Oscars 2024
-
Oscars 2024: ‘ఉత్తమ చిత్రం’ వివాదంపై స్పందించిన నటుడు
ఆస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో నంబర్ వన్ అవార్డుగా ‘ఉత్తమ చిత్రం ’ విభాగాన్ని భావిస్తారు. అందుకే ఈ విభాగాపు అవార్డును వేడుకలో చివరిగా ప్రకటిస్తారు. అలాగే వేడుకలో చివరి మూమెంట్స్ కాబట్టి ఏదో ఒక డ్రామా క్రియేట్ చేస్తారు. కానీ అలాంటి డ్రామా గడిచిన ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 96వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో కనిపించలేదు. ‘ఉత్తమ చిత్రం’ అవార్డును ప్రకటించిన ప్రముఖ నటుడు అల్ పచినో చాలా సాదాసీదాగా వెల్లడించేశారు. పోటీలో ఉన్న పది చిత్రాల పేర్లు చెప్పకుండా.. అవార్డు సాధించిన చిత్రాన్ని ప్రకటించేశారు. కవర్ని మెల్లిగా తెరుస్తూ.. ‘నా కళ్లకు ‘ఆపెన్‌హైమర్’ కనిపిస్తోందని సింపుల్‌గా ప్రకటించారు. ఇలా చేయడం పట్ల హాలీవుడ్‌లోని కొందరు నటీనటులు, ఇతర ప్రముఖులు విముఖత వ్యక్తపరుస్తున్నారు. ఈ విషయంపై మంగళవారం అల్ పచినో స్పందించారు. ‘‘ఆస్కార్ వేడుకలో అవార్డు ప్రెజెంటర్‌గా పాల్గొనడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇక వేడుకలో ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలవడానికి పోటీ పడ్డ పది చిత్రాల పేర్లను నేను చదవకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయని తెలిసింది. కానీ ఇది నేను ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు. అది ఆస్కార్ ప్రొడ్యూసర్ల నిర్ణయం. వేడుక ఆద్యంతం ఈ పది సినిమాల యూనిట్ వాళ్లు హైలైట్ అవుతూనే ఉన్నందువల్ల వారు ఇలా నిర్ణయించి ఉండొచ్చు. ఆస్కార్‌కు నామినేట్ కావడం అనేది ఎవరి జీవితంలోనైనా ఓ మంచి మైల్స్టోన్. ఫిల్మ్ ఇండస్ట్రీ వ్యక్తిగా నాకు ఈ విషయం తెలుసు. వారి పేర్లు ప్రస్తావించకపోవడం అనేది బాధకు గురి చేసే విషయమే. ఈ ఘటన పట్ల బాధపడిన వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చెబుతూ ఓ స్టేట్మెంట్ను విడుదల చేశారు అల్ పచినో. ఇక ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఆపెన్‌హైమర్’, ‘అమెరికన్ ఫిక్షన్’, ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’, ‘బార్బీ’, ‘ది హోల్డోవర్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ‘మేస్ట్రో’, ‘΄ాస్ట్ లీవ్స్’, ‘పూర్ థింగ్స్’, ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాలు ΄ోటీ పడగా, ‘ఆపెన్‌హైమర్’ అవార్డు దక్కించుకుంది. -
ఆస్కార్ అవార్డు వేడుకల్లో హైలెట్‌గా మెస్సీ డాగ్..! ఏం చేసిందంటే..
బోర్డర్ కోలి బ్రీడ్‌కి చెందిన మెస్సీ అనే కుక్క నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' అనే సినిమా ఆస్కార్స్ 2024కి నామినేట్ అయ్యింది. అయితే ఆ మూవీకి అవార్డులు రాకపోయినా ఈ కుక్క మంచి ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా దాని హావభావాలతో అందర్నీ కట్టిపడేసింది. ఆ మూవీతో 2023లో మంచి స్టార్డమ్ తెచ్చుకున్న ఈ కుక్క ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో మాత్రం అందరి అటెన్షన్ తనవైపుకి తిప్పుకుని మరీ హైలెట్‌గా నిలిచింది. ఈ వేడుకలకు ఆ మెస్సీ డాగ్ బో టై ధరించి హుందాగా వచ్చింది. ఈ కార్యక్రమంలో 'ఓపెన్ హైమర్' మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఈ చిత్రంలో రాబర్డ్ డౌనీ జూనియర్ పాత్రలో అలరించిన ఐరన్ మ్యాన్ నటుడుకి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చింది. అయితే ఈ ఆస్కార్ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆ అవార్డుని ప్రకటించగానే.. మెస్సీ తన ముందరి కాళ్లతో తప్పట్లుకొడతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో హెస్ట్ జిమ్మీ ఆ కుక్క ఆటిట్యూడ్‌ని హైలెట్ చేస్తూ మెచ్చుకున్నాడు. the dog from anatomy of a fall looks just like cillian murphy when he's in a public place and needs to socialize, so cute of him. i love you messi pic.twitter.com/cR7vPzoNkp — pau la 🦢 (@sexiestlawyer) March 11, 2024 అంతేగాదు 2006లో వచ్చిన " ది షాగీ డాగ్" మూవీ గురించి ప్రస్తావిస్తూ దానికి సీక్వెల్‌గా సినిమా తీయాలనుకుంటే ఈ మెస్సీని పెట్టుకుంటే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మెచ్చుకోలుగా అన్నాడు. ఇక ఈ మెస్సీ డాగ్ నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' మూవీలో బాగా గుర్తుండిపోయే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ.. ఈ కుక్క ప్రేక్షకుల మనుసులో చెరగని ముద్ర వేయించుకుందని ప్రశంసించాడు. ఈ వేడుకల్లో మెస్సీ డాగ్ హైలైట్‌గా నిలిచి అందర్నీ అలరించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది. they really had Messi, the dog from Anatomy of a Fall, applauding Robert Downey Jr. after his acceptance speech lol #Oscars pic.twitter.com/XBrxoAPGq2 — Spencer Althouse (@SpencerAlthouse) March 11, 2024 (చదవండి: ఆస్కార్ 2024: రెడ్ కార్పెట్‌పై తడబడినా..భలే గమ్మత్తుగా కవర్ చేసిన నటి!) -
Oscars 2024: ప్చ్.. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది..
గతేడాది ఆర్ఆర్ఆర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు), ద ఎలిఫెంట్ విస్పరర్స్ ( బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా) సినిమాలకు ఆస్కార్ రావడంతో భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కానీ ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా కూడా అకాడమీ అవార్డుల బరిలో లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. కొన్ని సినిమాలను నామినేట్ చేసినప్పటికీ ఫైనల్ లిస్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే భారత సంతతికి చెందిన విదేశీవాసి సినిమా ఆస్కార్ బరిలో ఉండటంతో అందరూ కాస్త ఆసక్తి చూపించారు. టు కిల్ ఎ టైగర్.. ఢిల్లీకి చెందిన కెనడావాసి నిషా పహుజా.. టు కిల్ ఎ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. గతేడాది అక్టోబర్‌లో ఏ డిస్ట్రిబ్యూటర్ సాయం లేకుండా అమెరికాలోని కొన్ని థియేటర్లో విడుదల చేసింది. ఆస్కార్‌కు ఎప్పుడైతే నామినేట్ అయిందో అందరూ ఈ చిత్రంపై ఆసక్తి చూపించారు. దీంతో ఫిబ్రవరిలో రీరిలీజ్ చేయడం, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను కొనుక్కోవడం చకచకా జరిగిపోయాయి. ఇండియాలో మాత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే వచ్చేసింది. ఆదివారం (మార్చి 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రా, దేవ్ పటేల్, మిండీ కలింగ్, రూపీ కౌర్ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఏ సినిమాకు వచ్చిందంటే? తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఈ మూవీని వెనక్కు నెట్టి '20 డేస్ ఇన్ మరియుపోల్' ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ అవార్డు ఎగరేసుకుపోయింది. ఈ సినిమాలో స్పెషల్ ఏముందంటారా? ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర వార్ జరుగుతుంది. మారియుపోల్ నగరంలో చిక్కుకున్న ఉక్రెయిన్ జర్నలిస్టులు రష్యా దురాగతాలను ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రయత్నిస్తారు. వారి పోరాటమే సినిమా కథ! చదవండి: 'ఓపెన్ హైమర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు -
ఆస్కార్‌లో 'ఓపెన్ హైమర్' సెన్సేషన్.. ఈ సినిమా ఎందుకంత స్పెషల్?
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా ఆస్కార్ వచ్చేంతలా ఈ మూవీలో ఏముంది? ప్రత్యేకత ఏంటి? హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఇప్పుడు తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?) సాధారణంగా హాలీవుడ్ సినిమాలంటే గ్రాఫిక్స్ కచ్చితంగా ఉంటాయి. కానీ 'ఓపెన్ హైమర్' కోసం అన్ని రియల్‌గా తీశారు. న్యూక్లియర్ బాంబు పేలుడు సీన్స్ కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటివి చేయకుండానే తీయడం విశేషం. అలానే ఇంగ్లీష్ సినిమాల నిడివి గంటన్నర లేదంటే రెండు గంటల్లోపే ఉంటుంది. 'ఓపెన్ హైమర్' మాత్రం దాదాపు మూడు గంటలకు పైగా నిడివితో తీశారు. గతేడాది జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు అనమాట. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) ఇప్పుడంతా కలర్ ఫార్మాట్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నారు. 'ఓపెన్ హైమర్'లో కొన్ని సీన్స్ మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. అలా ఇది తొలి బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ మూవీగా రికార్డ్ సృష్టించింది. ఇదే సినిమాలోని రొమాంటిక్ సన్నివేశంలో భారతీయ మతగ్రంథాలు ఉండటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది సరికాదని చాలామంది భారతీయ ప్రేక్షకుల విమర్శలు చేశారు. ఆ సీన్ తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఇన్ని విశేషాలున్న సినిమా.. మన ప్రేక్షకుల్లో ముప్పావంతు మందికి నచ్చలేదు! ఇది ఇక్కడ ట్విస్ట్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఆస్కార్ వేదికపై మరోసారి ఆర్ఆర్ఆర్.. అట్లుంది మరి మనతోని!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది ఎన్నో రికార్డులను తిరగరాసింది. కలెక్షన్సే కాదు అంతకుమించి అన్నట్లు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాటు నాటు పాట అయితే ఏకంగా హాలీవుడ్ గడ్డపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను వశం చేసుకుంది. తాజాగా జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లోనూ మరోసారి ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. నాటు నాటు విజువల్స్.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సోమవారం (మార్చి 11) నాడు అకాడమీ అవార్డులను ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు ప్రకటించే సమయానికి నాటు నాటు పాట విజువల్స్‌ను బ్యాగ్రౌండ్లో ప్లే చేశారు. ఓపక్క ఆ పాట ప్లే అవుతుండగా అరియానా గ్రాండే, సింతియా ఎరివో స్టేజీపైకి వచ్చి విజేతలను ప్రకటించారు. బార్బీ సినిమాలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? అనే పాటకుగానూ బిల్లీ ఈలిష్, ఫిన్నియాస్ ఓకోనల్ పురస్కారం అందుకోవాలని పిలిచారు. యాక్షన్ సీన్ కూడా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేసింది. ఆస్కార్ గడ్డపై మరోసారి ఆర్ఆర్ఆర్ అంటూ క్యాప్షన్ జోడించింది. అక్కడ నాటు నాటు పాట మాత్రమే కాకుండా సదరు మూవీలోని ఓ యాక్షన్ సీన్ కూడా ప్లే చేశారు. జీవితాన్ని రిస్క్ చేసే స్టంట్స్ మాస్టర్లకు సలాం కొడుతూ గొప్ప స్టంట్స్ సన్నివేశాల వీడియోను ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు. అందులో హాలీవుడ్ చిత్రాలతో పాటు నాటు నాటులోని క్లైమాక్స్ సీన్ కూడా చోటు దక్కించుకుంది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ హవా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని, జక్కన్న సినిమా అంటే అట్లుంటదని కామెంట్లు చేస్తున్నారు. On the #Oscars stage again!! ❤️🔥❤️🔥❤️🔥 #RRRMovie pic.twitter.com/cbNgFzMt72 — RRR Movie (@RRRMovie) March 11, 2024 And again, a sweet surprise for us… 🔥🌊 Glad that @TheAcademy included #RRRMovie action sequences as part of their tribute to the world’s greatest stunt sequences in cinema. pic.twitter.com/TGkycNtF2I — RRR Movie (@RRRMovie) March 11, 2024 చదవండి: ఈసారి ఆ మూవీకే ఎక్కువ అవార్డ్స్.. పూర్తి లిస్ట్ ఇదే! -
ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?
ఆస్కార్ అవార్డుల వేడుక.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈసారి అన్ని పురస్కారాలు హాలీవుడ్ సినిమాలకే దక్కాయి. వేరే భాషల చిత్రాల ఈ పురస్కారాన్ని అందుకోలేకపోయాయి. అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. దీనితో పాటు పలు హిట్ చిత్రాలని కూడా ఈ అవార్డులు వరించాయి. మరి ఈ సినిమాలు చూడాలంటే ఎలా? ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఆస్కార్ వచ్చిందంటే ఆ మూవీలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈసారి 'ఓపెన్ హైమర్', 'బార్బీ', 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' తదితర చిత్రాలు ఆస్కార్ దక్కించుకున్నాయి. వీటితోపాటు 'అమెరికన్ ఫిక్షన్', 'ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ది హోల్డోవర్స్' లాంటి మనకు పెద్దగా తెలియని సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. ఇంతకీ ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే? ఓపెన్ హైమర్ - జియో సినిమా (తెలుగు-మార్చి 21) & అమెజాన్ ప్రైమ్ (రెంట్) పూర్ థింగ్స్ - హాట్‌స్టార్ (ఇంగ్లీష్) ది హోల్డోవర్స్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ బార్బీ - జియో సినిమా అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ గాడ్జిల్లా మైనస్ వన్ - ప్రస్తుతం అందుబాటులో లేదు అమెరికన్ ఫిక్షన్ - అమెజాన్ ప్రైమ్ వీడియో ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ 20 డేస్ ఇన్ మరియూపోల్ - అమెజాన్ ప్రైమ్ (ఇదీ చదవండి: ఆస్కార్ ఒరిజినల్ సాంగ్.. గతేడాది 'ఆర్ఆర్ఆర్'కి.. మరి ఇప్పుడు?) -
ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్
96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలేం దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే 'ఓపెన్ హైమర్' సినిమాకు ప్రధాన విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డులు రావడం విశేషం. దీనితో పాటు 'పూర్ థింగ్స్' అనే సినిమాకు నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది పూర్తి జాబితా ఇదిగో.. ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్) ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్– 20 డేస్ ఇన్ మరియూపోల్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – ది బాయ్ అండ్ ది హిరాన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్న్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా) బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్) బెస్ట్ సౌండ్ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం-ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్) G.O.A.T #ChristopherNolan Won His First Ever #Oscars For #Oppenheimer 🥹❤️🔥pic.twitter.com/ygyZM2uBhj — Saloon Kada Shanmugam (@saloon_kada) March 11, 2024 -
ఆస్కార్ ఒరిజినల్ సాంగ్.. గతేడాది 'ఆర్ఆర్ఆర్'కి.. మరి ఇప్పుడు?
ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్న కార్యక్రమంపై భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా కాస్త ఆసక్తి చూపిస్తున్నాడు. ఎందుకంటే అనితర సాధ్యమైన ఈ పురస్కారాన్ని గతేడాది 'ఆర్ఆర్ఆర్' గెలుచుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ అందుకుంది. ఈసారి ఈ విభాగంలో గెలిచిందెవరు? ఏంటంత స్పెషల్? (ఇదీ చదవండి: ఆస్కార్-2024 అవార్డుల వేడుక.. విజేతలు వీళ్లే) 'ఆర్ఆర్ఆర్' సినిమా గతేడాది ఆస్కార్ బరిలో నిలిచినప్పుడు చాలామంది మనకు ఓ ఆస్కార్ వస్తే బాగుంటుందని ఆశపడ్డారు. కోట్లాది మంది భారతీయల కల నెరవేరింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో 'నాటు నాటు' పాటకు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. దీంతో కోట్లాదిమంది మురిసిపోయారు. అయితే ఈసారి భారతీయ సినిమాలేం ఆస్కార్ బరిలో లేవు. కానీ గతేడాది 'ఆర్ఆర్ఆర్' గెలుచుకున్న విభాగంలో ఈసారి ఎవరికి అవార్డు వస్తుందా అని అందరూ ఎదురుచూశారు. 'ఓపెన్ హైమర్' సినిమాతో పోటీపడి బాక్సాఫీస్ దగ్గర వేలకోట్ల వసూళ్లు కొల్లగొట్టిన 'బార్బీ' సినిమాలోని 'వాట్ వజ్ ఐ మేడ్ ఫర్' పాటకు ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డ్ వచ్చింది. బిల్లీ ఏలిష్ పాడిన పాట.. 'నాటు నాటు'తో పోలిస్తే చాలా డిఫరెంట్. మెలోడీగా సాగే ఈ గీతాన్ని మీరు ఓసారి వినేయండి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఆస్కార్‌కు ఒకరోజు ముందు ఓటీటీలోకి వచ్చేసిన మూవీ..
ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 96వ అకాడమీ అవార్డు సెలబ్రేషన్స్ జరగనున్నాయి. భారత్‌కు చెందిన అమ్మాయి నిషా పహుజా తెరకెక్కించిన టు కిల్ ఎ టైగర్ అనే చిత్రం డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఆస్కార్ పురస్కారాల ప్రకటనకు ఒకరోజు ముందు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే.. 13 ఏళ్ల వయసు చిన్నారి నిషాకు చదువు, ఆటలు తప్ప మరొకటి తెలియదు. అన్యం పుణ్యం తెలియని ఆ పల్లెటూరి అమాయకురాలిపై కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఈ ఘటనతో పాప భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. కానీ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోలేదు. న్యాయం కోసం పోరాటం మొదలుపెడతారు. ఇది సినిమానే కాదు రియల్‌గానూ జరిగింది. 2017లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. భారత సంతతికి చెందిన కెనడావాసి నిషా పహుజా అద్భుతంగా తెరకెక్కించింది. ఓటీటీలో.. ఈ సినిమా ఇప్పటికే టోర్నటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ సత్తా చాటింది. అమెరికాలో ఈ సినిమా థియేటర్లలో రిలీజవగా ఇండియాలో మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. నేషనల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ కెనడా వెబ్సైట్లోనూ దీన్ని ఫ్రీగా చూసేయొచ్చు. మరింకెందుకు ఆలస్యం.. హృదయాన్ని మెలిపెట్టే ఈ సినిమానూ మీరూ చూసేయండి.. A real tale of courage, resilience and grit in the face of adversity- now an Academy Award nominee for Best Documentary Feature 🔥🙌 To Kill A Tiger, now streaming, only on Netflix!#ToKillATigerOnNetflix @ToKillATigerDoc #StandWithHer @NishaPahuja pic.twitter.com/eL4YBTRwLM — Netflix India (@NetflixIndia) March 10, 2024 చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ.. కాకపోతే.. -
అస్కార్ బరిలో ఉన్న పది సినిమాలు ఇవే