టామీ షెల్బీ రిటర్న్స్‌ | Cillian Murphy returns as Tommy Shelby as Peaky Blinders | Sakshi
Sakshi News home page

టామీ షెల్బీ రిటర్న్స్‌

Published Thu, Jun 6 2024 3:42 AM | Last Updated on Thu, Jun 6 2024 3:42 AM

Cillian Murphy returns as Tommy Shelby as Peaky Blinders

టామీ షెల్బీగా సిలియన్‌ మర్ఫీ మళ్లీ రానున్నాడు. విశేషఆదరణ పొందిన టెలివిజన్‌ సిరీస్‌ (2013 –2022) ‘పీకీ బ్లైండర్స్‌’లో మర్ఫీ పోషించిన టామీ షెల్బీ ప్రేక్షకులను ఆకటు కుంది. ఈ బ్రిటిష్‌ పీరియాడికల్‌ క్రైమ్‌ సిరీస్‌ను స్టీవెన్‌ నైట్‌ క్రియేట్‌ చేశారు. ఓ యువకుల ముఠా చేసే దొంగతనాల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతుంది. ఈ ముఠాలో కీలకమైన వాడే టామీ షెల్బీ. ఇప్పుడు ఈ సిరీస్‌ను సినిమాగా తీయనున్నారు స్టీవెన్‌. అయితే స్టీవెన్‌ నైట్‌ స్క్రిప్ట్‌ రాస్తారు. 

టామ్‌ హార్పర్‌ డైరెక్ట్‌ చేస్తారు. కాగా సిరీస్‌లో టామీ షెల్బీపాత్రను చేసిన సీలియన్‌ మర్ఫీనే సినిమాలోనూ ఆపాత్ర చేయనున్నారు. ‘పీకీ బ్లైండర్స్‌’ సిరీస్‌ను సినిమాగా నిర్మించనున్నట్లు, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ ఏడాది మార్చిలో జరిగిన 96వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ‘అపెన్‌హైమర్‌’ సినిమాకుగానూ సీలియన్‌ మర్ఫీ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement