ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా ఆస్కార్ వచ్చేంతలా ఈ మూవీలో ఏముంది? ప్రత్యేకత ఏంటి?
హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఇప్పుడు తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు.
(ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?)
సాధారణంగా హాలీవుడ్ సినిమాలంటే గ్రాఫిక్స్ కచ్చితంగా ఉంటాయి. కానీ 'ఓపెన్ హైమర్' కోసం అన్ని రియల్‌గా తీశారు. న్యూక్లియర్ బాంబు పేలుడు సీన్స్ కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటివి చేయకుండానే తీయడం విశేషం.
అలానే ఇంగ్లీష్ సినిమాల నిడివి గంటన్నర లేదంటే రెండు గంటల్లోపే ఉంటుంది. 'ఓపెన్ హైమర్' మాత్రం దాదాపు మూడు గంటలకు పైగా నిడివితో తీశారు. గతేడాది జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు అనమాట.
(ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్)
ఇప్పుడంతా కలర్ ఫార్మాట్‌లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నారు. 'ఓపెన్ హైమర్'లో కొన్ని సీన్స్ మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. అలా ఇది తొలి బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ మూవీగా రికార్డ్ సృష్టించింది.
ఇదే సినిమాలోని రొమాంటిక్ సన్నివేశంలో భారతీయ మతగ్రంథాలు ఉండటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది సరికాదని చాలామంది భారతీయ ప్రేక్షకుల విమర్శలు చేశారు. ఆ సీన్ తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఇన్ని విశేషాలున్న సినిమా.. మన ప్రేక్షకుల్లో ముప్పావంతు మందికి నచ్చలేదు! ఇది ఇక్కడ ట్విస్ట్.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment