![Self Proclaimed Time Traveller on Dec 25 The World Will Change - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/6/Dec-25_1.jpg.webp?itok=BD1AXo1I)
Self Proclaimed Time Traveller on Dec 25 The World Will Change: నిజంగానే మనిషికి కాలంలోకి ప్రయాణించగల శక్తి వస్తే.. మన జీవితాలు ఎలా ఉండేవో కదా. ఇన్ని మరణాలు, యుద్ధాలు, కన్నీళ్లు ఇవేవి ఉండేవి కావేమో. లేదంటే ఇంతకంటే రాక్షసంగా ఉండేవారమేమో. ఏది ఏమైనా కాలంలోకి ప్రయాణిస్తే.. అనే ఊహ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్టయ్యాయి. రీల్ మీద ఓకే కానీ.. వాస్తవంగా కాలంలోకి ప్రయాణించడం అనేది అసాధ్యం అని అందరికి తెలుసు.
అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టైమ్ ట్రావెలర్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ టిక్‌టాక్ యూజర్.. తాను 2027 నుంచి వచ్చానని భూమ్మీద తానే చివరి వ్యక్తిని అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇతడి జాబితాలోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. ఇతడైతే ఏకంగా త్వరలోనే భూమి మీద నమ్మశక్యం కానీ మార్పులు చోటు చేసుంటాయని తెలిపాడు. ఆ వివరాలు..
(చదవండి: ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?)
5ఎంటీటీ అనే ఈ టిక్‌టాక్ అకౌంట్‌కు 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొనన్ని రోజుల క్రితం ఈ యూజర్ తన టిక్‌టాక్ అకౌంట్‌లో నమ్మశక్యం కానీ విషయాలు పోస్ట్ చేశాడు. ‘‘డిసెంబర్ 20న ఎనిమిది మంది మనుషులకు సూర్యుని తరంగాల ద్వారా సూపర్ పవర్స్ వస్తాయి. ఇక డిసెంబర్ 25న ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురు చేసే సంఘటన చోటు చేసుకోనుంది. ఇది మానవాళి జీవితాలను శాశ్వతంగా మారుస్తుంది’’ అన్నాడు.
అంతేకాక ‘‘ఈ రెండు రోజులను భవిష్యత్ తరాలు వందల ఏళ్ల పాటు గుర్తుంచుకుంటాయి. మానవ జీవితాలు ఎలా మారాయో చర్చించుకుంటాయి. ఈ రెండు రోజుల నాడు చోటు చేసుకోబోయే సంఘటనల తర్వాత.. నేను నిజమైన టైమ్ ట్రావేలర్‌ని అని జనాలు నమ్ముతారు’’ అని తెలిపాడు.
(చదవండి: ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే?)
అంతేకాక 2027 నాటికి స్వీడన్, నార్వే, యూకే, ఫిన్లాండ్ దేశాలు కలిసి అతి పెద్ద పవర్‌హౌస్‌ను నిర్మిస్తాయని.. మిగతా చిన్న దేశాలు దీనిలో చేరాలని ఆశిస్తాయని చెప్పుకొచ్చాడు. ఇక 2024లో 35 వేల ఏళ్ల క్రితం నాటి బంకర్ ఒకటి వెలుగు చూస్తుది. అర్జెంటినాలో ఈ బంకర్‌ని గుర్తిస్తారు. దీనిలో అనేక రహస్యాలు ఉంటాయి. పురాతన కాలం నాటివి, సాంకేతకతకు సంబంధించిన రహస్యాలు ఆ బంకర్‌లో ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment