బోర్డర్ కోలి బ్రీడ్‌కి చెందిన మెస్సీ అనే కుక్క నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' అనే సినిమా ఆస్కార్స్ 2024కి నామినేట్ అయ్యింది. అయితే ఆ మూవీకి అవార్డులు రాకపోయినా ఈ కుక్క మంచి ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా దాని హావభావాలతో అందర్నీ కట్టిపడేసింది. ఆ మూవీతో 2023లో మంచి స్టార్‌డమ్ తెచ్చుకున్న ఈ కుక్క ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో మాత్రం అందరి అటెన్షన్ తనవైపుకి తిప్పుకుని మరీ హైలెట్‌గా నిలిచింది.
ఈ వేడుకలకు ఆ మెస్సీ డాగ్ బో టై ధరించి హుందాగా వచ్చింది. ఈ కార్యక్రమంలో 'ఓపెన్ హైమర్' మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఈ చిత్రంలో రాబర్డ్ డౌనీ జూనియర్ పాత్రలో అలరించిన ఐరన్ మ్యాన్ నటుడుకి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చింది. అయితే ఈ ఆస్కార్ వేడుకకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్ ఆ అవార్డుని ప్రకటించగానే.. మెస్సీ తన ముందరి కాళ్లతో తప్పట్లుకొడతూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో హెస్ట్ జిమ్మీ ఆ కుక్క ఆటిట్యూడ్‌ని హైలెట్ చేస్తూ మెచ్చుకున్నాడు.
the dog from anatomy of a fall looks just like cillian murphy when he's in a public place and needs to socialize, so cute of him. i love you messi pic.twitter.com/cR7vPzoNkp
— pau la 🦢 (@sexiestlawyer) March 11, 2024
అంతేగాదు 2006లో వచ్చిన " ది షాగీ డాగ్" మూవీ గురించి ప్రస్తావిస్తూ దానికి సీక్వెల్‌గా సినిమా తీయాలనుకుంటే ఈ మెస్సీని పెట్టుకుంటే సూపర్ డూపర్ హిట్ అవుతుందని మెచ్చుకోలుగా అన్నాడు. ఇక ఈ మెస్సీ డాగ్ నటించిన 'అనాటమీ ఆఫ్ ఎ ఫాల్' మూవీలో బాగా గుర్తుండిపోయే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ.. ఈ కుక్క ప్రేక్షకుల మనుసులో చెరగని ముద్ర వేయించుకుందని ప్రశంసించాడు. ఈ వేడుకల్లో మెస్సీ డాగ్ హైలైట్‌గా నిలిచి అందర్నీ అలరించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
they really had Messi, the dog from Anatomy of a Fall, applauding Robert Downey Jr. after his acceptance speech lol #Oscars pic.twitter.com/XBrxoAPGq2
— Spencer Althouse (@SpencerAlthouse) March 11, 2024
(చదవండి: ఆస్కార్ 2024: రెడ్ కార్పెట్‌పై తడబడినా..భలే గమ్మత్తుగా కవర్ చేసిన నటి!)
Comments
Please login to add a commentAdd a comment