గతేడాది ఆర్‌ఆర్‌ఆర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు), ద ఎలిఫెంట్ విస్పరర్స్ ( బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా) సినిమాలకు ఆస్కార్ రావడంతో భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కానీ ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా కూడా అకాడమీ అవార్డుల బరిలో లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. కొన్ని సినిమాలను నామినేట్ చేసినప్పటికీ ఫైనల్ లిస్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే భారత సంతతికి చెందిన విదేశీవాసి సినిమా ఆస్కార్ బరిలో ఉండటంతో అందరూ కాస్త ఆసక్తి చూపించారు.
టు కిల్ ఎ టైగర్..
ఢిల్లీకి చెందిన కెనడావాసి నిషా పహుజా.. టు కిల్ ఎ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. గతేడాది అక్టోబర్‌లో ఏ డిస్ట్రిబ్యూటర్ సాయం లేకుండా అమెరికాలోని కొన్ని థియేటర్లో విడుదల చేసింది. ఆస్కార్‌కు ఎప్పుడైతే నామినేట్ అయిందో అందరూ ఈ చిత్రంపై ఆసక్తి చూపించారు. దీంతో ఫిబ్రవరిలో రీరిలీజ్ చేయడం, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను కొనుక్కోవడం చకచకా జరిగిపోయాయి. ఇండియాలో మాత్రం థియేటర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోనే వచ్చేసింది. ఆదివారం (మార్చి 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రా, దేవ్ పటేల్, మిండీ కలింగ్, రూపీ కౌర్ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఏ సినిమాకు వచ్చిందంటే?
తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఈ మూవీని వెనక్కు నెట్టి '20 డేస్ ఇన్ మరియుపోల్' ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ అవార్డు ఎగరేసుకుపోయింది. ఈ సినిమాలో స్పెషల్ ఏముందంటారా? ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర వార్ జరుగుతుంది. మారియుపోల్ నగరంలో చిక్కుకున్న ఉక్రెయిన్ జర్నలిస్టులు రష్యా దురాగతాలను ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రయత్నిస్తారు. వారి పోరాటమే సినిమా కథ!
Comments
Please login to add a commentAdd a comment