విద్యార్థుల చలో రాజ్‌భవన్ భగ్నం
ఇంఫాల్, పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ
5 జిల్లాలకు ఇంటర్నెట్ సేవలు బంద్
విద్యాసంస్థలకు 2 రోజులు సెలవు
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న ఘర్షణలను నిరసిస్తూ విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. డీజీపీ, భద్రతా సలహాదారును తొలగించాలంటూ గవర్నర్ నివాసాన్ని, సచివాలయాన్ని ముట్టించేందుకు వారంతా మంగళవారం విఫలయత్నం చేశారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైకి రాళ్లు తదితరాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.
దాంతో లోయలోని ఐదు సమస్యాత్మక జిల్లాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రమంతటికీ వర్తిస్తుందని తొలుత పేర్కొన్నా, అనంతరం దాన్ని ఐదు జిల్లాలకే పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. రాజధాని ఇంఫాల్‌తో పాటు పరిసర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఎవరూ ఇళ్లనుంచి బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనలు మరింత విస్తరించకుండా చూసేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభు త్వం పేర్కొంది.
మరో 2,000 మందికి పైగా సీఆరీ్పఎఫ్ సిబ్బందిని కేంద్రం మణిపూర్‌కు తరలించింది. మణిపూర్‌లో వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల డ్రోన్, రాకెట్ దాడులు జరిగినట్టు వార్తలొచ్చా యి. అవి వాస్తవమేనని ఐజీ కె.జయంతసింగ్ తెలిపారు. డ్రోన్లతో పాటు అధునాతన రాకెట్ల తాలూకు విడి భాగాలను పౌర ఆవాస ప్రాంతాల్లో తాజాగా స్వా«దీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అంతకుమించి వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. తౌబల్ ప్రాంతంలో నిరసనకారుల నుంచి దూసుకొచి్చన తూటా ఓ పోలీసును గాయపరిచినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment