ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ కు తెలుగురాష్ట్రాల సీఎంలు చంద్రబాబునాయుడు, కె. చంద్రశేఖర్ రావు, విపక్ష నేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
హైదరాబాద్ :
ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్లో ఫైనల్స్ లోకి వెళ్లడంతో పాటు ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన హైదరాబాదీ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె. చంద్రశేఖర్ రావు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన జగన్
భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ) ఉపగ్రహ నౌక పీఎస్‌ఎల్‌వీ సి-27 రాకెట్‌ను శనివారం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇస్రో శాస్త్రజ్ఞులను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఒక సందేశంలో అభినందించారు. ఈ సంవత్సరపు తొలి ప్రయోగం ఫలప్రదం అయినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సైనాకు అభినందనలు :
ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్లో బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్కు చేరుకున్నందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని మ్యాచ్‌ల్లో సైనా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.