To Kill a Tiger
-
Oscars 2024: ప్చ్.. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది..
గతేడాది ఆర్ఆర్ఆర్ (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు), ద ఎలిఫెంట్ విస్పరర్స్ ( బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలింగా) సినిమాలకు ఆస్కార్ రావడంతో భారతీయుల హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోయాయి. కానీ ఈసారి ఇండియా నుంచి ఏ సినిమా కూడా అకాడమీ అవార్డుల బరిలో లేకపోవడంతో అందరూ నిరాశ చెందారు. కొన్ని సినిమాలను నామినేట్ చేసినప్పటికీ ఫైనల్ లిస్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే భారత సంతతికి చెందిన విదేశీవాసి సినిమా ఆస్కార్ బరిలో ఉండటంతో అందరూ కాస్త ఆసక్తి చూపించారు. టు కిల్ ఎ టైగర్.. ఢిల్లీకి చెందిన కెనడావాసి నిషా పహుజా.. టు కిల్ ఎ టైగర్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించింది. గతేడాది అక్టోబర్‌లో ఏ డిస్ట్రిబ్యూటర్ సాయం లేకుండా అమెరికాలోని కొన్ని థియేటర్లో విడుదల చేసింది. ఆస్కార్‌కు ఎప్పుడైతే నామినేట్ అయిందో అందరూ ఈ చిత్రంపై ఆసక్తి చూపించారు. దీంతో ఫిబ్రవరిలో రీరిలీజ్ చేయడం, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హక్కులను కొనుక్కోవడం చకచకా జరిగిపోయాయి. ఇండియాలో మాత్రం థియేటర్లో కాకుండా నేరుగా ఓటీటీలోనే వచ్చేసింది. ఆదివారం (మార్చి 10) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రా, దేవ్ పటేల్, మిండీ కలింగ్, రూపీ కౌర్ ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఏ సినిమాకు వచ్చిందంటే? తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఈ మూవీని వెనక్కు నెట్టి '20 డేస్ ఇన్ మరియుపోల్' ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అకాడమీ అవార్డు ఎగరేసుకుపోయింది. ఈ సినిమాలో స్పెషల్ ఏముందంటారా? ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర వార్ జరుగుతుంది. మారియుపోల్ నగరంలో చిక్కుకున్న ఉక్రెయిన్ జర్నలిస్టులు రష్యా దురాగతాలను ప్రపంచానికి చాటిచెప్పాలని ప్రయత్నిస్తారు. వారి పోరాటమే సినిమా కథ! చదవండి: 'ఓపెన్ హైమర్' గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు -
ఆస్కార్‌కు ఒకరోజు ముందు ఓటీటీలోకి వచ్చేసిన మూవీ..
ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 96వ అకాడమీ అవార్డు సెలబ్రేషన్స్ జరగనున్నాయి. భారత్‌కు చెందిన అమ్మాయి నిషా పహుజా తెరకెక్కించిన టు కిల్ ఎ టైగర్ అనే చిత్రం డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో నామినేషన్ దక్కించుకుంది. ఆస్కార్ పురస్కారాల ప్రకటనకు ఒకరోజు ముందు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కథేంటంటే.. 13 ఏళ్ల వయసు చిన్నారి నిషాకు చదువు, ఆటలు తప్ప మరొకటి తెలియదు. అన్యం పుణ్యం తెలియని ఆ పల్లెటూరి అమాయకురాలిపై కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడతారు. ఈ ఘటనతో పాప భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. కానీ తల్లిదండ్రులు ఏడుస్తూ కూర్చోలేదు. న్యాయం కోసం పోరాటం మొదలుపెడతారు. ఇది సినిమానే కాదు రియల్‌గానూ జరిగింది. 2017లో జార్ఖండ్‌లోని రాంచీలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. భారత సంతతికి చెందిన కెనడావాసి నిషా పహుజా అద్భుతంగా తెరకెక్కించింది. ఓటీటీలో.. ఈ సినిమా ఇప్పటికే టోర్నటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ సత్తా చాటింది. అమెరికాలో ఈ సినిమా థియేటర్లలో రిలీజవగా ఇండియాలో మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. నేషనల్ ఫిలిం బోర్డ్ ఆఫ్ కెనడా వెబ్సైట్లోనూ దీన్ని ఫ్రీగా చూసేయొచ్చు. మరింకెందుకు ఆలస్యం.. హృదయాన్ని మెలిపెట్టే ఈ సినిమానూ మీరూ చూసేయండి.. A real tale of courage, resilience and grit in the face of adversity- now an Academy Award nominee for Best Documentary Feature 🔥🙌 To Kill A Tiger, now streaming, only on Netflix!#ToKillATigerOnNetflix @ToKillATigerDoc #StandWithHer @NishaPahuja pic.twitter.com/eL4YBTRwLM — Netflix India (@NetflixIndia) March 10, 2024 చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ.. కాకపోతే..