ఖేడ్ ప్రజలకు అభినందనలు : కేసీఆర్ | kcr greets Narayankhed voters | Sakshi
Sakshi News home page

ఖేడ్ ప్రజలకు అభినందనలు : కేసీఆర్

Published Tue, Feb 16 2016 2:23 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

ఖేడ్ ప్రజలకు అభినందనలు : కేసీఆర్ - Sakshi

ఖేడ్ ప్రజలకు అభినందనలు : కేసీఆర్

ఖమ్మం : మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం స్పందించారు. ఖేడ్ ప్రజలు అపురూపమైన మెజార్టీ ఇచ్చారన్నారు. ఆ నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా కేసీఆర్ అభినందనలు తెలిపారు. భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

వచ్చే సీజన్కల్లా ప్రాజెక్టును నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఓట్ల కోసం కాదని అన్నారు. రూ. 14 వేల కోట్లతో 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కటిస్తామని తెలిపారు.

రెండున్నరేళ్ల తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కల్యాణలక్ష్మి వర్తింపు చేస్తామన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికి మంచినీరు అందిస్తామని కేసీఆర్ ప్రజలకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement