
తగ్గేదేలె అన్న డైలాగ్‌ను సినిమాలోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఫాలో అవుతున్నాడు అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప 2 చిత్రంతో ఏకంగా రూ.1871 కోట్లు సాధించి రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. అలాగే ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ తొలి సంచికపై కనిపించిన మొట్టమొదటి భారతీయ హీరోగా అరుదైన ఘనత సాధించాడు. ఈ కవర్ పేజీ షోటషూట్ సమయంలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
భయపడ్డా..
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. గంగమ్మ జాతర సన్నివేశంలో చీర కట్టుకోవాలని చెప్పినప్పుడు నేను మొదట భయపడ్డాను. ఇది వర్కవుట్ కాదేమో అన్నాను. కానీ సుకుమార్ (Sukumar) మాత్రం ఆ సన్నివేశంలో నువ్వు చీర కట్టుకుని అమ్మాయిగా కనిపించాలంతే అన్నాడు. అందుకోసం మొదట డ్రాయింగ్స్ వేశారు. నాకు ఏ లుక్ సూటవుతుందని పరీక్షించారు. తర్వాత నెమ్మదిగా నాలోనూ నమ్మకం మొదలైంది. కచ్చితంగా ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనిపించింది.
నటుడిగా ఐదున్నర మార్కులు
అదే సమయంలో ఇది నాకెంతో ఛాలెంజింగ్‌గానూ అనిపించింది. ఎందుకంటే చీర కట్టినా కూడా ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాలి. ఫైనల్‌గా ఆ సీన్ అనుకున్నట్లుగానే చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ అయిందని నేను గర్వాన్ని తలకెక్కించుకోలేదు. నటుడిగా నాకు 10కి 5.5 మార్కులు వేసుకుంటాను అని చెప్పుకొచ్చాడు. పుష్ప 2 (Pushpa 2 The Rule) విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప 1 చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందించాడు.
చదవండి: దుబాయ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు
Comments
Please login to add a commentAdd a comment