శభాష్ టీమిండియా.. మోడీ అభినందనలు | Narendra Modi congrats Team India for Lord's test winning | Sakshi
Sakshi News home page

శభాష్ టీమిండియా.. మోడీ అభినందనలు

Published Mon, Jul 21 2014 9:35 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

శభాష్ టీమిండియా.. మోడీ అభినందనలు - Sakshi

శభాష్ టీమిండియా.. మోడీ అభినందనలు

న్యూఢిల్లీ: లార్డ్స్ టెస్టులో చిరస్మరణీయ విజయం సాధించిన టీమిండియాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అద్భుతంగా ఆడిందని మోడీ అభినందనలు తెలియజేశారు. 'టీమిండియా అద్భుత విజయం సాధించింది. మీ విజయానికి దేశం గర్విస్తోంది. ప్రతి ఒక్కరు సంతోషించదగ్గ విషయమిది' అంటూ మోడీ ట్వీట్ చేశారు.

ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన రెండో టెస్టులో ధోనీసేన 95 పరుగులతో గెలిచింది. 28 ఏళ్ల తరువాత లార్డ్స్ లో టీమిండియా టెస్ట్ మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. భారత పేసర్ ఇషాంత్ శర్మ ఏడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

స్కోరు వివరాలు

భారత్ తొలి ఇన్నింగ్స్: 295 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 319 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్:342
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ :223 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement