ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే? | Here's The List Of 9 Oscar 2024 Award Winning Movies OTT Streaming Platforms Details - Sakshi
Sakshi News home page

Oscar Movies OTT: ఈసారి ఆస్కార్‌లో 'ఓపెన్ హైమర్' హవా.. ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

Published Mon, Mar 11 2024 9:02 AM | Last Updated on Mon, Mar 11 2024 10:41 AM

Oscar 2024  Winning Movies OTT Streaming Details - Sakshi

ఆస్కార్ అవార్డుల వేడుక.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈసారి అన్ని పురస్కారాలు హాలీవుడ్ సినిమాలకే దక్కాయి. వేరే భాషల చిత్రాల ఈ పురస్కారాన్ని అందుకోలేకపోయాయి. అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. దీనితో పాటు పలు హిట్ చిత్రాలని కూడా ఈ అవార్డులు వరించాయి. మరి ఈ సినిమాలు చూడాలంటే ఎలా? ఏ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయనేది ఇప్పుడు చూసేద్దాం.

(ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్)

సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఆస్కార్ వచ్చిందంటే ఆ మూవీలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈసారి 'ఓపెన్ హైమర్', 'బార్బీ', 'అనాటమీ ఆఫ్ ఏ ఫాల్' తదితర చిత్రాలు ఆస్కార్ దక్కించుకున్నాయి. వీటితోపాటు 'అమెరికన్ ఫిక్షన్', 'ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్', 'ది హోల్డోవర్స్' లాంటి మనకు పెద్దగా తెలియని సినిమాలకు కూడా అవార్డులు వచ్చాయి. ఇంతకీ ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

  • ఓపెన్ హైమర్ - జియో సినిమా (తెలుగు-మార్చి 21) & అమెజాన్ ప్రైమ్ (రెంట్)

  • పూర్ థింగ్స్ - హాట్‌స్టార్ (ఇంగ్లీష్)
  • ది హోల్డోవర్స్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ
  • బార్బీ - జియో సినిమా

  • అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ
  • గాడ్జిల్లా మైనస్ వన్ - ప్రస్తుతం అందుబాటులో లేదు
  • అమెరికన్ ఫిక్షన్ - అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ - అమెజాన్ ప్రైమ్ & ఆపిల్ టీవీ
  • 20 డేస్ ఇన్ మరియూపోల్ - అమెజాన్ ప్రైమ్

(ఇదీ చదవండి: ఆస్కార్ ఒరిజినల్ సాంగ్.. గతేడాది 'ఆర్ఆర్ఆర్'కి.. మరి ఇప్పుడు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement