
ప్యొంగ్‌యాంగ్ : వరుసగా అణ్వస్త్ర ప్రయోగాలు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర వ్యాఖ్యలు... ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ గురించి ఓ ఆసక్తికర కథనం. ఉత్తర కొరియా అధికార మీడియా 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ' కిమ్‌కు అతీత శక్తులు ఉన్నాయంటూ ఓ పెద్ద వ్యాసాన్నే ప్రచురించింది.
ఇటీవలె ఆయన 9 వేల అడుగుల ఎత్తున్న మౌంట్ పక్తూ పర్వతాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరునవ్వులు చిందిస్తున్న కిమ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంత దూరం ఎక్కినా.. కాస్త కూడా అలసి పోయినట్టు కనిపించక పోవడం వెనుక కిమ్‌కున్న సూపర్ పవర్స్ కారణమంట. మూడేళ్ల వయసులోనే ఆయన కారును నడిపారని, 9 సంవత్సరాల వయసులో సెయిలర్ గా పోటీ పడ్డారని ఆ కథనం పేర్కొంది.
అంతేకాదు వాతావరణ నియంత్రణా శక్తులు కూడా ఆయనకు ఉన్నాయని... ఎండ కావాలని కోరితే ఎండ ఉంటుందని, వర్షం కావాలనుకుంటే వర్షాలు కురుస్తాయని తెలిపింది. కిమ్ ఆధ్వర్యంలో ఉత్తర కొరియా శాస్త్రవేత్తలు ఓ సరికొత్త ఔషధాన్ని కూడా తయారు చేశారంట. ఎయిడ్స్, ఎబోలా సహా ఎన్నో రకాల క్యాన్సర్లు, నపుంసకత్వం, గుండె జబ్బులను నయం చేస్తుందని, యాంటీ రేడియో యాక్టివ్ గానూ పని చేస్తుందని అందులో వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment