వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాల హవా నడుస్తోంది. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'ఓపెన్ హైమర్', 'బార్బీ' సునామీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. జస్ట్ ఒక్క వీకెండ్‌లో అంటే శుక్ర-శని-ఆదివారాలు కలిపి వేల కోట్ల వసూళ్లు సాధించాయి. ఈ విషయంలో రెండింటి మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. మరి ఏ సినిమా టాప్‍లో నిలిచింది.
హాలీవుడ్‌లో ఫాంటసీ కామెడీ సినిమాగా 'బార్బీ' విడుదలైంది. గ్రెటా గెర్విగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'బార్బీ ఫ్యాషన్ డాల్స్' పుస‍్తకం ఆధారంగా తీశారు. దాదాపు రూ.1200 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. తొలి వీకెండ్‌లోనే ఆ మొత్తాన్ని రాబట్టేసుకుంది. కేవలం మూడు రోజుల్లో 337 మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కాయి. మన కరెన్సీ ప్రకారం రూ.2763 కోట్లు అనమాట.
(ఇదీ చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!)
మరోవైపు అమెరికా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిన రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తీసిన సినిమా 'ఓపెన్ హైమర్'. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్, హిస్టరీలో అతి ముఖ్యమైన సంఘటనకు పాలిటిక్స్ తో లింక్ చేస్తూ తెరకెక్కించిన ఈ మూవీకి క్రిస్టోఫర్ నోలన్ దర్శకుడు. 100 మిలియన్ డాలర్స్‌తో నిర్మిస్తే తొలి వీకెండే 174 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. మన కరెన్సీ ప్రకారం రూ.1426 కోట్లు అనమాట.
ఈ రెండింటి కంటే రెండు వారాల ముందు అంటే జూలై 12న థియేటర్లలోకి వచ్చిన 'మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్'.. తొలి వీకెండ్ లో 235 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించింది. అంటే రూ.1931 కోట్లు. ఇలా ఈ మూడు చిత్రాలు దాదాపు ఆరు వేల కోట్ల వరకు వసూళ్లు సాధించినట్టే. అయితే భారత్‌లో 'ఓపెన్ హైమర్' హవా నడుస్తుండగా, మిగతా చోట్ల మాత్రం 'బార్బీ' టాప్‌లో ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే సినీ ప్రేక్షకులు యాక్షన్, డ్రామా కంటే 'బార్బీ'లో కామెడీకే పట్టం కట్టారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment