t cm
-
ఖేడ్ ప్రజలకు అభినందనలు : కేసీఆర్
ఖమ్మం : మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం స్పందించారు. ఖేడ్ ప్రజలు అపురూపమైన మెజార్టీ ఇచ్చారన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వచ్చే సీజన్‌కల్లా ప్రాజెక్టును నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఓట్ల కోసం కాదని అన్నారు. రూ. 14 వేల కోట్లతో 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కటిస్తామని తెలిపారు. రెండున్నరేళ్ల తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కల్యాణలక్ష్మి వర్తింపు చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికి మంచినీరు అందిస్తామని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
'తెలంగాణకు ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలి'
న్యూఢిల్లీ : తెలంగాణకు ఐపీఎస్‌ల సంఖ్య పెంచాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం కేసీఆర్ కోరారని న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాలచారి వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. అనంతరం ఎస్ వేణుగోపాలచారి విలేకర్లతో మాట్లాడుతూ... విభజన చట్టం మేరకు అసెంబ్లీ సీట్లను పెంచాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారని చెప్పారు. అలాగే ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేయాలని ఆయన్ని కేసీఆర్ కోరారని తెలిపారు. అన్ని విషయాలకు రాజ్‌నాథ్‌సింగ్ సానుకూలంగా స్పందించారని వేణుగోపాలచారి పేర్కొన్నారు. -
రెండేళ్లయినా బెరుకేనా?
కొందరు అమాత్యుల పనితీరుపై సీఎం అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: ‘‘మంత్రులుగా బాధ్యతలు తీసుకుని రెండేళ్లు కావొస్తోంది. అయినా బెరుకుగానే ఉంటున్నారు. శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారు. కొందరికి కనీసం బడ్జెట్ ఎలా రూపొందించుకోవాలో కూడా తెలియడంలేదు’’ అని సీఎం కేసీఆర్ కొంద రు మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆదివారం కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం కొన్ని రాజకీయాంశాలు మాట్లాడినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి ఘన విజయం దక్కడంతో పలువురు మంత్రులు సీఎంకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం కోసం మంత్రులు గల్లీగల్లీ తిరిగారు. ఇప్పుడు ఒక్కసారే మాయం కావొద్దు. హైదరాబాద్ కార్యక్రమాల్లో కనిపించండి’’ అని అన్నారు. హైదరాబాద్‌కు అన్ని శాఖలతో సం బంధం ఉంటుంది కాబట్టి మంత్రులు నిత్యం ఇక్కడ కనిపించాలన్నట్టు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన పాత, కొత్త కేడర్లతో మంత్రులు విధిగా సంబంధాలు కలిగి ఉండాలని, వారిని పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తలుగా తీర్చిదిద్దాలని చెప్పారు. గ్రేటర్ ఫలితాల తర్వాత హైదరాబాద్ ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ తెలిసిందని, అసెంబ్లీ ఎన్నికల నాటికి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు టీఆర్ఎస్వే కావాలని నిర్దేశించినట్లు సమాచారం. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా మంత్రులు వారంపాటు హైదరాబాద్‌లోనే ఉండాలని ఆదేశించినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సారథ్య బాధ్యతలు మోసిన మంత్రి కేటీఆర్‌కు మంత్రివర్గ సహచరులంతా అభినందనలు తెలిపారు. -
సైనాకు ముఖ్యమంత్రులు, వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో ఫైనల్స్ లోకి వెళ్లడంతో పాటు ప్రపంచ నెంబర్ 1 ర్యాంకు సాధించిన హైదరాబాదీ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె. చంద్రశేఖర్ రావు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన జగన్ భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహం (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం-1డీ) ఉపగ్రహ నౌక పీఎస్ఎల్వీ సి-27 రాకెట్‌ను శనివారం విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించిన ఇస్రో శాస్త్రజ్ఞులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఒక సందేశంలో అభినందించారు. ఈ సంవత్సరపు తొలి ప్రయోగం ఫలప్రదం అయినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. సైనాకు అభినందనలు : ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో బ్యాడ్మింటన్ దిగ్గజం సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకున్నందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని మ్యాచ్‌ల్లో సైనా విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.