Liberian
-
లైబీరియా కొత్త అధ్యక్షుడికి గుటెరస్ అభినందనలు
లైబీరియా: లైబీరియా కాబోయే అధ్యక్షుడు జార్జ్ వేహ్కు ఐక్య రాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ శనివారం అభినందనలు తెలిపారు. శాంతియుతంగా జరిగిన ఎన్నికల్లో వేహ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరుపుకున్నందుకు లైబీరియన్లను అభినందించారు. రెండు ప్రజా యుద్ధాల అనంతరం జరిగి4న ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వేహ్ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డు నిర్ధారించింది. ఫుట్బాల్ అంతర్జాతీయ మాజీ ఆటగాడైన వేహ్ ఉపాధ్యక్షుడు జోసెఫ్ బోకైను ఓడించారు. ఈయన జనవరి 22న అధ్యక్ష పదవిని చేపడతారు. తన ఓటమిని అంగీకరిస్తూ మోకై అధ్యక్షుడిగా ఎన్నికైన వేహ్ను అభినందించారు. -
ఎలెన్ జాన్సన్కు నేడు ఇందిర శాంతి బహుమతి
న్యూఢిల్లీ: లైబీరియా అధ్యక్షురాలు, నోబెల్ బహుమతి విజేత ఎలెన్ జాన్సన్ సిర్లీఫ్ గురువారం ప్రతిష్టాత్మక ‘ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతి’ని అందుకోనున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాన్సన్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బహుమతి ప్రదానం చేయనున్నారు. ఆఫ్రికాలో ఓ దేశానికి అధ్యక్షురాలిగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి మహిళగా 74 ఏళ్ల ఎలెన్ చరిత్ర సృష్టించారు. ఎలెన్ ప్రస్తుతం భారత పర్యటనలోనే ఉన్నారు. ఆర్థికవేత్త కూడా అయిన ఆమె మహిళల హక్కుల కోసం, శాంతి కోసం విశేష కృషిచేశారు. 2011లో లేమా జిబోవీ, తవకెల్ కర్మాన్లతో కలిసి నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.