టైమ్ ట్రావెల్ సినిమా అనగానే మన ‘ఆదిత్య 369’ సినిమా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గుర్తుకు వస్తారు. హాలీవుడ్ సినిమాల్లో టైమ్ ట్రావెల్ అనగానే క్రిస్టోఫర్ నోలన్ గుర్తుకు వస్తారు. ‘మెమెంటో’, ‘బ్యాట్‌మెన్ సిరీస్’లతో పాటు ‘ఇన్‌సెప్షన్’, ‘ఇంటర్‌స్టెల్లార్’ వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు క్రిస్టోఫర్. కాగా ఇన్‌సెప్షన్, ఇంటర్‌స్టెల్లార్ తదితర చిత్రాల్లో టైమ్ ట్రావెల్ నేపథ్యం ఉంటుంది. దాంతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘టెనెట్’ కూడా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని చాలామంది ఊహించారు.
‘‘ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉండదు. అలాగే నా గత కొన్ని చిత్రాల్లోలా ఇందులో నేను ఫిజిక్స్ పాఠం చెప్పటం లేదు. అయితే గతం నుండి భవిష్యత్తుని చూడటం ఈ సినిమాలో ఉంటుంది. కానీ అదొక జర్నీలా ఉండదు. ఇది ప్రేక్షకులకు పూర్తిగా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పగలను అన్నారు క్రిస్టోఫర్. తన భార్య ఎమ్మా థామస్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు నోలన్. ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలను కుంటోంది. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ థియేటర్లు రీ ఓపెన్ అవుతాయో అక్కడ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. విడుదల తేదీని వాయిదా వేయాలనుకోవడంలేదని హాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment