తనిఖీలు చేస్తున్న పోలీసు అధికారులు, కారులో ఎస్సై రోహిత్ మాలిక్ ( ఇన్‌సెట్‌లో)
రాయగడ : మహిమ గల హనుమాన్ నాణెం పేరున మోసం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణానికి చెందిన టి.రంగారావు అనే వ్యక్తి దగ్గర డబ్బు తీసుకుని మోసగించిన కేసుకు సంబంధించి రాయగడకు చెంది, ప్రస్తుతం భువనేశ్వర్‌లో సెక్యూరిటీ విభాగంలో ఎస్సైగా పనిచేస్తున్న రోహిత్‌మాలిక్ సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాయగడ ఐఐసీ ఆర్.కె.పాత్రో, ఏఎస్సై అశోక్ కుమార్ సాహు నేతృత్వంలో గురువారం సాయంత్రం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం ఎస్సై ఆస్తులను కూడా సోదా చేసినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
1818వ సంవత్సరం నాటి హనుమాన్ రాగినాణెం అత్యంత మహిమ గలదని నమ్మబలికి విశాఖపట్టణానికి చెందిన టి.రంగారావు నుంచి ముడుసార్లు రూ.5,40,000 తీసుకున్నట్లు రాయగడ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసుకు సంబంధించి సూత్రధారి అజిత్‌బాత్రా పరారీలో ఉండగా ప్రధాన నిందితుడైన ఎస్సై రోహిత్ మాలిక్, రాయగడ ఇందిరానగర్‌కు చెందిన టి.ఉమాశంకర్, కల్యాణసింగుపురానికి చెందిన ఆర్.ప్రసాదరావు, ధవలేశ్వరబాగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితులను కోర్టులో హజరు పరిచారు. నిందితుల బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించడంతో వారిని సబ్‌జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment