Cillian Murphy
-
టామీ షెల్బీ రిటర్న్స్
టామీ షెల్బీగా సిలియన్ మర్ఫీ మళ్లీ రానున్నాడు. విశేషఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ (2013 –2022) ‘పీకీ బ్లైండర్స్’లో మర్ఫీ పోషించిన టామీ షెల్బీ ప్రేక్షకులను ఆకటు కుంది. ఈ బ్రిటిష్ పీరియాడికల్ క్రైమ్ సిరీస్‌ను స్టీవెన్ నైట్ క్రియేట్ చేశారు. ఓ యువకుల ముఠా చేసే దొంగతనాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ ముఠాలో కీలకమైన వాడే టామీ షెల్బీ. ఇప్పుడు ఈ సిరీస్‌ను సినిమాగా తీయనున్నారు స్టీవెన్. అయితే స్టీవెన్ నైట్ స్క్రిప్ట్ రాస్తారు. టామ్ హార్పర్ డైరెక్ట్ చేస్తారు. కాగా సిరీస్‌లో టామీ షెల్బీపాత్రను చేసిన సీలియన్ మర్ఫీనే సినిమాలోనూ ఆపాత్ర చేయనున్నారు. ‘పీకీ బ్లైండర్స్’ సిరీస్‌ను సినిమాగా నిర్మించనున్నట్లు, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ ఏడాది మార్చిలో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘అపెన్హైమర్’ సినిమాకుగానూ సీలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. -
సెప్టెంబరులో స్టార్ట్
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆపెన్ హైమర్’ చిత్రంలో మంచి నటన కనబరచి 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్ అవార్డు అందుకున్నారు నటుడు సీలియన్ మర్ఫీ. దీంతో సీలియన్ తర్వాతి చిత్రాలపై హాలీవుడ్లో ఫోకస్ పెరిగింది. కాగా సీలియన్ నటించనున్న కొత్త చిత్రం సెప్టెంబరులో స్టార్ట్ కానున్నట్లు హాలీవుడ్ సమా చారం. హాలీవుడ్ హిట్ సిరీస్ ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఓ సినిమా తీయాలనుకుంటున్నారు ఈ సిరీస్ రూపకర్త స్టీవెన్ నైట్. ‘పీకీ బ్లైండర్స్’ ఆధారంగా ఈ సినిమాను సెప్టెంబరులో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ‘పీకీ బ్లైండర్స్’ సిరీస్‌లో థామస్ షేల్బేగా నటించిన సీలియన్ మర్ఫీ ఈ సినిమాలోనూ నటిస్తారన్నట్లుగా స్టీవెన్ ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా 2025 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
'అవన్నీ ఫేక్ అవార్డ్స్'.. ఆస్కార్ వేళ హీరోయిన్ సంచలన కామెంట్స్!
ఆస్కార్ అవార్డ్ విన్నర్‌పై బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ప్రశంసలు కురిపించింది. తాజాగా 96వ అకాడమీ అవార్డ్ వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ హవా అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డ్‌ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపింది యామీ గౌతమ్. అయితే ఊహించని విధంగా ఇండియా ఫిల్మ్ అవార్డులపై తన అక్కసును ప్రదర్శించింది. ఇండియా ఫిల్మ్ అవార్డులు నకిలీవంటూ యామీ గౌతమ్ విమర్శించింది. ఈ మేరకు తన ట్విటర్లో రాసుకొచ్చింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డు షోలకు తాను హాజరు కావడం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ అవార్డులపై తనకు నమ్మకం లేదని వెల్లడించింది. కానీ ఈ రోజు ఒక అసాధారణ నటుడిని చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ దక్కించుకున్న మీ ప్రతిభ అన్నింటికంటే అత్యుత్తమంగా నిలుస్తుందని ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా యామీకి 2022లో ప్రముఖ అవార్డ్ తనకు దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఇది చూసిన అభిమానులు భిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ఆమెకు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో యామితో పాటు ప్రియమణి, అరుణ్ గోవిల్ కూడా నటించారు. Having no belief in any of the current fake “filmy” awards, since the last few years, I stopped attending them but today i am feeling really happy for an extraordinary actor who stands for patience, resilience & so many more emotions. Watching him being honoured on the biggest… — Yami Gautam Dhar (@yamigautam) March 11, 2024 -
ఆస్కార్‌లో 'ఓపెన్ హైమర్' సెన్సేషన్.. ఈ సినిమా ఎందుకంత స్పెషల్?
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ సినిమా గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఏకంగా ఆస్కార్ వచ్చేంతలా ఈ మూవీలో ఏముంది? ప్రత్యేకత ఏంటి? హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకు దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు క్లాసిక్స్ తీసిన ఇతడు.. తొలిసారి 'ఓపెన్ హైమర్' అనే బయోపిక్ తీశాడు. దాదాపు మూడేళ్ల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. దాదాపు ఎనిమిది సార్లు నామినేషన్స్‌లో ఇప్పుడు తొలిసారి ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?) సాధారణంగా హాలీవుడ్ సినిమాలంటే గ్రాఫిక్స్ కచ్చితంగా ఉంటాయి. కానీ 'ఓపెన్ హైమర్' కోసం అన్ని రియల్‌గా తీశారు. న్యూక్లియర్ బాంబు పేలుడు సీన్స్ కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ లాంటివి చేయకుండానే తీయడం విశేషం. అలానే ఇంగ్లీష్ సినిమాల నిడివి గంటన్నర లేదంటే రెండు గంటల్లోపే ఉంటుంది. 'ఓపెన్ హైమర్' మాత్రం దాదాపు మూడు గంటలకు పైగా నిడివితో తీశారు. గతేడాది జూలై 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. 100 మిలియన్ డాలర్స్ పెడితే.. 1000 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే మన కరెన్సీలో రూ.7700 కోట్లకు అనమాట. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్) ఇప్పుడంతా కలర్ ఫార్మాట్లో దాదాపు అన్ని భాషల్లో సినిమాలు తీస్తున్నారు. 'ఓపెన్ హైమర్'లో కొన్ని సీన్స్ మాత్రం బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. అలా ఇది తొలి బ్లాక్ అండ్ వైట్ ఐమాక్స్ మూవీగా రికార్డ్ సృష్టించింది. ఇదే సినిమాలోని రొమాంటిక్ సన్నివేశంలో భారతీయ మతగ్రంథాలు ఉండటం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది సరికాదని చాలామంది భారతీయ ప్రేక్షకుల విమర్శలు చేశారు. ఆ సీన్ తొలగించాలని డిమాండ్ కూడా చేశారు. ఇన్ని విశేషాలున్న సినిమా.. మన ప్రేక్షకుల్లో ముప్పావంతు మందికి నచ్చలేదు! ఇది ఇక్కడ ట్విస్ట్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
ఆస్కార్-2024 విజేతల పూర్తి జాబితా.. ఆ సినిమాకు ఏకంగా ఏడు అవార్డ్స్
96వ ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈసారి భారతీయ సినిమాలు గానీ భారతీయ మూలాలున్న వ్యక్తులకు గానీ పురస్కారాలేం దక్కలేదు. మరోవైపు చాలామంది ఊహించినట్లే 'ఓపెన్ హైమర్' సినిమాకు ప్రధాన విభాగాల్లో ఏకంగా ఏడు అవార్డులు రావడం విశేషం. దీనితో పాటు 'పూర్ థింగ్స్' అనే సినిమాకు నాలుగు విభాగాల్లో పురస్కారాలు దక్కాయి. ఇంతకీ ఎవరెవరికి ఏయే అవార్డులు వచ్చాయనేది పూర్తి జాబితా ఇదిగో.. ఉత్తమ చిత్రం – ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడు – కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్) ఉత్తమ నటి – ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్) ఉత్తమ దర్శకుడు – క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటుడు – రాబర్డ్ డౌనీ జూనియర్ (ఓపెన్ హైమర్) ఉత్తమ సహాయ నటి – డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్) ఉత్తమ సినిమాటోగ్రఫీ – ఓపెన్ హైమర్ (హోయటే, హోయటేమ) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – వాట్ వజ్ ఐ మేడ్ ఫర్ (బార్బీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్– 20 డేస్ ఇన్ మరియూపోల్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే– కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్) బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – హోలి వెడ్డింగ్టన్ (పూర్ థింగ్స్) బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ – ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – ది బాయ్ అండ్ ది హిరాన్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – ఓపెన్ హైమర్ (లడ్విగ్ ఘోరన్న్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – గాడ్జిల్లా మైనస్ వన్ (తకాషి యమజాకీ, క్యోకో షిబుయా, మకాషి తకషాకీ, తత్సుజీ నోజిమా) బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – ఓపెన్ హైమర్ (జెన్నీఫర్ లేమ్) బెస్ట్ సౌండ్ – ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (టార్న్ విల్లర్స్, జానీ బర్న్) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ – నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం-ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం- వార్ ఈజ్ ఓవర్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం- ద లాస్ట్ రిపేర్ షాప్ (బెన్ ఫ్రౌడ్‌ఫుట్, క్రిస్ బ్రోవర్స్) G.O.A.T #ChristopherNolan Won His First Ever #Oscars For #Oppenheimer 🥹❤️🔥pic.twitter.com/ygyZM2uBhj — Saloon Kada Shanmugam (@saloon_kada) March 11, 2024