లైబీరియా: లైబీరియా కాబోయే అధ్యక్షుడు జార్జ్ వేహ్‌కు ఐక్య రాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ శనివారం అభినందనలు తెలిపారు. శాంతియుతంగా జరిగిన ఎన్నికల్లో వేహ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరుపుకున్నందుకు లైబీరియన్లను అభినందించారు. రెండు ప్రజా యుద్ధాల అనంతరం జరిగి4న ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డు నిర్ధారించింది. ఫుట్‌బాల్ అంతర్జాతీయ మాజీ ఆటగాడైన వేహ్ ఉపాధ్యక్షుడు జోసెఫ్ బోకైను ఓడించారు. ఈయన జనవరి 22న అధ్యక్ష పదవిని చేపడతారు. తన ఓటమిని అంగీకరిస్తూ మోకై అధ్యక్షుడిగా ఎన్నికైన వేహ్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment