congrats
-
‘రామాయణం’ రామునికి టీవీ సీత శుభాకాంక్షలు
రామానంద్ సాగర్ రూపొందించిన ‘రామాయణం’లో రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు సంపాదించుకున్నారు. తాజాగా యూపీలోని మీరట్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. దీంతో అరుణ్ గోవిల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.టీవీ షో ‘రామాయణం’లో సీత పాత్రలో కనిపించిన దీపికా చిఖాలియా కూడా అరుణ్ గోవిల్‌కు అభినందనలు తెలిపారు. అలాగే తన ఇన్‌స్టాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆమె అరుణ్ గోవిల్‌తో ముచ్చటిస్తున్న దృశ్యాలున్నాయి. క్యాప్షన్‌లో అరుణ్ గోవిల్‌కు అభినందనలు తెలిపారు.తన విజయం తర్వాత అరుణ్ గోవిల్ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. దాని క్యాప్షన్‌లో ‘మీరట్ లోక్‌సభ నియోజకవర్గపు ఓటర్లు, కార్యకర్తలు, అగ్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరందరూ నాపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు. నేను మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను...జై శ్రీరామ్’ అని పేర్కొన్నారు.బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మపై 10,585 ఓట్ల తేడాతో గెలుపొందారు. అరుణ్ గోవిల్‌కు మొత్తం 5,46,469 ఓట్లు వచ్చాయి. -
'అవన్నీ ఫేక్ అవార్డ్స్'.. ఆస్కార్ వేళ హీరోయిన్ సంచలన కామెంట్స్!
ఆస్కార్ అవార్డ్ విన్నర్‌పై బాలీవుడ్ భామ యామీ గౌతమ్ ప్రశంసలు కురిపించింది. తాజాగా 96వ అకాడమీ అవార్డ్ వేడుకల్లో క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ హవా అవార్డులు కొల్లగొట్టింది. ఈ చిత్రానికి బెస్ట్ యాక్టర్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఓపెన్ హైమర్ హీరో సిలియన్ మర్ఫీ అవార్డ్‌ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపింది యామీ గౌతమ్. అయితే ఊహించని విధంగా ఇండియా ఫిల్మ్ అవార్డులపై తన అక్కసును ప్రదర్శించింది. ఇండియా ఫిల్మ్ అవార్డులు నకిలీవంటూ యామీ గౌతమ్ విమర్శించింది. ఈ మేరకు తన ట్విటర్లో రాసుకొచ్చింది. అందుకే గత కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డు షోలకు తాను హాజరు కావడం లేదని తెలిపింది. అలాంటి ఫేక్ అవార్డులపై తనకు నమ్మకం లేదని వెల్లడించింది. కానీ ఈ రోజు ఒక అసాధారణ నటుడిని చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ దక్కించుకున్న మీ ప్రతిభ అన్నింటికంటే అత్యుత్తమంగా నిలుస్తుందని ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా యామీకి 2022లో ప్రముఖ అవార్డ్ తనకు దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఇది చూసిన అభిమానులు భిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు. కొందరు సపోర్ట్ చేస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. కాగా.. యామీ గౌతమ్ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో నటనకు గానూ ఆమెకు ప్రశంసలు దక్కించుకుంది. ఈ చిత్రంలో యామితో పాటు ప్రియమణి, అరుణ్ గోవిల్ కూడా నటించారు. Having no belief in any of the current fake “filmy” awards, since the last few years, I stopped attending them but today i am feeling really happy for an extraordinary actor who stands for patience, resilience & so many more emotions. Watching him being honoured on the biggest… — Yami Gautam Dhar (@yamigautam) March 11, 2024 -
‘కియా’కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: కియా ఇండియా నాలుగేళ్లలోనే 10 లక్షల కార్లను ఉత్పత్తి చేయడంపై సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. స్వల్ప కాలంలోనే మిలియన్ కార్లను ఉత్పత్తి చేయడం ద్వారా కియా ఇండియా చరిత్ర సృష్టించిందని.. ఇందుకు కియా ఇండియాకు హృదయపూర్వక అభినందనలంటూ ఆయన గురువారం ట్వీట్ చేశారు. ఏపీ ఆటోమొబైల్ రంగం పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానమని ఈ మైలురాయి చాటి చెప్పిందని పేర్కొన్నారు. అలాగే పుష్కల వనరులున్న రాష్ట్రమని మరోసారి అందరికీ తెలియజేసిందన్నారు. భవిష్యత్‌లో కియా ఇండియా మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. చదవండి: వలంటీర్ల వ్యవస్థ రద్దు కోసమే కుట్ర Hearty congratulations to the @KiaInd team for creating history by producing their millionth car in a short span of 4 years! This milestone makes Andhra Pradesh a favoured destination for the automobile industry and reiterates that Andhra Pradesh truly is Where Abundance meets… — YS Jagan Mohan Reddy (@ysjagan) July 13, 2023 -
నాటు నాట్ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాల గర్వంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి
-
కొత్తగా మారిపోయా!
నమిత ఫోన్ మంగళవారం ఫుల్ బిజీ. ఎందుకంటే మంగళవారం (మే 10) ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే’ చెప్పేందుకు బంధువులు, అభిమానులు ఫోన్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారా? అయితే ‘హ్యాపీ బర్త్ డే’తో పాటు ‘కంగ్రాట్స్’ చెప్పిన ఫోన్ కాల్సే ఎక్కువగా ఉన్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే... తాను తల్లి కాబోతున్న విషయాన్ని తన బర్త్ డే సందర్భంగా నమిత ఇన్‌స్టా అకౌంట్ ద్వారా వెల్లడించి, కొత్త ఫోటోలను షేర్ చేశారు. దాంతో ‘కంగ్రాట్స్...నమిత’ అని ఇటు సినీ సెలబ్రిటీలు అటు అభిమానులు ఆమెకు సందేశాలు పంపడం, ఫోన్‌కాల్స్ చేయడం వంటివి చేశారు. ‘‘నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవగానే నేను మారిపోయాను. నేను నీ కోసం (పుట్టబోయే బిడ్డ గురించి...) ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ప్రస్తుతం కొత్త అనుభూతిని ఆస్వాదిస్తున్నాను’’ అంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో రాసుకొచ్చారు నమిత. 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత ‘సొంతం’, ‘జెమిని’, ‘సింహా’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. -
నీలి బెండపూడికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: పెన్సిల్వేనియా యూనివర్శిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. వైజాగ్ ఆంధ్ర యూనివర్శిటీ పూర్వవిద్యార్థి అయిన నీలి బెండపూడి.. ప్రతిష్టాత్మకపెన్సిల్వేనియా యూనివర్శిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులవ్వడం గర్వకారణమని సీఎం వైఎస్ జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. Congratulations to Neeli Bendapudi garu for being elected as the President of Penn State University. Hailing from Vizag & an alumnus of Andhra University, she's the 1st woman & person of colour to lead Pennsylvania’s flagship university.@penn_state — YS Jagan Mohan Reddy (@ysjagan) December 10, 2021 కాగా, భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. విశాఖపట్నంలో జన్మించి, ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వెళ్లిన ఆమె ప్రస్తుతం కెంటకీలోని లూయిస్విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు. చదవండి: (అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ) -
లైబీరియా కొత్త అధ్యక్షుడికి గుటెరస్ అభినందనలు
లైబీరియా: లైబీరియా కాబోయే అధ్యక్షుడు జార్జ్ వేహ్కు ఐక్య రాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ శనివారం అభినందనలు తెలిపారు. శాంతియుతంగా జరిగిన ఎన్నికల్లో వేహ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరుపుకున్నందుకు లైబీరియన్లను అభినందించారు. రెండు ప్రజా యుద్ధాల అనంతరం జరిగి4న ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డు నిర్ధారించింది. ఫుట్‌బాల్ అంతర్జాతీయ మాజీ ఆటగాడైన వేహ్ ఉపాధ్యక్షుడు జోసెఫ్ బోకైను ఓడించారు. ఈయన జనవరి 22న అధ్యక్ష పదవిని చేపడతారు. తన ఓటమిని అంగీకరిస్తూ మోకై అధ్యక్షుడిగా ఎన్నికైన వేహ్ను అభినందించారు. -
టీ20 భారత మహిళా జట్టుకు మేఘన ఎంపిక
విజయవాడ స్పోర్ట్స్ : దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న కృష్ణా జిల్లా మహిళా క్రికెటర్ సబ్బినేని మేఘన భారత జట్టుకు ఎంపికైంది. ఈ నెల 16వ తేదీ నుంచి మూలపాడు ట్విన్ గ్రౌండ్స్‌లో వెస్టిండీస్ జట్టుతో జరిగే 3 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లతో పాటు థాయిలాండ్‌లో జరిగే ఏషియా కప్‌లో పాల్గొనే భారత జట్టుకు మేఘన ప్రాతినిధ్యం వహిస్తుంది. డాషింగ్ బ్యాట్స్ఉమెన్గా పేరున్న ఆమె 2014లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌లో ఆడింది. ఆంధ్ర మహిళా క్రికెట్ నుంచి గతంలో వి.స్నేహదీప్తి, ఆర్.కల్పన భారత జట్టుకు ఆడారు. ఇప్పుడు మేఘన ఎంపికైంది. అండర్–16, అండర్–19, ఆంధ్ర సీనియర్ ఉమెన్ జట్టుల్లో కీలకమైన ప్రధాన బ్యాట్స్ఉమెన్గా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. అన్ని ఏజ్ గ్రూపుల్లో ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. ప్రతి ఏడాది జోనల్ క్రికెట్ అకాడమీ, నేషనల్ క్రికెట్ అకాడమీలు నిర్వహించే క్యాంపుల్లో పాల్గొంది. గుంటూరు జేకేసీ కళాశాలలోని ఏసీఏ మహిళా క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. వెస్టిండీస్‌తో జరిగే టి20 మ్యాచ్‌లతో పాటు ఏషియా క్రికెట్ కప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు డి.వి.ఎస్.ఎస్.సోమయాజులు, ఏసీఏ మహిళా క్రికెట్ విభాగం చైర్మన్ జె.మురళీమోహన్ అభినందనలు తెలిపారు. -
తైక్వాండో విజేతలకు అభినందనలు
♦ ఏడు పతకాలు సాధించిన జిల్లా జట్టు అనంతపురం సప్తగిరి సర్కిల్ : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గత నెల 25 నుంచి 27 వరకు నిర్వహించిన అండర్–14,17 తైక్వాండో పోటీల్లో జిల్లా జట్టు 7 బంగారు పతకాలు సాధించిందని ఏపీ స్కూల్ గేమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు అంజయ్య, నారాయణ తెలిపారు. పతకాలు సాధించిన లాసీరెడ్డి, ధరణీ, రోజా, సాయిదీప్తి, హర్షితారెడ్డి, నాగగుర్రప్ప, దత్తుసాయి జాతీయ జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. క్రీడాకారులను కొత్తూరు బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. జాతీయ స్థాయి పోటీలు సోమవారం నుంచి 7 వరకు వరంగల్‌లో నిర్వహిస్తారని తెలిపారు. -
సింధు రజితం గెలుపుపై హర్షం
బిజినేపల్లి: రియో ఒలింపిక్ బ్యాట్మింటన్‌లో తెలుగు తేజం సింధు ఫైనల్లో రజితం పతకం సాధించడంపై పాలెం నేతాజీ యువజన సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాట్మింటన్‌లో ఫైనల్లో సింధు స్వర్ణ పతకం సాధించేందుకు ఎంతగానో కషి చేసినా ఫలితం దక్కకపోవడం బాధాకరమన్నారు. ఏది ఏమైనా దేశంలో వ్యక్తిగత రజితం పతకం సింధు సాధించడం గొప్ప విషయమన్నారు. హర్షం ప్రకటించిన వారిలో శ్రీనివాస్‌గౌడ్, సిరిజంగం శ్రీనివాసులు, శ్రీనివాస్, నాగరాజు, జ్ఞానేశ్వర్, కష్ణ, రేణుగౌడ్ ఉన్నారు. -
కంగ్రాట్స్ అరుణ్ జైట్లీజీ: కవిత
హైదరాబాద్: పార్లమెంట్లో సోమవారం 2016-17 కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విత్తమంత్రి అరుణ్ జైట్లీకి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. బడ్జెట్లో మౌళిక అంశాలకు, ఆరోగ్యం, వ్యవసాయానికి తగిన ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. అయితే ఈ బడ్జెట్ కెటాయింపుల్లో తెలంగాణ రాష్ట్రం పొందే ప్రయోజనం గురించి ఆసక్తిగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. Cngrts to @arunjaitley Ji for a budget focused on infra,health& agriculture.anxious 2 C how much will Telangana get. #DevilisInTheDetail :) — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 29, 2016 -
