటే చిన్న విషయం కానే కాదు. అందుకే తొలి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’ క్లాసిక్‌గా నిలిచిపోయింది. నేటి (జూలై 18)తో ఈ చిత్రానికి 30 ఏళ్లు. ఈ టైమ్ ట్రావెల్ కథ పట్టాలెక్కడానికి ముఖ్య కారణం ప్రముఖ దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. 30 ఏళ్లయిన సందర్భంగా హీరో బాలకృష్ణ – దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు – నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.. ముగ్గురూ బాలూని తలుచుకున్నారు. ఇక ‘ఆదిత్య 369’ గురించి ఈ ముగ్గురూ ఏం చెప్పారో తెలుసుకుందాం. విమానం స్మూత్‌గా వెళుతోంది. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పక్క పక్క సీట్లలో కూర్చుని ఉన్నారు. ఈ ట్రావెల్ టైమ్‌లో ఎస్పీబీకి తన మనసులో ఉన్న ట్రావెల్ మిషన్ స్టోరీ చెప్పారు సింగీతం. ఎస్పీబీ ఎగ్జయిట్ అయి, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ని సింగీతంని కలవమన్నారు. అలా ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఎస్పీబీ కారణం అయ్యారు. ఈ విషయం గురించి సింగీతం మాట్లాడుతూ – ‘‘ఆ రోజు నేను ఎస్పీబీగారిని కలవకపోతే ఈ సినిమా ఉండేది కాదేమో. అలాగే శ్రీ కృష్ణదేవరాయలు పాత్రను బాలకృష్ణగారు చేయకపోతే సినిమా లేదని కథ చెప్పినప్పుడే కృష్ణప్రసాద్‌గారు అన్నారు. అయితే టైం మెషిన్‌ను తాను కనిపెట్టినట్లు చెప్తున్నారని, కానీ, హెచ్‌జీ వెల్స్ అనే రైటర్ రాసిన ది టైమ్ మెషిన్ అనే పుస్తకం తనకు కాలేజీ రోజుల నుంచే స్ఫూర్తి అని సింగీతం అంటున్నారు. అంతేకాదు ఈ సినిమా టీం పంచుకున్న విశేషాలు కింద వీడియోలో ఉన్నాయి. ఎస్పీబీతో బాలకృష్ణ, శివలెంక బాలకృష్ణగారికి నేను 30 నిమిషాల పాటు కథ చెబితే, ‘నాన్నగారు (ఎన్టీఆర్) కృష్ణదేవరాయలు పాత్ర చేశారు. నాకూ చేయాలని ఉంది’ అని 30 సెకన్లలో సినిమాకి ఓకే చెప్పారు. అప్పటికి ఇండియాలో తొలి సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఆదిత్య 369’. టైమ్ మెషీన్ నేపథ్యంలో సాగే సినిమా. ఎంతో ఖర్చు, కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ నిర్మించడానికి ముందుకు వచ్చారు కృష్ణప్రసాద్‌గారు. ప్రతి సినిమా పునః పుట్టినరోజు చేసుకుంటుంది. అయితే, ‘ఆదిత్య 369’ ప్రత్యేకత ఏంటంటే... ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ మధ్య మా మనవరాలి పెళ్లి అమెరికాలో జరిగితే మేం ఇండియాలో లైవ్ లో చూశాం. ఆ తర్వాత చాలామంది ఫోన్ చేసి, ‘సార్.. మీరు ఆ రోజు ‘ఆదిత్య 369’లో టీవీలో పెళ్లి చూస్తారని చెప్పింది ఈ రోజు జరిగింది’ అన్నారు. సినిమాలో పోలీస్ స్టేషన్‌ను ఫైవ్ స్టార్ హోటల్‌లా చేశాం. అదింకా రాలేదు. ఎయిర్ ట్రాఫిక్ గురించి చెప్పాం. అదింకా రాలేదు. భవిష్యత్తులో అవన్నీ వస్తాయి. నేను ఎన్నో సినిమాలు చేశాను. అయితే అవి ఈ రోజులకు అన్వయించుకునే సినిమాలు కాదు. ఈ ఒక్క ‘ఆదిత్య 369’ను మాత్రం అన్వయించుకోవచ్చు’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవలసింది శివైక్యమైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి గురించి. ఆయనే మా సంధానకర్త. ఇటువంటి సినిమా చేయడానికి నిర్మాతకు ధైర్యం ఉండాలి. దర్శకుడికి ప్యాషన్ ఉండాలి. హీరోకి ప్యాషన్, ధైర్యంతో పాటు దాని గురించి అవగాహన ఉండాలి. మేం ట్రెండ్ సెట్టర్స్ అనుకోండి. ఇటువంటి సినిమా ఇప్పటివరకూ మళ్ళీ రాలేదు. అప్పట్లో ‘ఆదిత్య 369’ చేసేటప్పుడు చాలామంది సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ సినిమాకు గుండెకాయ శ్రీ కృష్ణదేవరాయలు పాత్ర. ఈ సినిమాలో ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. గ్రాఫిక్స్ లేని రోజుల్లో మొట్టమొదటిసారి వి.హెచ్.ఎస్ కెమెరాతో షూట్ చేసి... సినిమా నెగటివ్ మీదకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. భారతీయులు ఇటువంటి సినిమా చేయగలరని నిరూపించాం. కృష్ణ్ణప్రసాద్‌గారు ‘ఆదిత్య 369’ తర్వాత ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. అలాంటి నిర్మాత ఇండస్ట్రీకి అవసరం. ముందు ముందు ‘ఆదిత్య 369’కి సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు. బాలకృష్ణ, సింగీతం, శివలెంక కృష్ణప్రసాద్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – ‘‘మా బేనర్లో తొలి సినిమా ‘చిన్నోడు పెద్దోడు’ విజయవంతమైన ఉత్సాహంలో ఉన్న సమయంలో బాలు (ఎస్పీబీ) అంకుల్ ‘కృష్ణా.. ఓ పెద్ద సినిమా చెయ్. నేను హీరోలతో మాట్లాడతాను’ అన్నారు. సింగీతంగారిని కలమన్నారు. కలిస్తే.. ఆయన ‘ఆదిత్య 369’ కథ చెప్పారు. టైమ్ ట్రావెలింగ్ కథ. భారతీయ తెరపై రాని కథాంశంతో సినిమా తీయడం ఒక రకమైన సాహసమని సింగీతంగారితో అన్నాను. బాలు అంకుల్ అయితే ‘భవిష్యత్తులో నువ్వు ఎన్ని సినిమాలైనా చేయవచ్చు. ఈ సినిమా ఒక ల్యాండ్ మార్క్‌లా నిలబడుతుంది’ అన్నారు. ఆయన ఇచ్చిన ధైర్యంతో సింగీతంగారితో ఈ సినిమా చేస్తా’ అన్నాను. కథ విని, ‘ఆదిత్య 369’ని బాలకృష్ణగారు చేయాలనుకోవడం నా అదృష్టం అనుకోవాలి. 1990లో ఈ సినిమా మొదలైంది. తొలి షెడ్యూల్ పూర్తయ్యాక పీసీ శ్రీరామ్ గారికి సుస్తీ చేసింది. దాంతో కెమెరామేన్ వీఎస్సార్ స్వామిగారితో బాలకృష్ణగారు మాట్లాడారు. అలా... వర్తమానంలో నడిచే సీన్లకు పీసీ శ్రీరామ్, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో సన్నివేశాలకు వీఎస్సార్ స్వామిగారు, భవిష్యత్తును చూపించే సీన్లకు కబీర్ లాల్ ఛాయాగ్రాహ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్ర కళాదర్శకుడు పేకేటి రంగాగారికి, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన సాంబ శివరావుగారికి నంది అవార్డు వచ్చింది. గౌతమ్ రాజుగారి ఎడిటింగ్, ఇళయరాజాగారి మ్యూజిక్, బాలు అంకుల్, జానకిగారు, జిక్కీ గార్ల గానం.. అన్నీ అద్భుతం. అయితే బడ్జెట్ పరంగా అనుకున్నదానికంటే పెరిగితే బయ్యర్లు సహకరించారు. వ్యాపారంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బు సంపాదిస్తాం. కానీ, పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ‘ఆదిత్య 369’ వల్ల నాకు వచ్చిన గౌరవం 50 ఏళ్లయినా ఉంటుంది. టాప్ 100 సినిమాల్లో ఈ సినిమా ఒకటి కావడం నా అదృష్టం’’ అన్నారు. -
భవిష్యత్తుని చూపెట్టే టెనెట్
టైమ్ ట్రావెల్ సినిమా అనగానే మన ‘ఆదిత్య 369’ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గుర్తుకు వస్తారు. హాలీవుడ్ సినిమాల్లో టైమ్ ట్రావెల్ అనగానే క్రిస్టోఫర్ నోలన్ గుర్తుకు వస్తారు. ‘మెమెంటో’, ‘బ్యాట్‌మెన్ సిరీస్’లతో పాటు ‘ఇన్సెప్షన్’, ‘ఇంటర్స్టెల్లార్’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిస్టోఫర్. కాగా ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్ తదితర చిత్రాల్లో టైమ్ ట్రావెల్ నేపథ్యం ఉంటుంది. దాంతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘టెనెట్’ కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని చాలామంది ఊహించారు. ‘‘ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండదు. అలాగే నా గత కొన్ని చిత్రాల్లోలా ఇందులో నేను ఫిజిక్స్ పాఠం చెప్పటం లేదు. అయితే గతం నుండి భవిష్యత్తుని చూడటం ఈ సినిమాలో ఉంటుంది. కానీ అదొక జర్నీలా ఉండదు. ఇది ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పగలను అన్నారు క్రిస్టోఫర్. తన భార్య ఎమ్మా థామస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు నోలన్. ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలను కుంటోంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ థియేటర్లు రీ ఓపెన్ అవుతాయో అక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. విడుదల తేదీని వాయిదా వేయాలనుకోవడంలేదని హాలీవుడ్ టాక్. -
ఆమె టైమ్ ట్రావెలరా.. అంతా ట్రాష్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం స్వీడన్లో గళమెత్తి ప్రపంచంలోని వంద నగరాల్లో కొన్ని లక్షల గొంతలు తనలాగే గళమెత్తేలా స్ఫూర్తినిచ్చిన ‘క్లైమేట్ ఛేంజ్’ కార్యకర్త, 16 ఏళ్ల బాలిక గ్రేటా థన్‌బెర్గ్ నిజంగా ‘టైమ్ ట్రావెలరా (కాలంతోపాటు ఓ కాలం నుంచి మరో కాలంకు ప్రయాణించే శక్తి కలిగిన)’? సరిగ్గా 121 సంవత్సరాల క్రితం 1898లో కెనడాలోని యుకాన్ టెరిటరీలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బాలిక ఓ బావి నుంచి నీళ్లు తోడుతున్న దృశ్యం ఫొటోను చూసినట్లయితే ఎవరైనా ఇలా ప్రశ్నించాల్సిందే. వాషింగ్టన్ యూనివర్సిటీ పురావస్తు విభాగంలో లభించిన ఓ ఫొటోను యూనివర్సిటీ వెబ్సైట్లో పోస్ట్ చేయగా, అచ్చంగా ఆమె మన గ్రేటాలాగా ఉందంటూ మరో నెటిజన్ రెండు ఫొటోలను కలిపి పోస్ట్ చేయడంతో ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నిజంగా ఆమె టైమ్ ట్రావెలర్. మన భవిష్యత్తు రక్షించేందుకు గతం నుంచి ఆమె భవిష్యత్తులోకి వచ్చారు. బ్యాక్ టు ది వ్యూచర్ సినిమా ఇది సాధ్యమని చెబుతోంది’ అని ఒకరు ట్వీట్ చేయగా, పలువురు ఆయనతో ఏకీభవిస్తూ ట్వీట్ చేస్తున్నారు. ‘ఇదంతా ట్రాష్. కాకమ్మ కథలు మేము నమ్మం’ అన్నంటున్న వాళ్లు ఉన్నారు. ఏదేమైనా మన భవిష్యత్తును రక్షించేందుకు పోరాడుతున్నందున గ్రేటా నిజంగా ‘టైమ్ ట్రావెలర్’ అని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటో మార్ఫింగ్ చేశారేమోనంటూ మరి కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. -
సూపర్ హ్యూమన్స్‌తో మానవాళి అంతం
లండన్: స్టీఫెన్ హాకింగ్.. పరిచయం అక్కర్లేని పేరు. విశ్వ ఆవిర్భావ రహస్యాలను, టైమ్ ట్రావెల్ సహా భవిష్యత్ పరిణామాలను సశాస్త్రీయంగా పండిత, పామరులకు అర్థమయ్యేలా వివరించిన భౌతిక శాస్త్రవేత్త హాకింగ్. బిగ్ బ్యాంగ్ నుంచి బ్లాక్ హోల్స్ వరకు విశ్వ రహస్యాలను వివరిస్తూ హాకింగ్ రాసిన ‘ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ అనే పుస్తకం ప్రపంచవ్యాప్తంగా పాపులర్. మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతూ, వీల్ చెయిర్‌కే పరిమితమైన పరిస్థితిలోనూ ఆయన పరిశోధనలను వదల్లేదు. ఏడు నెలల క్రితమే ఈయన మరణించిన విషయం తెలిసిందే. ఆయన ఆలోచనలతో కూడిన పుస్తకం ఒకటి త్వరలో మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుత సాధారణ మానవాళిని సమూలంగా అంతమొందించే ‘సూపర్ హ్యూమన్’ తరమొకటి రాబోతోందని ‘బ్రీఫ్ ఆన్సర్స్ టు ద బిగ్ క్వశ్చన్స్’ అనే పుస్తకంలో హెచ్చరించారు. అత్యాధునిక జన్యుసాంకేతికత సాయంతో అపార మేధోశక్తి సామర్థ్యాలతో రూపొందనున్న ఆ సూపర్ హ్యూమన్స్‌తో సాధారణ మనుషులు ఎందులోనూ పోటీ పడలేరన్నారు. ‘సూపర్ హ్యూమన్స్ జీవం పోసుకున్న తరువాత సాధారణ మానవాళికి మరణం తప్ప మరో మార్గం ఉండదు’ అని స్పష్టం చేశారు. ‘సంపన్నులు తమతో పాటు, తమ పిల్లల డీఎన్ఏలో అవసరమైన మేరకు మార్పులు చేసుకుని.. అద్భుతమైన జ్ఞాపకశక్తి, గొప్ప వ్యాధి నిరోధకత, అంతులేని మేధో శక్తి, మరింత ఆయుర్దాయం.. మొదలైన ఎంపిక చేసుకున్న లక్షణాలతో సూపర్ హ్యూమన్స్‌గా తమ సంతతిని వృద్ధి చేసుకుంటారు’ అని చెప్పారు. మేధో సామర్థ్యాన్ని, భావోద్వేగాలను మార్పు చేసుకోగల జన్యు సాంకేతికతను మన శాస్త్రవేత్తలు ఈ శతాబ్దంలోనే అభివృద్ధి చేయగలరని బలంగా విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ముందు జాగ్రత్తగా మానవుల జన్యు క్రమంలో మార్పులు చేయడాన్ని నిషేధించేలా చట్టాలు రూపొందించాల్సి రావచ్చని కూడా ఆయన ఊహించారు. క్రిస్పర్ అనే డీఎన్ఏ ఎడిటింగ్ విధానాన్ని కూడా ఆ పుస్తకంలో ప్రస్తావించారు. ప్రమాదకర జన్యువులను మార్చడం లేదా కొత్త జన్యువులను చేర్చడం ఆ విధానం ద్వారా సాధ్యమవుతుంది. ఇది ఆవిష్కృతమై ఆరేళ్లైంది. హాకింగ్ పేర్కొన్న ఈ సూపర్ హ్యూమన్స్ థీయరీని పలువురు శాస్త్రవేత్తలు ప్రశంసిస్తున్నారు. ‘భూమిని, వాతావరణాన్ని.. దాని పరిమితికి మించి దుర్వినియోగపర్చాం. దాని పర్యవసానంగా రానున్న ప్రమాదరక సవాళ్లను ఎదుర్కోవడం ప్రస్తుతం మనకున్న మేధో పరిమితులతో సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భూమిని సమూల విధ్వంసం నుంచి కాపాడేందుకు హాకింగ్ చెబుతున్న సూపర్హ్యూమన్స్ మనకు అవసరం’ అని యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో క్లైమేట్ సైన్స్ బోధించే క్రిస్ రాప్లీ వ్యాఖ్యానించారు. -
ఆశ్చర్యం: 2030 నుంచి 2018కి వచ్చాడు..!
సాక్షి, వెబ్ డెస్క్ : ‘వచ్చే ఎన్నికల్లోనూ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతుంది.’ ఇవి 2030 నుంచి 2018లోకి వచ్చిన ఓ వ్యక్తి చెబుతున్న మాటలు. వ్యక్తి ఏంటి?. 2030 నుంచి 2018కి రావడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా?. అవును. తానో టైమ్ ట్రావెలర్‌ను అని టైమ్ ట్రావెలింగ్ మెషీన్లో వెనక్కు ప్రయాణిస్తూ 2018లో చిక్కుకున్నానని అతడు చెప్పాడు. ఇంకా ఆశ్యర్యం ఏంటంటే.. అతను చెబుతున్న విషయాల్నీ వాస్తవాలేనని ‘లై డిటెక్టర్’ చెబుతోంది. అంతేకాదు, అతడి మణికట్టులో టైమ్ ట్రావెలింగ్ చెందిన చిప్ కూడా లభించింది. ఇంతకీ ఆ టైమ్ ట్రావెలర్ ఏం చెబుతున్నాడు? 2030లో అతను ఏం చూశాడు? ఇక్కడికి ఎలా వచ్చాడో చూడండి. 2030వ సంవత్సరం నుంచి టైమ్ ట్రావెలింగ్ ద్వారా 2018కు వచ్చి తాను ఇక్కడ చిక్కుకున్నట్లు నోహ్ తెలిపాడు. అపెక్స్ టీవీ అనే చానెల్ నోహ్ ఇంటర్వూను ప్రసారం చేసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో జరగబోయే కొన్ని సంగతులను నోహ్ వివరించాడు. డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవుతాడని, భూ తాప తీవ్రత భారీగా పెరుగుతుందని, 2028 కల్లా ప్రజలు అంగాకర గ్రహంపై జీవించడం మొదలు పెడతారని చెప్పాడు. 2030లో ‘ఇలనా రికికే’ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా పని చేస్తున్నట్లు తెలిపాడు. క్వాంటమ్ కంప్యూటర్స్ అనే సంస్థ తయారు చేసిన టైమ్ ట్రావెలింగ్ మిషీన్ ద్వారా అతడు ప్రస్తుత కాలానికి వచ్చినట్లు వెల్లడించాడు. కాగా, లై డిటెక్టర్ నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి గుండె చప్పుడు రేటును అదుపు చేసుకోవాలి. అయితే, ఇలా చేయడం కష్ట సాధ్యం.