
తండ్రయిన గంభీర్
కోల్‌కతా: భారత క్రికెటర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) సారథి గౌతమ్ గంభీర్ తండ్రయ్యాడు. గురువారం అతని భార్య నటాషా పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్ ట్విట్టర్‌లో గౌతీని శుభాకాంక్షలతో ముంచెత్తింది. గంభీర్ దంపతులకు శుభాకాంక్షలు, కొత్త పాపకు కేకేఆర్ కుటుంబంలోకి స్వాగతం అంటూ ట్వీట్ చేసింది.