Periodical horror entertainer
-
టామీ షెల్బీ రిటర్న్స్
టామీ షెల్బీగా సిలియన్ మర్ఫీ మళ్లీ రానున్నాడు. విశేషఆదరణ పొందిన టెలివిజన్ సిరీస్ (2013 –2022) ‘పీకీ బ్లైండర్స్’లో మర్ఫీ పోషించిన టామీ షెల్బీ ప్రేక్షకులను ఆకటు కుంది. ఈ బ్రిటిష్ పీరియాడికల్ క్రైమ్ సిరీస్‌ను స్టీవెన్ నైట్ క్రియేట్ చేశారు. ఓ యువకుల ముఠా చేసే దొంగతనాల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. ఈ ముఠాలో కీలకమైన వాడే టామీ షెల్బీ. ఇప్పుడు ఈ సిరీస్‌ను సినిమాగా తీయనున్నారు స్టీవెన్. అయితే స్టీవెన్ నైట్ స్క్రిప్ట్ రాస్తారు. టామ్ హార్పర్ డైరెక్ట్ చేస్తారు. కాగా సిరీస్‌లో టామీ షెల్బీపాత్రను చేసిన సీలియన్ మర్ఫీనే సినిమాలోనూ ఆపాత్ర చేయనున్నారు. ‘పీకీ బ్లైండర్స్’ సిరీస్‌ను సినిమాగా నిర్మించనున్నట్లు, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఈ ఏడాది మార్చిలో జరిగిన 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘అపెన్హైమర్’ సినిమాకుగానూ సీలియన్ మర్ఫీ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. -
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్‌కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
యుద్ధానికి సై
మలయాళ నటుడు మమ్ముట్టి తన కొత్త చిత్రం కోసం యోధుడిలా మారిపోయారు. ఆయన హీరోగా పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మమంగం’. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేణు కున్నప్పిల్లి నిర్మిస్తున్నారు. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ‘యుద్ధానికి సిద్ధం’ అన్నట్టు మమ్ముట్టి ఫోజుని గమనించవచ్చు. ‘ఈ ఫస్ట్‌లుక్‌ని సాధారణంగా ఫొటోషూట్ జరిపినట్టు కాకుండా యాక్టర్స్ అందరూ ఆ సన్నివేశాన్ని నటిస్తుంటే ఈ ఫొటోలను తీసి ఫస్ట్‌లుక్‌గా రిలీజ్ చేశాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదలకానుంది. -
దొరగా వస్తున్న కట్టప్ప!
‘బాహుబలి’కి ముందు తమిళ నటుడు సత్యరాజ్ తెలుగులో మంచి పాత్రలు చేసినప్పటికీ ఆ చిత్రంలో చేసిన ‘కట్టప్ప’పాత్ర ఆయన్ను చాలా పాపులర్ చేసేసింది. ఆ గుర్తింపుని దృష్టిలో పెట్టుకునే తమిళంలో ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జాక్సన్ దురై’ చిత్రాన్ని తెలుగులోకి ‘దొర’ పేరుతో జక్కం జవహర్‌బాబు విడుదల చేస్తున్నారు. ధరణీధరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్లో సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ హీరోగా నటించారు. తెలుగమ్మాయి బిందుమాధవి కథానాయిక. చిత్రవిశేషాలను జవహర్‌బాబు తెలియజేస్తూ- ‘‘ఆసక్తికి గురి చేసే హారర్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. తమిళంలో టీజర్‌కు స్పందన బాగుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం. సిద్ధార్థ్ విపిన్ అద్భుతమైన పాటలు స్వరపరిచాడు. వెన్నెలకంటి, చంద్రబోస్ చక్కటి సాహిత్యంతో పాటలు రాశారు. శశాంక్ వెన్నెలకంటి డైలాగులు హైలెట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ మొదటి వారంలో పాటలనూ మూడో వారంలో సినిమానూ విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: యువరాజ్, నేపథ్య సంగీతం: చిన్నా.