gowtham gambhir
-
గంభీర్ పై విమర్శలు.. ఈ విధంగా రివేంజ్ తీర్చుకుంటున్నాడంటూ ..!
-
కోహ్లీ తప్పులేదా.. గంభీర్ సైగల వలే?
-
శాంసన్ విధ్వంసం : ఎంపీల మధ్య వార్
ఐపీఎల్-2020 సీజన్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన టీ-20 మజాను అందించింది. తొలుత బౌండరీల బాదుడుతో కింగ్స్ రెచ్చిపోతే.. ఆ తరువాత తామేమీ తక్కువ కాదంటూ రాయల్స్ సిక్సర్ల మోత మోగించారు. రాజస్తాన్ రాయల్స్ అసాధారణ బ్యాంటింగ్‌తో పంజాబ్ విధించిన 224 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. ఆర్ఆర్ ఆటగాళ్లతో సంజూ శాంసన్‌తో పాటు రాహుల్ తేవటియా సంచలన ఇన్నింగ్స్‌తో కింగ్స్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందంటూ పలువురు మాజీలు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే నిన్నటి ఇన్నింగ్స్‌పై ఇద్దరు ఎంపీల మధ్య సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వార్ మొదలైంది. (ఆ పని చేయలేకపోయాను: తెవాతియా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ అద్భుతమైన బ్యాటింగ్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (కేరళ) ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. సూపర్బ్ షాట్స్‌తో ఆకట్టుకున్నావ్ అంటూ పొగడ్తల్లో ముంచెత్తాడు. ‘శాంసన్ చాలా చక్కటి ఆటగాడు. సంజూ 14 ఏళ్ల వయసులోనే అతని ఆటచూశాను. అప్పుడే అనుకున్న ఇండియా టీంలోకి మరో ధోనీ రానుబోతున్నాడని. వరుస రెండు ఐపీఎల్ ఇన్నింగ్స్‌లతో తనేంటో ప్రపంచానికి చాటిచెప్పాడు’ అంటూ థరూర్ ట్విటర్లో పేర్కొన్నారు. (ఆఖరి ఓవర్లలో... ఆరేశారు) థరూర్ కామెంట్‌పై బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాడు. శాంసన్‌ను వేరొకరిలా (ధోనీ) పొల్చాల్సిన అవసరం లేదు, అతనిలానే టీమిండియాలో గుర్తింపు పొందుతాడు అంటూ కౌంటర్ వేశాడు. సంజూని ధోనీతో పోల్చడం సరైనది కాదని ఎంపీ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వీరిద్దరి సంభాషణపై సోషల్ మీడియాలో ఇరువురి అభిమానులు స్పందిస్తున్నారు. స్టీవ్ స్మిత్ (27 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), సంజూ శాంసన్ (42 బంతుల్లో 85; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రాహుల్ తేవటియా (31 బంతుల్లో 53; 7 సిక్సర్లు) దూకుడైన ఆటతీరుతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం ఈ మ్యాచ్ హాట్ టాపిక్‌గా మారింది. -
మోదీపై విషంకక్కిన అఫ్రిది: పెను దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరు చేస్తుంటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఇప్పటికే అనేకసార్లు భారత్‌పై విషంకక్కిన పాకిస్తానీ.. మరోసారి నోరుపారేసుకున్నాడు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అన్యాయంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. లాక్డౌన్ నేపథ్యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు అఫ్రిది ఆదివారం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పర్యటించాడు. (ఆర్టికల్ 370 రద్దు: స్పందించిన అఫ్రిది) ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన షాహిద్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్ మొత్తం సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించింది. అయినా కశ్మీరీ పౌరులకు పాక్ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది’ అని వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు) కాగా పాక్ ఆటగాడు చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు తమదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. జాతియవాదంలో ఎప్పుడూ ముందుండే మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్విటర్ వేదికగా అఫ్రిదిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘కశ్మీర్లో భారత ప్రభుత్వం ఏడు లక్షల సైన్యాన్ని మోహరించిందని ఓ 16 ఏళ్లు వృద్ధుడు విషయం కక్కుతున్నాడు. భారత్ సొంతమైన కశ్మీర్ కోసం 70 ఏళ్లుగా భిక్షాటన చేస్తూనే ఉన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ బజ్వా, అఫ్రిది లాంటి వ్యక్తులు కుట్ర పన్నుతున్నారు. ఏం చేసినా కశ్మీర్ ఎప్పిటికీ భారతతీయుల సొంతమే’ అంటు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక అఫ్రిది వ్యాఖ్యలను యువరాజ్ సింగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, హర్బజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం అఫ్రిది వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. -
‘కొత్త’ ఢిల్లీ గెలిచేదెప్పుడు?
ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్... తొలి ఐదు సీజన్లలో మూడు సార్లు సెమీఫైనల్ (2012 ప్లేఆఫ్స్‌తో కలిపి) వరకు చేరి సత్తా ఉన్న టీమ్‌గా కనిపించింది. అయితే 2013 నుంచి జట్టు పరిస్థితి మరీ దీనంగా తయారైంది. రెండు సార్లు చివరి స్థానంలో నిలిస్తే... మరోసారి చివరి నుంచి రెండో స్థానం, మరో రెండు సార్లు చివరి నుంచి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఈసారి కొత్త కెప్టెన్ గంభీర్, కొత్త కోచ్ రికీ పాంటింగ్ డేర్‌డెవిల్స్ రాత మార్చగలరా చూడాలి. సాక్షి క్రీడా విభాగం :ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షా కోట్లాలో అభిమానులు తమ విజయం కోసం ఎదురు చూసి చూసి విసుగెత్తిపోయారు. ఐపీఎల్లో ఎన్నడూ లేని విధంగా యాజమాన్య హక్కులను రెండు సంస్థలు పంచుకోవడంతో కూడా డేర్‌డెవిల్స్ జట్టు వార్తల్లో నిలిచింది. ‘విఫల జట్టు’గా ముద్ర పడటం కూడా అందుకు ఒక కారణమని వినిపించింది. ఈసారి ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచాల్సిన బాధ్యత జట్టుపై ఉంది. ఐపీఎల్–11లో ఢిల్లీకి ఇప్పుడు గంభీర్ రూపంలో మంచి నాయకుడు దొరికాడు. కెప్టెన్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండు సార్లు విజేతగా నిలిపిన అతను తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. భారత జట్టుకు దూరమై చాలా కాలమైనా... ఇంకా టి20ల్లో గంభీర్ నమ్మదగిన బ్యాట్స్‌మన్ కావడం జట్టుకు అదనపు బలం. జట్టులో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి గంభీర్ మిడిలార్డర్‌కు మారే అవకాశమూ ఉంది. కోచ్‌గా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ వ్యూహాలు ఆ జట్టును కనీసం ప్లే ఆఫ్‌కు చేర్చగలవు. ఆ నలుగురు... ఢిల్లీ తుది జట్టులో కచ్చితంగా ఉండే నలుగురు విదేశీయుల్లో విధ్వంసకర ఓపెనర్ మున్రో, మ్యాక్స్‌వెల్ ఒక్క ఓవర్‌తో జట్టు రాత మార్చేయగలరు. వీరిద్దరితో పాటు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌కు కూడా చోటు ఖాయం. నాలుగో ఆటగాడిగా పేస్ బౌలర్ రూపంలో బౌల్ట్, రబడ అందుబాటులో ఉన్నారు. తాజా ఫామ్ ప్రకారం ఇద్దరూ ప్రమాదకరమైనవారే. ఒక వేళ మున్రో విఫలమైతే మరో భారీ హిట్టర్ జేసన్ రాయ్ కూడా ఎలాగూ ఉన్నాడు. కాబట్టి విదేశీ ఆటగాళ్లను ఎంచుకునే విషయంలో సమస్య లేదు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే మేనేజ్మెంట్ అనుభవంపై ఆధార పడుతుందా లేక కుర్రాళ్లకు అవకాశం ఇస్తుందా అనేది ఆసక్తికరం. శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ల స్థానాలకు తిరుగు లేదు. ఆల్‌రౌండర్‌గా విజయ్ శంకర్‌కు కూడా చోటు ఖాయం. నేపాల్ స్పిన్నర్ సందీప్ లిమిచానే ఐపీఎల్‌లోకి వచ్చినా అతను తన అవకాశం కోసం కొంత సమయం ఎదురు చూడక తప్పదు. జట్టు వివరాలు: గంభీర్ (కెప్టెన్), మన్‌జ్యోత్ కల్రా, పృథ్వీ షా, అయ్యర్, అభిషేక్ శర్మ, అమిత్ మిశ్రా, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, షమీ, సయన్ ఘోష్, నదీమ్, గుర్కీరత్ సింగ్ మాన్, జయంత్ యాదవ్, రాహుల్ తేవాటియా, విజయ్ శంకర్, నమన్ ఓజా, రిషభ్ పంత్ (భారత ఆటగాళ్లు). జేసన్ రాయ్, రబడ, సందీప్ లమిచానే, బౌల్ట్, క్రిస్ మోరిస్, మున్రో, క్రిస్టియాన్, మ్యాక్స్‌వెల్ (విదేశీ ఆటగాళ్లు). -
'షారుఖ్.. నీకు అభినందనలు'
కోల్‌కతా: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలియజేశారు. ఆయన యజమానిగా ఉన్న జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించడంపట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ టీం కెప్టెన్ గౌతమ్ గంభీర్‌కు కూడా అభినందనలు తెలియజేశారు. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్విట్టర్ ద్వారా మమత ఈ అభినందనలు అందించారు. -
‘ఛేజ్’ చేశారు
8 వికెట్లతో ఢిల్లీపై కోల్‌కతా గెలుపు రాణించిన గంభీర్, ఉతప్ప ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసగా నాలుగు ఓటములు... అన్నీ ఛేజింగ్లోనే... సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌లను పోగొట్టుకుంటూ అభాసుపాలవుతున్న కోల్‌కతా ఎట్టకేలకు ఒత్తిడిని జయించింది. లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి... ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచింది. తద్వారా సీజన్లో మూడో విజయం సాధించింది. న్యూఢిల్లీ: గత మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గంభీర్ అద్భుతంగా ఆడినా కోల్‌కతా సహచరులు నాటకీయంగా కుప్పకూలి మ్యాచ్‌ను చేజార్చుకున్నారు. ఈసారి సహచరులను నమ్మి తప్పుచేయొద్దనుకున్నాడేమో... నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ (56 బంతుల్లో 69; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి జట్టు ఖాతాలో విజయాన్ని చేర్చాడు. గంభీర్‌తో పాటు ఉతప్ప (34 బంతుల్లో 47; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించడంతో.... ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. డుమిని (28 బంతుల్లో 40 నాటౌట్; 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. కెప్టెన్ గంభీర్, ఉతప్ప తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించగా... మనీష్‌పాండే (14 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు), కలిస్ (6 బంతుల్లో 10 నాటౌట్; 1 ఫోర్) లాంఛనం పూర్తి చేశారు. గంభీర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రాణించిన డుమిని, కార్తీక్ నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించడంతో డేర్‌డెవిల్స్ శుభారంభం చేయలేకపోయింది. రెండు ఫోర్లు కొట్టి జోష్‌లో ఉన్నట్లు కనిపించిన డి కాక్ (10) మూడో ఓవర్లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. క్రీజ్‌లో సెటిలయ్యేందుకు ఇబ్బందిపడ్డ ఢిల్లీ కెప్టెన్ పీటర్సన్ (6) అనవసర పరుగుకోసం యత్నించి రనౌటయ్యాడు. 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను విజయ్, దినేశ్ తమ భుజాన వేసుకున్నారు. అయితే మూడో వికెట్‌కు 35 పరుగులు జోడించిన తర్వాత విజయ్ (24) డగౌట్‌కి చేరాడు. కలిస్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన కార్తీక్ (36) ఆ తర్వాతి ఓవర్లో అవుటయ్యాడు. శుక్లా (10) వెనుదిరిగాక.. డుమిని, కేదార్ జాదవ్ కోల్‌కతా బౌలర్లపై దాడికి దిగారు. డుమిని సిక్సర్లతో విరుచుకుపడగా.. జాదవ్ ఫోర్లు బాదాడు. చివరి నాలుగు ఓవర్లలో 54 పరుగులు రాబట్టడంతో ఢిల్లీ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. డుమిని, జాదవ్ అభేద్యమైన ఆరోవికెట్‌కు 55 పరుగులు జోడించారు. అదిరిపోయే ఆరంభం తొలి ఓవర్లో ఓపెనర్లు ఇబ్బందిపడ్డా రెండో ఓవర్ నుంచి చెలరేగిపోయారు. పరుగుల కోసం ఉతప్ప, గంభీర్ పోటీపడ్డారు. దీంతో పవర్ ప్లేలో 52 పరుగులు వచ్చాయి. ఇద్దరు అదే ఊపును కొనసాగించడంతో 11వ ఓవర్లో వంద పరుగులు దాటింది. విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో ఉతప్ప, పార్నెల్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. గంభీర్‌తో కలిసి తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించిన ఉతప్ప మూడు పరుగుల తేడాతో అర్ధ సెంచరీ చేజార్చుకున్నాడు. మరోవైపు జోరుమీదున్న కెప్టెన్ గంభీర్ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మనీష్ పాండేతో కలిసి జట్టును విజయపథాన నడిపించే ప్రయత్నంలో గంభీర్ అవుటయ్యాడు. అయితే మనీష్‌పాండే, కలిస్ జట్టును గెలిపించారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) గంభీర్ (బి) ఉమేశ్ 10; విజయ్ (సి) నరైన్ (బి) కలిస్ 24; పీటర్సన్ రనౌట్ 6; దినేశ్ కార్తీక్ (సి) కలిస్ (బి) షకీబ్ 36; డుమిని నాటౌట్ 40; శుక్లా (బి) నరైన్ 10; కేదార్ జాదవ్ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) : 160 వికెట్ల పతనం: 1-14; 2-26; 3-61; 4-85; 5-105. బౌలింగ్: సూర్య కుమార్ 1-0-8-0; కలిస్ 4-0-38-1; ఉమేశ్ 4-0-26-1; షకీబ్ 4-0-13-1; నరైన్ 4-0-38-1; వినయ్ 3-0-31-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప ఎల్బీడబ్ల్యూ (బి) పార్నెల్ 47; గంభీర్ (సి) కార్తీక్ (బి) పార్నెల్ 69; మనీష్ పాండే నాటౌట్ 23; కలిస్ నాటౌట్ 10; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) : 161 వికెట్ల పతనం: 1-106; 2-151. బౌలింగ్: షమీ 4-0-23-0; పార్నెల్ 4-0-21-2; శుక్లా 2-0-19-0; కౌల్ 3-0-29-0; డమిని 2-0-24-0; నదీమ్ 3.2-0-34-0. -
తండ్రయిన గంభీర్
కోల్‌కతా: భారత క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) సారథి గౌతమ్ గంభీర్ తండ్రయ్యాడు. గురువారం అతని భార్య నటాషా పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ ట్విట్టర్లో గౌతీని శుభాకాంక్షలతో ముంచెత్తింది. గంభీర్ దంపతులకు శుభాకాంక్షలు, కొత్త పాపకు కేకేఆర్ కుటుంబంలోకి స్వాగతం అంటూ ట్వీట్ చేసింది. -
ఐపీఎల్ కన్నా దేశవాళీ మిన్న: గంభీర్
న్యూఢిల్లీ: భారత జట్టులో పునరాగమనానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను వేదికగా చేసుకోబోనని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. దేశవాళీ క్రికెట్లో రాణించడం ద్వారానే అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెడతానన్నాడు. ‘జట్టులో పునరాగమనానికి ఐపీఎల్‌ను వేదికగా ఎంచుకోను. నైట్‌రైడర్స్ జట్టు విజయం కోసమే ఐపీఎల్ ఆడతా. రీ ఎంట్రీకి దేశవాళీ క్రికెట్ ఒక్కటే మార్గం. ఇప్పుడు నా దృష్టంతా దేవ్‌ధర్ ట్రోఫీ, ఐపీఎల్‌పైనే ఉంది’ అని గంభీర్ చెప్పాడు. చెత్త ఫామ్‌తో ఏడాది కాలంగా జట్టుకు దూరమైన గౌతీ ఇంగ్లండ్ పర్యటన కల్లా జట్టులో స్థానం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇక గంభీర్, 110 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ కొలిన్ జాక్సన్, షట్లర్ అశ్విని పొన్నప్పతో కలిసి ఢిల్లీలో జరిగిన ‘వింగ్స్ ఫర్ లైఫ్ వరల్డ్ రన్’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నాడు. వెన్నెముక పరిశోధనకు అవసరమైన నిధుల సేకరణ కోసం మే 4న భారత్ (సొనేపట్లో)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లోని 40 నగరాల్లో రన్‌ను నిర్వహించనున్నారు. ఈ రేస్‌కు గంభీర్, అశ్విని అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.