ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్ | Oscars 2024 Winners Full List And Details, Who Won Best Actor And Actress Award - Sakshi
Sakshi News home page

Oscars 2024 Winners Full List: ఈసారి ఆ మూవీకే ఎక్కువ అవార్డ్స్.. పూర్తి లిస్ట్ ఇదే!

Published Mon, Mar 11 2024 8:15 AM | Last Updated on Mon, Mar 11 2024 9:34 AM

Oscars 2024 Winners Full List And Details - Sakshi

96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలేం దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే 'ఓపెన్ హైమర్' సినిమాకు ప్రధాన విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డులు రావడం విశేషం. దీనితో పాటు 'పూర్ థింగ్స్' అనే సినిమాకు నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది పూర్తి జాబితా ఇదిగో..

  •     ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్
  •     ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్)
  •     ఉత్తమ నటి –  ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
  •     ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్)
  •     ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్)
  •     ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
  •     ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ)
  •     బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ)
  •     బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌– 20 డేస్ ఇన్ మరియూపోల్
  •     బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే–  కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)
  •     బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే – జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)
  •     బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ – హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)
  •     బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ – ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌
  •     బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ – ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌
  •     బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్‌న్)
  •     బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా)
  •     బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్)
  •     బెస్ట్‌ సౌండ్‌ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్)
  •     బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ – జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)
  •     బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ – నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)
  •     బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం-ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్
  •     బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్ 
  •     బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement