'అవన్నీ ఫేక్ అవార్డ్స్'.. ఆస్కార్‌ వేళ హీరోయిన్ సంచలన కామెంట్స్! | Yami Gautam congratulates Oscar Award winner Cillian Murphy for Best Actor | Sakshi
Sakshi News home page

Yami Gautam: అవీ ఫేక్ అవార్డ్స్.. అందుకే నేను వెళ్లట్లేదు: యామీ గౌతమ్ విమర్శలు

Published Mon, Mar 11 2024 3:02 PM | Last Updated on Mon, Mar 11 2024 3:34 PM

Yami Gautam Praised Oscar Award winner Cillian Murphy Gets Best Actor - Sakshi

ఆస్కార్ అవార్డ్ విన్నర్‌పై బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ప్రశంసలు కురిపించింది. తాజాగా 96వ అకాడమీ అవార్డ్ వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్‌ హైమర్‌ హవా అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌ విభాగంలో అవార్డ్ దక్కింది. ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డ్‌ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపింది యామీ గౌతమ్.  అయితే ఊహించని విధంగా ఇండియా ఫిల్మ్ అవార్డులపై తన అక్కసును ప్రదర్శించింది. 

ఇండియా ఫిల్మ్ అవార్డులు నకిలీవంటూ యామీ గౌతమ్ విమర్శించింది. ఈ మేరకు తన ట్విటర్‌లో రాసుకొచ్చింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డు షోలకు తాను హాజరు కావడం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ అవార్డులపై తనకు నమ్మకం లేదని వెల్లడించింది. కానీ ఈ రోజు ఒక అసాధారణ నటుడిని చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ దక్కించుకున్న మీ ప్రతిభ అన్నింటికంటే అత్యుత్తమంగా నిలుస్తుందని ట్విటర్‌లో రాసుకొచ్చింది.

ఈ సందర్భంగా యామీకి 2022లో ప్రముఖ అవార్డ్ తనకు దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఇది చూసిన అభిమానులు భిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు  వ్యతిరేకిస్తున్నారు. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ఆమెకు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో యామితో పాటు ప్రియమణి, అరుణ్ గోవిల్ కూడా నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement