Super Power
-
హైదరాబాద్‌లోనే ఎక్కువ..! సూపర్ పవర్!
సాక్షి, సిటీబ్యూరో: ‘మీర్ఖాన్పేట కేంద్రంగా ఏర్పాటు చేయదలిచిన ఫ్యూచర్/ఫోర్త్‌సిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఫార్మా, ఐటీ అనుబంధ సంస్థలు అనేకం ఇక్కడికి రాబోతున్నాయి. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమలకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని నిర్ణయించాం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయబోతున్నాం. లైన్లను విస్తరించడంతో పాటు డిమాండ్ తట్టుకునే విధంగా కొత్త సబ్స్టేషన్లు, అదనపు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయబోతున్నాం. రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం’ అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ చెప్పారు. శుక్రవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే.. ఏటా 30 నుంచి 40 శాతం గ్రోత్.. సాధారణంగా ప్రతి ఏటా విద్యుత్ గ్రోత్ రేటు ఏడు శాతం నమోదవుతుంది. కానీ ఈసారి డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. రూరల్ ఏరియాలో గ్రోత్‌రేట్ ఏడు శాతం ఉంటే, నగరంలో 30 శాతం, నగర శివారు మున్సిపాలిటీల్లో 40 శాతం ఉన్నట్లు గుర్తించాం. భవిష్యత్‌ను డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని నిర్ణయించాం. ఆ మేరకు 2027లో రావాల్సిన కొత్త సబ్ స్టేషన్లను 2025లోనే తీసుకురాబోతున్నాం. డిస్కం పరిధిలో మొత్తం 164 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లకు టెండర్లు పిలిచాం. వీటిలో ఒక్క గ్రేటర్ జిల్లాల్లోనే 88 సబ్స్టేషన్లు రాబోతున్నాయి. బంజారాహిల్స్ సర్కిల్లో 5, హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్లో 9, హైదరాబాద్ సౌత్ సర్కిల్లో 9, సికింద్రాబాద్ సర్కిల్లో 13, రాజేంద్రనగర్ సర్కిల్లో 13 చొప్పున, సైబర్‌సిటీ సర్కిల్లో 6, సరూర్‌నగర్ సర్కిల్ 5, వికారాబాద్‌లో 10, మేడ్చల్‌లో 18 చొప్పున కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఫీడర్లకు సెన్సార్లు... నగరంలోని అన్ని సబ్స్టేషన్లకు మల్టిపుల్ ఇన్ కమింగ్, అవుట్గోయింగ్ లైన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఔటర్ చుట్టూ విద్యుత్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. 400 కేవీ సబ్స్టేషన్లు అనుసంధానిస్తున్నాం. నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం జీహెచ్ఎంసీ సహా అన్ని ప్రధాన ప్రాంతాల్లోని సబ్స్టేషన్ల ఫీడర్లకు సెన్సార్లు ఏర్పాటు చేస్తున్నాం. ఏదైనా సాంకేతిక లోపం తలెత్తి కరెంట్ సరఫరా నిలిచిపోతే.. వెంటనే ఆ సమాచారం సంబంధిత అధికారులకు చేరే విధంగా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్ అంబులెన్స్‌లను కూడా వీటికి అనుసంధానిస్తున్నాం. ఇప్పటికే టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. మరో మూడు మాసాల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. కనురెప్ప పాటు కూడా కరెంట్ పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే పలు పీటీఆర్ల సామర్థ్యం కూడా పెంచాం. దెబ్బతిన్న డీటీఆర్లను మార్చుతున్నాం. సెక్షన్లవారీగా ఎల్సీలు తీసుకుని, లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. మణికొండలోనే అత్యధికం.. మణికొండ, అయ్యప్ప సొసైటీల్లో అంచనాలకు మించి విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఇక్కడ ఉన్న భవనాలపై స్పష్టత లేకపోవడంతో డిమాండ్‌పై స్పష్టత కొరవడింది. దీంతో విద్యుత్ వినియోగం ఊహకందడం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ డిమాండ్ అత్యధికంగా ఉన్న సర్కిళ్ల పరిధిలో అదనపు డి్రస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయబోతున్నాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు సహా దెబ్బతిన్న డీటీఆర్‌ల స్థానంలో కొత్తవి అమర్చడం వంటి వాటిని గుర్తించి, పునరుద్ధరించడం తదితర పనులు చేపట్టాం. అలాగే.. రాజేంద్రనగర్‌లో 160, సైబర్ సిటీలో 151, మేడ్చల్‌లో 160, హబ్సిగూడలో 857, బంజారాహిల్స్‌లో 89, సికింద్రాబాద్‌లో 148, హైదరాబాద్ సెంట్రల్లో 250, హైదరాబాద్ సౌత్‌లో 90, సరూర్‌నగర్‌లో 12, సంగారెడ్డిలో 563 అదనపు డీటీఆర్లు ఏర్పాటు చేయబోతున్నాం. ప్రమాదాల నివారణ సహా ట్రాఫిక్ రద్దీ నియంత్రణలో భాగంగా రోడ్డుకు అడ్డంగా ఉన్న విద్యుత్ పోల్స్ తొలగింపునకు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులతో కలిసి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాం. -
సూపర్ పవర్‌గా భారత్!
ఇటీవలి కాలంలో భారతదేశానికి చైనా ప్రధాన భద్రతా ముప్పుగా పరిణమించింది. చైనా.. పాకిస్తాన్‌తో జతకట్టి, భారత్‌కు ఆందోళనకరంగా మారింది. చైనా తన సరిహద్దుల్లో భారత్‌తో తలపడుతున్న ఘర్షణల ఫలితంగా ఈ రెండు దేశాలు ప్రత్యర్థులుగా మారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్- భారత్ మధ్య వ్యూహాత్మక ప్రయోజనాల కలయిక భారత్‌కు మరింత శక్తిని అందించనుంది. ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను నియంత అని అభివర్ణించారు. సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగంలో యూఎస్ భాగస్వామ్యం ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో అటు బైడెన్ లేదా ఇటు మోదీ తమ భాగస్వామ్యం ప్రధానంగా చైనా సవాళ్లను ఎదుర్కోవడం గురించేనని ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. కానీ ఈ భాగస్వామ్యం ఇందుకేనని నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన భారత్.. అగ్రరాజ్యం అమెరికా తమ సంబంధాలను బలపరు కోవడం చూస్తుంటే ఇది భారత్‌కు చైనాను ఎదుర్కొనేందుకు కలసివచ్చే అంశంలా కనిపిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. ఆమధ్య భారత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పర్యటన చైనా గురించి కాదని, అయితే సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగంలో చైనా పాత్రకు గురించిన ప్రస్తావన ఎజెండాలో ఉన్నదన్నారు. భారత్- అమెరికా మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందాలలో భారతదేశంలో జనరల్ ఎలక్ట్రిక్ ఫైటర్-జెట్ ఇంజిన్ల తయారీ, జనరల్ అటామిక్స్ సాయుధ డ్రోన్ల కొనుగోలు ప్రముఖంగా ఉన్నాయి. వీటి సాయంతో భారత్ చైనా సైన్యం ఎత్తుగడలను గుర్తించి, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోనుంది. ఇది కూడా చదవండి: ‘నా కల సాకారమైన వేళ..’ అరబిందో స్ఫూర్తిదాయక సందేశం! రాబోయే 30 ఏళ్లలో.. భారత్- అమెరికాల బిలియన్-డాలర్ల జీఈ డీల్‌లో అత్యాధునిక జెట్ ఇంజన్ టెక్నాలజీ ఒకటి. ఈ భాగస్వామ్యం రాబోయే సంవత్సరాల్లో ఇరు దేశాల రక్షణ పరిశ్రమల సామర్థ్యాన్ని మరింత పెంపొందించనుంది. యుఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ సీనియర్ నిపుణుడు సమీర్ లాల్వానీ మాట్లాడుతూ ‘ఇది ప్రతిష్టాత్మక సున్నితమైన సాంకేతికత అని, దాదాపు రెండు దశాబ్దాలుగా భారత్ డిమాండ్ చేస్తోందని అన్నారు. ఇది భవిష్యత్తులో అనేక తరాల జెట్ ఇంజిన్ల తయారీకి దారి తీస్తుందన్నారు. రాబోయే 30 సంవత్సరాలలో భారతదేశ రక్షణ రంగం, ఆవిష్కరణ అభివృద్ధిలో ఈ భాగస్వామ్యం కీలకం కానున్నదని పేర్కొన్నారు. టెక్ స్టార్టప్‌లు పుష్ చేసే దిశగా భారత్ కొన్ని దశాబ్దాలుగా సైనిక ఆధునికీకరణలో నిమగ్నమై ఉన్న చైనాతో పోటీ పడాలంటే, భారత్‌లోని టెక్ స్టార్టప్‌లను ఎలా పుష్ చేయాలో, తద్వారా సైనిక స్థాయిలో ఎలా సాంకేతికతలను రూపొందించాలనే దానిని మోదీ ప్రభుత్వం గుర్తించిందని యుఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పీస్ ఒక కథనంలో పేర్కొంది. సాంకేతికత, రక్షణ సహకారానికి ఉన్న అడ్డంకులను తొలగించడమనేది ప్రధాని మోదీ పర్యటనలో చోటుచేసుకున్న ప్రధాన అంశమని ఆ కథనంలో పేర్కొన్నారు. వివరాలు వెల్లడించిన వాషింగ్టన్ పోస్ట్ కరోనావైరస్ మహమ్మారి సమయంలో సుమారు మూడు సంవత్సరాలు ప్రపంచం నుండి తనను తాను వేరుచేసుకున్న చైనా తిరిగి ఇప్పుడు తన పరిస్థితులను చక్కదిద్దుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా 2014 నుండి 2018 వరకు మోదీకి ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ సైనిక పరికరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించే దీర్ఘకాల ప్రయత్నంలో భాగంగానే భారత్.. అమెరికాతో జీఈ ఒప్పందం చేసుకున్నదన్నారు. ప్రస్తుతం బ్రౌన్ యూనివర్శిటీలో సీనియర్ ఫెలోగా ఉన్న సుబ్రమణ్యం చేసిన వ్యాఖ్యలను ది వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. అమెరికాతో కుదిరిన చిప్ ప్లాంట్, డిఫెన్స్ ఒప్పందాలు రక్షణ రంగంలో తయారీలను పునరుద్ధరించే లక్ష్యాన్ని పూర్తి చేయనున్నాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కొన్నేళ్ల క్రితమే రాయితీలను కల్పించే భారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మహమ్మారి సమయంలో పెట్టుబడిదారులకు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ కనిపించిందని విశ్లేషకులు అంటున్నారు. హిమాలయ సరిహద్దుల్లో ఘర్షణలు అమెరికా పరిపాలన అధికారులు భారతదేశం తమకు ప్రధాన ఆర్థిక, సైనిక భాగస్వామిగా చేరడంపై సంతృప్తిగా ఉన్నారు. ఇది చైనాకు వ్యతిరేకంగా ఇండో-పసిఫిక్‌లో పోషించగల వ్యూహాత్మక పాత్రను స్పష్టం చేస్తున్నదంటున్నారు. కాగా గత దశాబ్దం కాలంగా భారతదేశానికి చైనా ముప్పుగా పరిణమించింది. 2020 నుండి ఇరు దేశాలు తమ హిమాలయ సరిహద్దుల గురించి ఘర్షణపడుతున్నాయి. ఈ ఘర్షణల్లో 20 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. 1962 యుద్ధం తర్వాత చైనాపై భారతదేశవాసుల అభిప్రాయంలో మార్పు వచ్చింది. చైనాను వ్యతిరేకించేవారి సంఖ్య పెరిగింది. కేంద్ర ప్రభుత్వం 100కి పైగా చైనీస్ యాప్‌లతో పాటు ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌ను కూడా నిషేధించింది. చైనాను అధిగమించి.. మీడియాతో మాట్లాడిన భారత జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ భారత్- అమెరికాల భాగస్వామ్యం రక్షణ రంగంలో నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందన్నారు. భారతదేశం తన స్వయంప్రతిపత్తిని సంరక్షించుకుంటూనే, అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపేతం చేసుకుంటున్నదన్నారు. పరిస్థితులన్నింటినీ గమనిస్తే భారత్ రాబోయే కాలంలో చైనాను అధిగమించి సూపర్ పవర్ కానున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: సెప్టెంబర్‌లో ఆదిత్య–ఎల్1 ప్రయోగం! -
‘డిసెంబర్ 25న ప్రపంచానికి భారీ షాక్.. మారనున్న జీవితాలు’
Self Proclaimed Time Traveller on Dec 25 The World Will Change: నిజంగానే మనిషికి కాలంలోకి ప్రయాణించగల శక్తి వస్తే.. మన జీవితాలు ఎలా ఉండేవో కదా. ఇన్ని మరణాలు, యుద్ధాలు, కన్నీళ్లు ఇవేవి ఉండేవి కావేమో. లేదంటే ఇంతకంటే రాక్షసంగా ఉండేవారమేమో. ఏది ఏమైనా కాలంలోకి ప్రయాణిస్తే.. అనే ఊహ చాలా అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమాలన్ని సూపర్ హిట్టయ్యాయి. రీల్ మీద ఓకే కానీ.. వాస్తవంగా కాలంలోకి ప్రయాణించడం అనేది అసాధ్యం అని అందరికి తెలుసు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో టైమ్ ట్రావెలర్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం ఓ టిక్‌టాక్ యూజర్.. తాను 2027 నుంచి వచ్చానని భూమ్మీద తానే చివరి వ్యక్తిని అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇతడి జాబితాలోకి మరో వ్యక్తి వచ్చి చేరాడు. ఇతడైతే ఏకంగా త్వరలోనే భూమి మీద నమ్మశక్యం కానీ మార్పులు చోటు చేసుంటాయని తెలిపాడు. ఆ వివరాలు.. (చదవండి: ఆదిత్య 369 @30: ఆ టైం మెషిన్‌కు స్ఫూర్తి ఎవరో తెలుసా?) 5ఎంటీటీ అనే ఈ టిక్‌టాక్ అకౌంట్‌కు 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రమంలో కొనన్ని రోజుల క్రితం ఈ యూజర్ తన టిక్‌టాక్ అకౌంట్లో నమ్మశక్యం కానీ విషయాలు పోస్ట్ చేశాడు. ‘‘డిసెంబర్ 20న ఎనిమిది మంది మనుషులకు సూర్యుని తరంగాల ద్వారా సూపర్ పవర్స్ వస్తాయి. ఇక డిసెంబర్ 25న ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురు చేసే సంఘటన చోటు చేసుకోనుంది. ఇది మానవాళి జీవితాలను శాశ్వతంగా మారుస్తుంది’’ అన్నాడు. అంతేకాక ‘‘ఈ రెండు రోజులను భవిష్యత్ తరాలు వందల ఏళ్ల పాటు గుర్తుంచుకుంటాయి. మానవ జీవితాలు ఎలా మారాయో చర్చించుకుంటాయి. ఈ రెండు రోజుల నాడు చోటు చేసుకోబోయే సంఘటనల తర్వాత.. నేను నిజమైన టైమ్ ట్రావేలర్ని అని జనాలు నమ్ముతారు’’ అని తెలిపాడు. (చదవండి: ఆడుతూ..పాడుతూ కోట్లు సంపాదిస్తుంది..ఎలా అంటే?) అంతేకాక 2027 నాటికి స్వీడన్, నార్వే, యూకే, ఫిన్లాండ్ దేశాలు కలిసి అతి పెద్ద పవర్‌హౌస్‌ను నిర్మిస్తాయని.. మిగతా చిన్న దేశాలు దీనిలో చేరాలని ఆశిస్తాయని చెప్పుకొచ్చాడు. ఇక 2024లో 35 వేల ఏళ్ల క్రితం నాటి బంకర్ ఒకటి వెలుగు చూస్తుది. అర్జెంటినాలో ఈ బంకర్‌ని గుర్తిస్తారు. దీనిలో అనేక రహస్యాలు ఉంటాయి. పురాతన కాలం నాటివి, సాంకేతకతకు సంబంధించిన రహస్యాలు ఆ బంకర్లో ఉంటాయి. చదవండి: ‘2027 నుంచి వచ్చాను.. భూమ్మీద నేనే చివరి వ్యక్తిని’ -
సూపర్ కప్పు ఎవరిది?
‘మాస్ పవర్, పోలీస్ పవర్’ సినిమాల తర్వాత శివ జొన్నలగడ్డ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘సూపర్ çపవర్’. ప్రియా ఆగస్టీన్, మీర హీరోయిన్లుగా నటించారు. కొండేకర్ బాలాజీ, రమేష్ కడూరి ఈ సినిమాకు సహనిర్మాతలు. ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సురేశ్ కొండేటి . ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘సూపర్ పవర్’ చిత్రాన్ని తెరకెక్కించాం. ఎన్నో అడ్డంకులను అధిగమించి సూపర్ పవర్ కప్పును హీరో ఎలా గెలుచుకున్నాడు? అన్నదే కథ’’ అని అన్నారు. సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత బసవప్ప. -
అతీంద్రియ శక్తి
మిస్టర్ ఫాదరింగే అద్భుతాల్ని, మహిమల్ని నమ్మేవాడు కాదు. కాని, ఓసారి లాంగ్ డ్రాగన్ రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి డ్రింక్ తీసుకుంటున్న సమయంలో ఒక అద్భుతం జరిగింది. అది కూడా అతీంద్రియశక్తులను నిరసిస్తూ అతను అనర్గళంగా ఉపన్యిస్తున్న సమయంలో జరిగింది. అతీంద్రియశక్తులు ఎక్కడో కాదు కేవలం తనలోనే ఉన్నట్లు అతనికి తెలిసింది. అది అతనికి నమ్మశక్యం కాలేదు. కాని, నమ్మక తప్పలేదు. తనను మాట్లాడనీయకుండా అడ్డుపడుతున్న బీమ్మిష్ పై ఫాదరింగేకు పీకలదాకా కోపం వచ్చింది. కాని, మంచి మాటలతోనే అతణ్ణి ఒప్పించాలని ఓపిక తెచ్చుకుని మరోసారి వివరించాడు. ‘‘చూడు మిస్టర్ బీమ్మిష్! అసలు అతీంద్రియ శక్తి అంటే ఏమిటో తెలుసా నీకూ? కేవలం మానసిక శక్తితో అనుకున్నదానిని సాధించడం! ఇది సహజసిద్ధమైన ప్రకృతికి విరుద్ధంగా జరగాలి–అవునా?’’ అని అన్నాడు ఫాదరింగే అందరివైపు చూస్తూ– ఒకరిద్దరు అవునన్నట్లు తలలూపి, ఫాదరింగేను బలపరిచారు. రెస్టారెంట్ యజమాని అక్కడే ఉన్నాడు. అవునూ–కాదూ–అని చెప్పకుండా గుంభనంగా ఉన్నాడు. ‘‘ఉదాహరణకు ఇదిగో టేబుల్ మీద కొవ్వొత్తి ఉంది. అది వెలుగుతోంది. దీన్ని తలకిందులుగా తిప్పితే వెలగదు కదా?’’ ‘‘అయితే వెలగనే వెలగదా?’’ అన్నాడు బీమ్మిష్. ‘‘అవును! వెలగదు– అయితే?’’ అన్నాడు మళ్ళీ అయిష్టంగా. ‘‘అదే చెప్తూ ఉన్నా– అలాంటప్పుడు ఎవరైనా నాలాంటి వాడు కొవ్వొత్తిని తలక్రిందులుగా వెలగమని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏమవుంది? వెలుగుతుందా?’’ అని అందరి ముఖాల్లోకి చూస్తూ అన్నాడు ఫాదరింగే. అంతే–ఒక్కసారి అందరూ సంభ్రమాశ్చర్యాలతో కొవ్వొత్తిని చూశారు. ఇదేమీ చోద్యం అన్నట్లు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. కారణమేమిటంటే ఫాదరింగే ఏదో మాట వరుసకు చెప్పింది చెప్పినట్లుగానే జరిగింది. కొవ్వొత్తి గాల్లో తలకిందులుగా నిలబడింది. మంట భూమి వైపు వెలుగుతోంది. జరగరానిది జరిగిందే అన్నట్లు అందరూ నోళ్ళు తెరిచారు. నూటికి నూరుపాళ్ళు అసాధ్యమనుకున్నది సాధ్యమైందేమిటీ?–అని ఫాదరింగే నమ్మలేకపోయాడు. కాని కళ్ళెదుట విచిత్రం కనిపిస్తుంటే, నమ్మాల్సి వచ్చింది. ‘‘ఇదేమిటీ? పిచ్చోడిలా ఇలా చేశావు? ట్రిక్కులు చేయాలనుకుంటే ఇక వేరే లేనే లేవా? నిప్పుతో చెలగాటమేమిటి? అదృష్టం బావుండి ఎవరికి ఏమీ కాలేదు’’–అని అన్నాడు తీవ్రస్వరంతో మిస్టర్ కాక్స్. టేబుల్ చుట్టూ కూర్చొని డ్రింక్ తీసుకుంటున్న వాళ్ళలలో మిస్టర్ కాక్స్ ఒకడు. అక్కడున్న వాళ్ళందరిలోకి కాస్త ధనవంతుడు. చాలామంది అతణ్ణి బలపరిచారు. వాళ్ళందరి మాటలు వినేసరికి ఫాదరింగేకి కూడా అనుమానం వచ్చింది. ‘‘నిజమే–నిప్పుతో చెలగాటం–తనెందుకు చేశాడు?’’ అనుకుని ముఖం మాడ్చుకుని, రెస్టారెంట్లోంచి బయటపడ్డాడు. దారి పొడవునా తన అతీంద్రియశక్తుల గురించే ఆలోచించాడు. ఇంట్లో పడకగదిలో కూర్చున్నాడు. చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుని ‘ఎందుకిలా జరిగింది? ఎలా జరిగింది?’ అని చాలాసేపు ఆలోచించాడు. ఎదురుగా టేబుల్ మీద ఉన్న క్రొవ్వొత్తి మీదికి దృష్టి మళ్ళింది. ‘మరోసారి ఆ అద్భుతశక్తి ప్రయోగం చేద్దామా?’ అని కొంటె కోరిక కలిగింది. క్రొవ్వొత్తిని పైకి లెమ్మన్నాడు. అన్నీ అతను అనుకున్నట్లుగానే జరిగాయి, కాగితం చుట్టి గ్లాసు చేశాడు. అందులోకి నీళ్ళు రావాలన్నాడు. ఆ నీళ్ళ రంగు మారిపోవాలన్నాడు. అన్నీ అతను అనుకున్నట్టుగానే జరుగుతూ వచ్చాయి. అప్పటికి రాత్రి బాగా పొద్దు పోయింది. పొద్దున్నే లేవాలి. మళ్ళీ ఆఫీసు పని! అయినా తనలోని మనోశక్తిని ఉపయోగించి, కష్టపడకుండానే ఆఫీసు పని పూర్తి చెయ్యొచ్చు కదా? అనే ఆలోచన రాగానే కొంచెం గర్వపడ్డాడు. పడుకుని నిద్రపోయాడు. మరునాడు ఉదయం మామూలుగా నిద్ర లేచాడు. ‘రాత్రి జరిగిందంతా కల కాదు కదా?’ అనే అనుమానం వచ్చింది. దినమంతా చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ తనలోని అతీంద్రియశక్తుల్ని పరీక్షించుకున్నాడు. ఆరోజు ఆఫీసులో పనేమీ చేయలేదు. చివరి పదినిమిషాల్లో తన ట్రిక్ ఉపయోగించి ఆరోజు చేయాల్సిన పనంతా ముగించాడు. అప్పటికి నగరంలోని అతని మిత్రబృందానికి అతని అతీంద్రియశక్తుల గురించి తెలిసిపోయింది. క్రితం రాత్రి రెస్టారెంట్లో– అలా కొన్ని గంటలు గడిచాయో లేదో ఫాదరింగే తనకు కావల్సిన ఖరీదైన వస్తువులన్నీ సృష్టించుకున్నాడు. ఉన్నఫళాన తనకు ఇవన్నీ ఎలా వచ్చాయని చుట్టు పక్కలవాళ్ళు అనుకుంటారేమోనని భయపడ్డాడు కూడా! తను మామూలు మనిషి కాదని, దివ్యశక్తులు గలవాణ్ణని కొంచెం గర్వంగా అనిపించసాగింది. భోజనం ముగించుకుని, వీధిలో అలా కొంతదూరం నడిచాడు. ఉన్నట్టుండి ఆలోచన వచ్చింది. సృజనాత్మకంగా ఏదైనా వింతపని చేద్దామనిపించి, చేతికర్ర మట్టిలో గుచ్చాడు. మనసులోని సర్వశక్తుల్ని కేంద్రీకరించి–చేతికర్ర మట్టిలో గుచ్చాడు. మనసులోని సర్వశక్తుల్ని కేంద్రీకరించి–చేతికర్ర గులాబీ వలె పూయాలని అనుకున్నాడు. ఆశ్చర్యం? నడిరోడ్డు మీద గులాబీ పొద తయారైంది. తన మేజిక్ శక్తిని ఎవరైనా గమనిస్తున్నారా? అని చుట్టుపక్కల చూశాడు. ఎవరూ కనబడలేదు. ‘హమ్మయ్య! ఎవరూ లేరు లే’ అనుకున్నాడు. గులాబీ పొదని మళ్ళీ చేతికర్రగా మార్చాల నుకుని ‘వెనక్కి వెళ్ళు’ అన్నాడు. ‘‘పూర్వస్థితికి వెళ్ళు’’ అని అనాల్సింది. పదప్రయోగంలో పొరపాటు జరిగింది. గులాబీపొద వేగంగా వెనక్కి వెళ్ళింది. అటునుంచి వస్తున్న పాదాచారి ముఖం పగిలింది. అతని శరీరమంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. ‘‘ఎవడ్రా వాడూ? కళ్ళు కనబడడం లేదా? గులాబీ చెట్టు నా పైకి విసిరాడూ?’’ అంటూ అతను ఫాదరింగే వైపు కోపంగా చూశాడు. దుదృష్టవశాత్తు అతనొక పోలీస్ కానిస్టేబుల్. కలిసి నడుస్తున్న ముగ్గురు పోలీసుల్లో అతనొకడు. పోలీసులు ఫాదరింగేని పట్టుకుని దులిపేశారు. ‘‘డ్యూటీలో ఉన్న పోలీసుని కొట్టావయ్యా! అది పెద్ద క్రైమ్. నీ పనేమౌతుందో చూసుకో’’ అని బెదిరించారు. ఫాదరింగేని హడలగొట్టారు. ఎలాగో తప్పించుకుని, ఫాదరింగే ఇంటిదారి పట్టాడు. నిద్రపోయే ముందు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. తనని బెదిరించిన పోలీసుల్ని ఆ ఊళ్ళో లేకుండా అతి దూరంలో ఉన్న శాన్ఫ్రాన్సిస్కోకు బదిలీ చేయించాడు. తర్వాత నిశ్చింతగా నిద్రపోయాడు. మరునాడు జనాలు రెండు విషయాలు చెప్పుకోసాగారు. ఒకటి ఉన్నఫళంగా రోడ్డు మీద గులాబీలు పూయడం! రెండవది బీటు కానిస్టేబుల్స్ ఊళ్ళోంచి మాయం కావడం. ఆరోజు ఆదివారం. ఫాదరింగే చర్చికి వెళ్ళాడు. అక్కడ ‘చట్ట విరుద్ధమైన అంశాలు’ అనే విషయం మీద మిస్టర్ మేడింగ్ ఉపన్యసించాడు. ఫాదరింగేకు చటుక్కన్న ఒక ఆలోచన వచ్చింది– తన దివ్యశక్తుల గూర్చి చర్చించి మేడింగ్ సలహా తీసుకుంటే ఎలా ఉంటుందీ?–అనీ! ఉపన్యాసం అయిపోగానే ఫాదరింగే వెళ్ళి మేడింగ్ను కలిశాడు. మేడింగ్ పండితుడు, తత్వవేత్త, మేధావి. పొడుగు మెడతో, మెరిసే కళ్ళతో బక్కపల్చగా ఉంటాడు. మేడింగ్, ఫాదరింగేని తన ఆఫీసు గదికి తీసుకెళ్ళాడు. సంభాషణ ఎలా ప్రారంభించాలో ఫాదరింగేకి తెలుసు. మత్తు పానీయాల్ని మంచినీళ్ళు చేశాడు. పేదరికం లేకుండా చేశాడు. ఫాదరింగేలో దాగిన శక్తుల పరిధి ఎంత వరకుందోనని మేడింగ్ చిన్న చిన్న ప్రయోగాలు చేయించడం, ఫాదరింగే సులభంగా చేయడం జరుగుతూ వచ్చింది. అన్నిటికన్నా గొప్ప అద్భుతం ఏదైనా చేయించాలని మేడింగ్ అనుకున్నాడు. ఓరోజు ఆకాశంలోని చంద్రుణ్ణి చూపించి ‘చంద్రుణ్ణి ఆపేయ్ చూద్దాం’ అన్నాడు. ‘‘అబ్బా! అది మరీ దురాశ. నాలోని శక్తి అంతవరకు చేరగలదా?’’ అని అనుమానపడ్డాడు ఫాదరింగే. ‘‘అయితే మనం నివసించే ఈ భూగోళాన్ని శాసించు. భూభ్రమణాన్ని ఆపు’’ అన్నాడు మేడింగ్. అలాంటి అద్భుతం చేద్దామని ఫాదరింగే కలలో కూడా ఊహించలేదు. కాని, మేడింగ్ కోరిక మేరకు ప్రయత్నించి చూస్తే తప్పేమిటీ–అనుకున్నాడు. తన కాళ్ళ కింద ఉన్న భూమిని చూసి సాదరంగా మనసులో ప్రార్థించాడు. ‘‘అమ్మా! భూదేవీ ఒక్కసారి నీ భ్రమణాన్ని ఆపు తల్లీ!’’ అన్నాడు. అంతే–మరుక్షణంలో ఫాదరింగే గాల్లో లేచి ఎగరసాగాడు. క్షణానికి పది, పన్నెండు మైళ్ళ వేగంతో ముందుకు పోసాగాడు. పైకి, కిందికి, ఒక్కోసారి వేగంగా, మరోసారి మెల్లిగా పల్టీలు కొట్టసాగాడు. మొదట కాసేపు తమాషాగా అనిపించినా, తర్వాత అతని ఉనికి అతనికి తెలియకుండా అయ్యింది. ఊపిరి అందడం కూడా కష్టమై, గాల్లో ఒక ఇసుకరేణువుల్లా కొట్టుకుపోవడం అన్యాయమనిపించింది. అప్పుడు ఫాదరింగే అనుకున్నాడు. ‘‘ఏది ఏమైనా నేను సురక్షితంగా కిందికి దిగాలి’’–అని! ప్రచండమైన ఆ వేగానికి రాపిడి వల్ల పుట్టిన మంటలు అతని బట్టలకు అంటుకుని కాలడం ప్రారంభించిన క్షణంలో సురక్షితంగా నేలకు దిగాడు. బతికిపోయాననుకున్నాడు ఫాదరింగే. కాని ఎదురుగా మార్కెట్ క్లాక్ టవర్ ఉన్నఫళంగా ముక్కలై రాలిపోయింది. ఎగురుతున్న కాకులు ఎత్తయిన భవనాలకు కొట్టుకుని గుడ్డు పగిలినట్టు పగిలిపొయ్యాయి. జీవితంలో ఎప్పుడూ విననంతటి భీకరమైన ధ్వనులు వినిపించాయి. భూగోళం చుట్టూ గాలి మహోధృతంగా వీచింది. ఫాదరింగేకు తన అవయవాలు తన స్వాధీనంలో లేవని తెలిసింది. ఒక్క నిముషంలో ఇంతటి ప్రళయమా? ఇదంతా మేడింగ్ చేసిన పొరపాటు. అవునూ...నా పక్కన మేడింగ్ లేడేమిటీ? అని అనుకుని అయోమయంగా దిక్కులు చూశాడు...ఫాదరింగే. పిడుగులు, భూకంపాలు, వరదలు ఒకే ఒక్క నిముషంలో వాతావరణ భీభత్సమైపోయింది. ఫాదరింగేకు ఏమీ అర్థం కాలేదు. ఆకాశమెత్తు లేచిన ధూళి కెరటంలో ఎక్కడా ఏమీ కనిపించడం లేదు. అన్నీ శిథిలాలు. అంతా విధ్వంసం. ప్రళయం. ప్రకంపనం. ప్రభంజనం. భూమి ఎంత వేగంతో పరిభ్రమిస్తుందో, దాని మీద ఉన్న నదులు, పర్వతాలు, జంతువులు, చెట్లు, మనుషులు, వస్తువులు అన్నీ అదే వేగంతో పరిభ్రమిస్తున్నాయి. ఫాదరింగే తనలోని శక్తులన్నింటినీ కూడగట్టి భూభ్రమణాన్ని ఆపేశాడు. కాని దాని మీద వాటి గురించి అతను ఆలోచించలేదు. భూమితో పాటు వాటిని కూడా ఆగమంటే ఆగిపోయ్యేవేమో–కాని, ఫాదరింగే వాటికి ఏ సూచనా చేయలేదు. భూమి ఉపరితలంలో ఉన్నవి సెకనుకు తొమ్మిదిమైళ్ళ వేగంతో ముందుకు విసిరివేయబడ్డాయి. భూమిని ఆపిన మరుక్షణం ఫాదరింగే గాల్లోకి ఎగిరిపోవడానికి కారణం అదే–అనాలోచితంగా చేసిన ఒక పని వల్ల ప్రపంచమంతా సర్వనాశనమయ్యింది. శాస్త్రీయ అవగాహన, సాంకేతిక విజ్ఞత దేనికైనా అవసరం. మరీ ముఖ్యంగా ఒక శక్తిని ఉపయోగిస్తున్నవాడు, దాని పూర్వాపరాల్ని చాలా తీవ్రంగా, లోతుగా, ఆలోచించాల్సి ఉంటుంది. అదేదో ఆషామాషీ కాదు...అనే విషయం ఫాదరింగే ఆలస్యంగా గ్రహించాడు. అసలు అతీంద్రియశక్తులు తనకు ఎందుకు కలిగినట్లూ? కలిగినంత మాత్రాన తనెందుకు ఉపయోగించినట్లు? తన పక్కన మేడింగ్ ఉండాలి కదా? ఏడీ? ఎక్కడా? ‘మేడింగ్ నువ్వు నా పక్కన ఉండాలి’ అని మనసులో అనుకున్నాడు. మేడింగ్ పక్కనే ప్రత్యక్షమయ్యాడు. తనకు తోడుగా ఒకడున్నాడని కొంత ధైర్యం కలిగింది. ఇంతలో సముద్ర కెరటం మహోధృతంగా దూసుకువస్తూ కనిపించింది. అది తమదాకా వచ్చిందంటే మరణం తప్పదు. ఇక ఎన్ని అతీంద్రియశక్తులుంటే మాత్రం ఏంలాభం? ‘‘కెరటమా ఆగు!’’ ఆజ్ఞాపించాడు ఫాదరింగే. కెరటం అల్లంతదూరంలో ఆగిపోయింది. ఈ ప్రపంచాన్ని మళ్లీ యథాస్థితికి తేగలిగితే చాలు–ఆ పై తనకిక ఏ అతీంద్రియశక్తులు వద్దు. వాటిని ఉపయోగిస్తూ తను ప్రయోగాలు చేయడమూ వద్దు–అనుకొని ఫాదరింగే కాళ్ళ మీద కూర్చున్నాడు. చూపుడు వేలు భూమిలో గుచ్చి కళ్ళు మూసుకుని తన సర్వశక్తుల్నీ మనసులో కేంద్రీకరించి– ‘‘ఈ భీభత్సం ఆగిపోవాలి. భూమి యథాస్థితికి రావాలి. కాలం వెనక్కి వెళ్ళాలి. లాంగ్ డ్రాగన్ రెస్టారెంట్లో కొవ్వొత్తి మేజిక్ చేయడానికి ముందున్న పరిస్థితి రావాలి. అన్నింటినీ మించి నాలోని అద్భుతశక్తులు నశించాలి. ఆత్మశక్తీ, అతీంద్రియ శక్తీ ఏదీ వద్దు. ఆత్మవిశ్వాసం గల మంచి మనిషిలా బతకాలి’’ అని కోరుకున్నాడు. ఫాదరింగే ఆత్మశక్తి చివరిసారిగా పనిచేసింది. (ఈ కథలో జరిగిన సంఘటన లేవీ ఫాదరింగేకి తెలియవు. అతను తన అతీంద్రియశక్తులన్నింటినీ తనకు తానై వదులుకున్నాడు. అతనిప్పుడు సాదాసీదా మనిషి. అతీంద్రియశక్తుల్ని కాకుండా ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకుని బతకుకున్న మనిషి) మూలం : హెచ్.జి.వెల్స్ తెలుగు: డాక్టర్ దేవరాజు మహారాజు బ్రిటీష్ రచయిత హె.జి.వెల్స్ (1866–1946) రాయల్ కాలేజీ ఆఫ్ సైన్స్ నుండి విద్యా విషయంలో ఓ కోర్సు చేసి, తర్వాత సృజనాత్మక రచయితగా స్థిరపడ్డాడు. జీవిక కోసం ఏ వృత్తినీ ఎంచుకోలేదు. రచనే ఊపిరి. రచనే జీవితంగా బతికారు. సైన్స్ నేపథ్యంలోంచి చిక్కటి హాస్యం వెదజల్లే తెలివైన కథలు రాస్తూ సాహిత్యరంగంలో అడుగుపెట్టారు. ద టైం మిషన్ (1895), ద వార్ ఆఫ్ ద వరల్డ్ (1898), ద ఫస్ట్ మ్యాన్ ఇన్ ద మూన్, ది ఇన్విజిబుల్ మ్యాన్ వంటి నవలలలో ఏ ఒక్కటి తిరగేసినా అతని అద్వితీయమైన మేధాశక్తి, అద్భుతమైన ఊహాశక్తీ దర్శనమిస్తాయి. మనిషి చంద్రునిపై అడుగుపెట్టక ముందే ‘చంద్రునిపై మొదటి మనిషి’ పేరుతో నవల రాశాడంటే ఆయన ఊహాశక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కేవలం సైన్స్‌ఫిక్షన్ మాత్రమే కాదు, సామాజిక సమస్యల మీద కూడా నవలలు రాశారు. -
స్పేస్ సూపర్ పవర్‌గా భారత్: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం జాతి నుద్దేశించి ప్రసంగించారు. ముందుగానే కీలక ప్రకటన చేయనున్నానని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మోదీ మాట్లాడుతూ ప్రపంచంలో అంతరిక్ష రంగంలో సత్తా చాటిన భారతదేశం స్పేస్ సూపర్ పవర్‌గా మారిందన్నారు. ఈ సందర్భంగా దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా, రష్యా , చైనా తర్వాత భారత్ స్పేస్ సెంటర్‌గా ఎదిగిందన్నారు. ఇది ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ అంశమని పేర్కొన్నారు. దేశ భద్రత, టెక్నాలజీ ఎచీవ్‌మెంట్‌లో యాంటి శాటిలైట్ వెపన్ ఒక మైలురాయిలాంటిదన్నారు. యాంటీ శాటిలైట్ వెపన్ ఏ-ఎస్ఏటీ ద్వారా లో ఎర్త్ ఆర్బిట్‌లో లైవ్ శాటిలైట్‌ను కూల్చేశామని ప్రకటించిన మోదీ 'మిషన్ శక్తి' ఆపరేషన్‌ను మూడు నిమిషాల్లో విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ధన్యావాదాలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే యాంటీ శాటిలైట్ వెపన్‌ను రూపొందించామన్నారు. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా దగ్గర మాత్రమే ఆ టెక్నాలజీ ఉంది. అంతమాత్రాన తాము ఏ దేశానికి వ్యతిరేకం కాదని ప్రపంచానికి తెలియజేయాలని భావిస్తున్నానన్నారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినతరమైన ఆపరేషన్ అన్నారు. అయతే దేశాల మధ్య యుద్ధ వాతావరణం కల్పించడం తమ ఉద్దేశం కాదన్నారు. చదవండి : సంచలనం రేపుతున్న ప్రధాని మోదీ ట్వీట్ -
భారత్ సూపర్ పవర్ కావాలి
అడిలైడ్: ప్రపంచ క్రికెట్లో భారత్ ఆధిపత్యం కొనసాగాలని, సూపర్ పవర్‌గా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని టీమిండియా సారథి కోహ్లి చెప్పాడు. విశ్వవ్యాప్తంగా భారతీయులు ఉన్న నేపథ్యంలో మనం టెస్టులకు ప్రాధాన్యమిస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ వస్తుందని చెప్పుకొచ్చాడు. కుర్రాళ్లు కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ౖపైనే ఆసక్తి పెంచుకోవడం ఎంతమాత్రం తగదని... అసలైన ఆట అయిన ‘టెస్టు’లపై కూడా దృష్టి పెట్టాలని కోహ్లి సూచించాడు. ఓ స్పోర్ట్స్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘వన్డేలు, టి20లు కూడా క్రికెటే! అందులో రాణించాలనుకోవడంలో తప్పులేదు. అయితే వాటికే పరిమితమవడం... టెస్టులను చిన్నచూపు చూడటం తప్పు. కుర్రాళ్లు చాలామంది సంప్రదాయ టెస్టులకు విలువ ఇవ్వడం లేదు. ఇది వారి కెరీర్‌కు ఎంతమాత్రం మంచిది కాదు. ఇలా చేస్తే ఒత్తిడి ఎదుర్కోలేక మానసిక సమస్యలు తప్పవు. తద్వారా కెరీర్‌ను కొనసాగించలేకపోవచ్చు’ అని కుర్రాళ్లను హెచ్చరించాడు. ఐదు రోజుల ఆట ఆడేందుకు కుర్రాళ్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలన్నాడు. ‘ఏదో రెండు గంటలు ఆడటం, కొన్ని ఓవర్లు వేయటం ఆటను ముగించడం సరైన పద్ధతి కానేకాదు. కుర్రాళ్లు అసలైన టెస్టు మజాకు అలవాటు పడాలి. మన విజన్‌ను బట్టి అభిమానులుంటారు. టెస్టుల్ని ఆసక్తికరంగా ఆడితే తప్పకుండా ప్రేక్షకులు పెరుగుతారు. భారతీయులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. ఇదే మన బలం. ఐదు రోజుల ఆటను గౌరవిస్తే, మనం టెస్టుల్ని శాసిస్తే, సంప్రదాయ క్రికెట్ అగ్రస్థానంలో ఉంటుంది’ అని అన్నాడు. రాబోయే రోజుల్లో టెస్టు క్రికెట్లో భారత్ దుర్భేద్యమైన జట్టుగా ఎదగాలని తాను ఆశిస్తున్నట్లు కోహ్లి చెప్పాడు. -
మహిమ పేరిట మోసం
రాయగడ : మహిమ గల హనుమాన్ నాణెం పేరున మోసం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన టి.రంగారావు అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుని మోసగించిన కేసుకు సంబంధించి రాయగడకు చెంది, ప్రస్తుతం భువనేశ్వర్‌లో సెక్యూరిటీ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న రోహిత్‌మాలిక్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయగడ ఐఐసీ ఆర్.కె.పాత్రో, ఏఎస్సై అశోక్ కుమార్ సాహు నేతృత్వంలో గురువారం సాయంత్రం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం ఎస్సై ఆస్తులను కూడా సోదా చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. 1818వ సంవత్సరం నాటి హనుమాన్ రాగినాణెం అత్యంత మహిమ గలదని నమ్మబలికి విశాఖపట్టణానికి చెందిన టి.రంగారావు నుంచి ముడుసార్లు రూ.5,40,000 తీసుకున్నట్లు రాయగడ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుకు సంబంధించి సూత్రధారి అజిత్‌బాత్రా పరారీలో ఉండగా ప్రధాన నిందితుడైన ఎస్సై రోహిత్ మాలిక్, రాయగడ ఇందిరానగర్‌కు చెందిన టి.ఉమాశంకర్, కల్యాణసింగుపురానికి చెందిన ఆర్.ప్రసాదరావు, ధవలేశ్వరబాగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను కోర్టులో హజరు పరిచారు. నిందితుల బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించడంతో వారిని సబ్‌జైలుకు తరలించారు. -
కిమ్‌పై ఆసక్తికర కథనం
ప్యొంగ్యాంగ్ : వరుసగా అణ్వస్త్ర ప్రయోగాలు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు... ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ గురించి ఓ ఆసక్తికర కథనం. ఉత్తర కొరియా అధికార మీడియా 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ' కిమ్‌కు అతీత శక్తులు ఉన్నాయంటూ ఓ పెద్ద వ్యాసాన్నే ప్రచురించింది. ఇటీవలె ఆయన 9 వేల అడుగుల ఎత్తున్న మౌంట్ పక్తూ పర్వతాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరునవ్వులు చిందిస్తున్న కిమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంత దూరం ఎక్కినా.. కాస్త కూడా అలసి పోయినట్టు కనిపించక పోవడం వెనుక కిమ్‌కున్న సూపర్ పవర్స్ కారణమంట. మూడేళ్ల వయసులోనే ఆయన కారును నడిపారని, 9 సంవత్సరాల వయసులో సెయిలర్ గా పోటీ పడ్డారని ఆ కథనం పేర్కొంది. అంతేకాదు వాతావరణ నియంత్రణా శక్తులు కూడా ఆయనకు ఉన్నాయని... ఎండ కావాలని కోరితే ఎండ ఉంటుందని, వర్షం కావాలనుకుంటే వర్షాలు కురుస్తాయని తెలిపింది. కిమ్ ఆధ్వర్యంలో ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు ఓ సరికొత్త ఔషధాన్ని కూడా తయారు చేశారంట. ఎయిడ్స్, ఎబోలా సహా ఎన్నో రకాల క్యాన్సర్లు, నపుంసకత్వం, గుండె జబ్బులను నయం చేస్తుందని, యాంటీ రేడియో యాక్టివ్ గానూ పని చేస్తుందని అందులో వివరించింది. -
'2030నాటికి ప్రపంచాన్ని నడిపించేది ఇండియానే'
రాయ్‌పూర్: 'మరో 14 ఏళ్లు.. అంటే 2030 నాటికి ఇండియా ప్రపంచాన్ని నడిపించే శక్తిగా మారడం ఖాయం. అప్పటికి ఇక్కడ జనాభా పెరుగుతుంది. నగరాలు, పట్టణాలు విస్తరిస్తాయి. మధ్యతరగతి వర్గం బలపడుతుంది. మౌళిక సదుపాయాలు కూడా మెరుగవుతాయి. గ్రాడ్యుయేట్లకు కొదువే ఉండదు. కొత్తకొత్త ఆవిష్కరణు పురుడుపోసుకుంటాయి. పేటెంట్ దక్కించుకునేవారి సంఖ్యా పెరుగుతుంది. ఇదే.. ఇదే కారణం వల్ల ప్రపంచదేశాలు ఇండియా పట్ల విపరీతమైన ఆసక్తిని, ఇండియాతో బలమైన సంబంధాలను కోరుకుంటున్నాయి' అని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. మంగళవారం ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన ఆయన రాయ్‌పూర్‌లో ఐఐటీ, ఐఐఎం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దాదాపు అన్ని రంగాల్లో ఇండియా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని, ఆ మేరకు అమెరికా కూడా అపరిమితమైన సహకారాన్ని అందిస్తున్నదని రిచర్డ్ వర్మ చెప్పారు. గడిచిన రెండేళ్ల కాలంలో ఇరుదేశాల మధ్య అన్ని రంగాల్లో బంధాలు మరింత పటిష్టం అయ్యాయని, వ్యాపారవాణిజ్యాలు 100 బిలియన్ డాలర్లకు చేరుకున్నదని తెలిపారు. 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారని, గతేడాది 11 లక్షల మంది భారతీయులు అమెరికాకు వెళితే, అదే స్థాయిలో 10 లక్షల మంది అమెరికన్లు ఇండియాకు వచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇండియా సూపర్ పవర్ గా ఎదగాలని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తపించిపోతారని, ఇండియా పేరు విన్నప్పుడల్లా ఆయన ఉద్వేగానికి గురవుతారని వర్మ చెప్పుకొచ్చారు. చరిత్రపొడవునా విడివిడిగా ప్రస్థానాన్ని సాగించిన అమెరికా- ఇండియాలు గడిచిన దశాబ్ధాలుగా సమాంతరంగా ప్రయాణిస్తున్నాయని, భవిష్యత్తులో అవి మరింత దగ్గరవుతాయని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆ పని ఇంకాస్త వేగంగా జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు వర్మ చెప్పారు. అంతకుముందు సీఎం రమణ్ సింగ్ సహా పలువురు ఉన్నతాధికారులను కలుసుకున్న అమెరికా రాయబారి.. ఛత్తీస్ గఢ్ వ్యాపారానికి అత్యంత అనుకూల రాష్ట్రంగా ఎదిగినందుకు అభినందనలు తెలిపారు. -
రియో ఒలంపిక్స్‌లో సూపర్ పవర్ ఎవరు ?
-
యువశక్తే భారత్ సూపర్‌పవర్
ఏఎన్‌యూ: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ తదితర సాంకేతిక రంగాల్లో 40 శాతం భారత యువకులు అగ్రస్థానాల్లో ఉన్నారని ఏఎన్‌యూ వీసీ ఆచార్య కె వియ్యన్నారావు చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో వీసీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న యువత మేథస్సును దేశాభివృద్ధి కోసం వినియోగించాలన్నారు. దేశంలో 60 శాతం ఉన్న యువ సంసదను సద్వినియోగం చేసుకుంటే ప్రపంచంలో భారత్ మరిన్ని అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ ధర్ మాట్లాడుతూ ప్రధాన మోడీ దూర దృష్టితో దేశాభివృద్దికి ప్రణాళికలు రూపొందిస్తున్నారన్నారు. రెక్టార్ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి రాజశేఖర్, గణతంత్ర దిన వేడుకల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి సిద్దయ్య, ఆర్ట్స్, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫార్మసీ కళాశాలల ప్రిన్సిపల్స్ ఆచార్య వి చంద్రశేఖర్, ఆచార్య బి విక్టర్‌బాబు, డాక్టర్ పీపీఎస్ పాల్ కుమార్, ఆచార్య ఏ ప్రమీలారాణి ప్రసంగించారు. అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన ఈ సందర్బంగా ఏఎన్‌యూ క్రీడా మైదానంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఏఎన్‌యూ ఆర్ట్స్, సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల విభాగాలు, ఏఎన్‌యూ రవాణా విభాగం, అనుబంధ కళాశాలలు వివిధ అంశాలపై శకటాలను ప్రదర్శించాయి. ఉత్తమ శకటాలకు వీసీ వియ్యన్నారావు బహుమతులు అందజేశారు. -
‘భారత్ సూపర్ పవర్ ’ శాస్త్రవేత్తలతోనే సాధ్యం
సాక్షి, బెంగళూరు : భారత్‌ను సూపర్ పవర్‌గా మార్చడం కేవలం శాస్త్రవేత్తల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ఈ విషయంలో రాజకీయ నాయకులు ఏమీ చేయలేరని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ పేర్కొన్నారు. గురువారం ఆయన న గరంలోని నిమ్హాన్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటైన ఇండియన్ టెక్నాలజీ కాంగ్రెస్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రాజకీయ నాయకులు కేవలం దేశాన్ని సూపర్ పవర్‌గా మార్చేందుకు హామీలు మాత్రమే ఇవ్వగలరు కానీ, ఆ హామీలను కార్యరూపంలోకి తీసుకొచ్చి భారత్‌ను ప్రపంచ పటంలో సూపర్‌పవర్‌గా మార్చడం కేవలం శాస్త్రవేత్తల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో అణు పరీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమయ్యామని తెలిపారు. అయితే ఆ సమయంలో అణు పరీక్షలపై అమెరికా ఆంక్షలు విధించిందని గుర్తు చేశారు. అయినా కూడా ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలామ్ సలహాతో అణు పరీక్షలకు సన్నద్ధమయ్యామని చెప్పారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే అణు పరీక్షల నుంచి వెనకడుగు వేశాం తప్పితే అమెరికా ఆంక్షలకు బెదిరి కాదని అన్నారు. బెంగళూరు నగరం ఐటీ రాజధానిగా గుర్తింపు పొందడానికి తాను ప్రధానిగా ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలే ప్రధాన కారణమని దేవెగౌడ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో విద్యుత్, ఇతర ఇంధనాల తీవ్రత అధికంగా ఉందని, ఈ తీవ్రతను ఎదుర్కొనేలా దేశం స్వావలంబన సాధించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో విశ్వేశ్వరయ్య టెక్నికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్.మహేషప్ప తదితరులు పాల్గొన్నారు. -
కేటీపీపీకి నోటీసులు
బకాయిలపై స్పందించని అధికారులు నిబంధనలకు తిలోదకాలు భూనిర్వాసిత గ్రామాలపై శీతకన్ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ మరిచారు పత్తాలేని పర్యావరణ పరిరక్షణ గణపురం: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ పవర్ విద్యుత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కేటీపీపీ.. పన్నుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బకాయిపడిన పన్నులను చెల్లించాలని కేటీపీపీకి చెల్పూరు గ్రామపంచాయతీ నోటీసులు పంపింది. చెల్పూరు శివారులో సుమారు వెయ్యి ఎకరాల్లో ఉన్న 500 మెగావాట్ల ప్లాంటుతో పాటు. నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల ప్లాంటు, ఇటీవల మంజూరైన 800 మెగావాట్ల ప్లాంట్లకు సంబంధించిన లేఅవుట్, పంచాయతీ అనుమతుల పన్నులు లక్షల్లో బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ నోటీసులను జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కేటీపీపీ అధికారులు ప్రవర్తించడంతో పాటు పంచాయతీ అందజేసిన నోటీసులకు కూడా సక్రమంగా స్పందించడం లేదని గ్రామ పంచాయతీ అధికారులు గుర్రుగా ఉన్నారు. ఇంతకు ముందు పాత పంచాయతీ పాలకవర్గాన్ని కూడా కేటీపీపీ అధికారులు ముప్పుతిప్పలు పెట్టారు. ప్లాంట్‌లో నాలుగు వందల మంది ఇంజినీర్లు నివాసాలు ఉంటే భవనాలకు, నిర్మాణంలో ఉన్న భవనాలకు సంబంధించిన అనుమతులు గ్రామపంచాయతీ నుంచి తీసుకోలేదు. స్పెషల్ ఆఫీసర్ల పాలన సమయంలో కూడా డీఎల్‌పీఆర్‌ఓ, డీపీఓలు కూడా కేటీపీపీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కేటీపీపీ నోటీసులను పట్టించుకోకపోతే కోర్టుకు పోవడానికి సిద్ధమని పంచాయతీ అధికారులు అంటున్నారు. భూనిర్వాసిత గ్రామాలను పట్టించుకోని కేటీపీపీ కేటీపీపీకి భూములు ఇచ్చిన బాధితులను, ఆ గ్రామాలను అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ప్లాంట్‌కు అవసమైన మొత్తం భూమిలో 90 శాతం చెల్పూరు శివారులో ఉంది. 2005 డిసెంబర్ 16న చెల్పూరు ఉన్నత పాఠశాలలో జరిగిన పర్యావరణ పరిరక్షణ ప్రజావేదిక సదస్సులో అప్పటి జెన్కో సీఎండీ అజయ్‌జైన్ ప్రజలకు ఇచ్చిన హమీలను కేటీపీపీ అధికారులు బుట్టదాఖలు చేశారు. బాధిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడానికి రూ.100కోట్లను ఖర్చు చేస్తామని ప్రకటించారు. కానీ మాటను నిలుపుకోవాలనే ప్రయత్నం అధికారులు చేయలేదు.ప్రాజెక్టు మూలంగా చెల్పూరు, దుబ్బపల్లి, కొంపల్లి ప్రజలు కాలుష్యం కాటుకు బలవుతునే ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ మాటేమిటి? ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అమ్మకం ద్వారా వచ్చిన లాభాలలో కొంత శాతాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ పేరిట ఖర్చు చేయవలసి ఉంది. గత సంవత్సరం రూ.2 కోట్ల రూపాయలను చెల్పూరు పరిధి గ్రామాలకు జెన్కో అధికారులు కేటాయించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పలుమార్లు జెన్కో అధికారులతో మాట్లాడి నిధులను మంజూరు చేయించారు. ఆ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలంగాణ రాష్టానికి గుండెకాయ కాబోతున్న చెల్పూరుకు కనీసం గ్రామపంచాయతీ భవనం కూడా లేకపోవడం శోచనీయం. నిధులు మంజూరు చేయాలని గత ఐదు సంవత్సరాల నుంచి కేటీపీపీ అధికారులని పంచాయతీ పాలకవర్గం వేడుకుంటూనే ఉంది. చెల్పూరు గ్రామానికి గోదావరి నదీజాలాలు అందిస్తామని, వైద్య, విద్య, రోడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పిస్తామని ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. బకాయిలు చెల్లించాలి కేటీపీపీ ప్రాజెక్ట్ నుంచి గ్రామపంచాయతీకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. చెల్పూరుతోపాటు శివారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్పస్ సోషల్ రెస్పాన్స్ ఫండ్‌ను ఖర్చు చేయాలి. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం చేపట్టాలి. ప్లాంట్‌లో నిర్మించే భవనాలకు పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాలి. - కొత్త పద్మవెంకటేశ్వర్లు, చెల్పూరు సర్పంచ్ ఇంటి పన్ను చెల్లిస్తున్నాం చెల్పూరు గ్రామ పంచాయతీకి కేటీపీపీలోని ఇంజినీర్ల కాల నీకి చెందిన ఇంటి పన్నును దాదాపు రూ.మూడు లక్షలను చెల్లిస్తున్నాం. కార్పస్ సోషల్ రెస్పాన్స్ ఫండ్‌పై జెన్కో ఉన్నతస్థాయి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. ప్లాంటులో నిర్మించే భవనాలను పన్నులు చెల్లించాలంటే అవసరమైన అధారాలు కావాలి. - వెంకటేశ్వర్రావు, కేటీపీపీ సీఈ -
బస్సులో భద్రంగా వెళ్లేలా చూస్తా
దేశం ‘సూపర్ పవర్’గా ఎదిగేకన్నా మహిళల భద్రతే ముఖ్యం: రాహుల్ గువాహటి: దేశాన్ని ‘సూపర్‌పవర్’గా నిలిపేకన్నా మహిళలు బస్సులో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. దేశాన్ని ప్రపంచ శక్తిగా మారుస్తామంటూ కొందరు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారని...కానీ అతివల భద్రతకే తాను ప్రాధాన్యత ఇస్తానని చెప్పుకొచ్చారు. బుధవారం అస్సాంలోని గువాహటిలో డాన్ బాస్కో యూనివర్సిటీ విద్యార్థులతో రాహుల్‌గాంధీ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులను ఉద్దేశించి ‘‘మీరు బస్సులో సురక్షితంగానే ప్రయాణిస్తున్నారా? వీధుల్లో ఇబ్బందిపడకుండా నడిచి వెళ్లగలుగుతున్నారా?’’ అని అడిగారు. బస్సులో వెళ్లేందుకు కకోలీ (స్త్రీలను గౌరవించడంపై రాహుల్‌ను ఓ ప్రశ్న అడిగిన విద్యార్థినిని ఉద్దేశించి) భయపడుతుంటే దేశం సూపర్‌పవర్‌గా ఎదిగేందుకు అవకాశమే లేదన్నారు. ‘బస్సులో ప్రయాణించేందుకు ఓ యువతి జం కుతుంటే మనల్ని మనం సూపర్ పవర్‌గా ఎలా పిలుచుకోగలం? దేశ జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు బస్సులో ప్రయాణించేటప్పుడు, రోడ్డుపై నడిచి వెళ్లేటప్పుడు సురక్షితంగా ఉంటున్నారా అని అడిగితే ప్రతి ఒక్కరూ లేదనే చెబుతారు. వారు సురక్షితంగా ఉన్నారనుకోవట్లేదు. మన రాజకీయ వ్యవస్థలో వారికి ప్రాతినిధ్యం లభించట్లేదు. దీనిపై యువకులంతా ఆలోచించాలి. ఇది వారికో సందేశం’’ అని రాహుల్ అన్నారు. తన 45 ఏళ్ల జీవితానుభవంలో మగవారికన్నా మహిళలే తెలివిగలవారని, సమర్థులని రాహుల్ పేర్కొన్నారు. కాగా, మరో కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతుండగా ఓ మహిళ ఆయనకు ముద్దుపెట్టడం విశేషం. -
పవర్పఫ్ గర్ల్స్
అనగనగా ముగ్గురు సోదరీమణులు... ఇంద్రధనుస్సును మైమరిపించే రంగులు విరజిమ్ముతూ ఆకాశంలో మెరుపు వేగంతో దూసుకుపోతూ... అన్యాయాలపై పోరాడి న్యాయాన్ని గెలిపిస్తూ సాహస విన్యాసాలతో అలరిస్తుంటారు. వాళ్లు ఎవరో ఇంకా గుర్తుకు రాలేదా... అరే వాళ్ళేనండీ ‘పవర్పఫ్ గర్ల్స్’. ఈ కార్టూన్ సీరియల్ భలేగా ఉంటుంది తెలుసా! ముగ్గురు అక్కాచెల్లెళ్లు... సూపర్ పవర్‌తో న్యాయం కోసం చేసే పోరాటంలో అందరినీ నవ్విస్తూ, బోలెడు సాహసాలతో ఈ సీరియల్ సాగుతుంటుంది. అసలు వాళ్లని గుర్తుచేసుకుంటే ముందుగా గుర్తుకొచ్చేవి వారి కళ్లే... పెద్దపెద్ద కళ్లతో ముగ్గురూ మూడు రంగుల్లో మెరిసిపోతుంటారు. బబుల్స్, బ్లోసమ్, బటర్‌కప్ పేర్లతో వీళ్లను పిలుస్తారు. బబుల్స్ బ్లూ, బ్లోసమ్ పింక్, బటర్‌కప్ గ్రీన్ వీరి సిగ్నేచర్ కలర్స్. ఈ రంగులతో తెరపైన సాహసాలతో కనువిందు చేస్తుంటారు. వీరి సృష్టికర్త క్రెగ్ మెక్క్యానెన్. ఆయన కార్టూన్ నెట్వర్క్కి రాసిన మొదటి సీరియల్ ఈ పవర్పఫ్ గర్ల్స్. ఈ సీరియల్ 1998 నవంబర్ 18న మొదటిసారి ప్రసారమైంది. ఈ సీరియల్లో యుటోనియం అనే శాస్త్రవేత్త ప్రయోగశాలలో అనుకోకుండా పవర్పఫ్ గర్ల్స్ సృష్టిస్తాడు. పరిపూర్ణమైన లిటిల్ గర్ల్స్ను సృష్టించడానికి చక్కెర, మసాలాదినుసులు, మంచి పదార్థాలు సరిపోతాయి. కాని యుటోనియం వాటితో పాటు ‘ఎక్స్’ అనే రసాయనాన్ని కూడా కలపడంతో ముగ్గురు సూపర్ పవర్పఫ్ గర్ల్స్ జన్మిస్తారు. ఈ ముగ్గురు నేరాలపై, మంత్రశక్తులపై పోరాడుతూ ప్రజలను కాపాడుతుంటారు. ప్రస్తుతం పవర్పఫ్ గర్ల్స్ ఆరవ సిరీస్ ప్రసారమవుతోంది. పవర్పఫ్ గర్ల్స్ అమెరికా టెలివిజన్ పరిశ్రమ ఇచ్చే ఎమ్మీ అవార్డులను కూడా గెలుచుకుంది. 2001 ఎమ్మీ అవార్డుల్లో పవర్పఫ్ గర్ల్స్ సీరియల్‌కు ఉత్తమ ఆర్ట్ డెరైక్టర్ విభాగంలో వాటిని యానిమేట్ చేసిన ఆర్ట్ డెరైక్టర్ డాన్ షాంక్కు, అలాగే టెలివిజన్ యానిమేటెడ్ సీరియల్ విభాగంలో ఉత్తమ నేపథ్య సంగీతానికి అవార్డులు లభించాయి. 2005 ఎమ్మీ అవార్డుల్లో నేపథ్య రూపకర్త ఫ్రెడరిక్ జె. గార్డ్నర్ బహుమతి గెలుచుకున్నారు.