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు
ఢిల్లీ: పీఎస్ఎల్వీ-సీ29 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు. శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ-సీ29 రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా మరో చిరస్మరణీయమైన విజయాన్ని సాధించారని మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భారత్, సింగపూర్ మధ్య సంబంధాలు 50 సంవత్సరాలకు చేరుకున్న సందర్భంలో ఈ ప్రయోగం జరగడం విశేషంగా తెలిపిన ప్రధాని, సింగపూర్‌తో బలమైన సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు. Our scientists at @isro accomplish another momentous feat. Congrats to them on PSLV-C29 successfully launching 6 Singapore satellites.— Narendra Modi (@narendramodi) December 16, 2015 -
'షారుఖ్.. నీకు అభినందనలు'
కోల్‌కతా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలియజేశారు. ఆయన యజమానిగా ఉన్న జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించడంపట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ టీం కెప్టెన్ గౌతమ్ గంభీర్‌కు కూడా అభినందనలు తెలియజేశారు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ ద్వారా మమత ఈ అభినందనలు అందించారు. -
సైనాకు ముఖ్యమంత్రులు, వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో ఫైనల్స్ లోకి వెళ్లడంతో పాటు ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన హైదరాబాదీ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె. చంద్రశేఖర్ రావు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన జగన్ భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ) ఉపగ్రహ నౌక పీఎస్ఎల్వీ సి-27 రాకెట్‌ను శనివారం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇస్రో శాస్త్రజ్ఞులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఒక సందేశంలో అభినందించారు. ఈ సంవత్సరపు తొలి ప్రయోగం ఫలప్రదం అయినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. సైనాకు అభినందనలు : ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్నందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని మ్యాచ్‌ల్లో సైనా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
శభాష్ టీమిండియా.. మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: లార్డ్స్ టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అద్భుతంగా ఆడిందని మోడీ అభినందనలు తెలియజేశారు. 'టీమిండియా అద్భుత విజయం సాధించింది. మీ విజయానికి దేశం గర్విస్తోంది. ప్రతి ఒక్కరు సంతోషించదగ్గ విషయమిది' అంటూ మోడీ ట్వీట్ చేశారు. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ధోనీసేన 95 పరుగులతో గెలిచింది. 28 ఏళ్ల తరువాత లార్డ్స్ లో టీమిండియా టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. భారత పేసర్ ఇషాంత్ శర్మ ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్ ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్ భారత్ రెండో ఇన్నింగ్స్:342 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ :223