
'షారుఖ్.. నీకు అభినందనలు'
కోల్కతా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలియజేశారు. ఆయన యజమానిగా ఉన్న జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన తొలి మ్యాచ్లో విజయం సాధించడంపట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ టీం కెప్టెన్ గౌతమ్ గంభీర్కు కూడా అభినందనలు తెలియజేశారు. ఐపీఎల్ తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ ద్వారా మమత ఈ అభినందనలు అందించారు.