ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో రోజుకొక దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వస్తోంది. మహిళలపై అఘాయిత్యాల తర్వాత ఆ రాష్ట్ర పోలీసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న మరో అంశం మిస్సింగ్ కేసులు. ఇప్పటికైతే 30 మంది కనిపించడం లేదని కంప్లైట్లు రాగా 6000కు పైగా ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. తాజాగా మరో విద్యార్థిని మిస్సయిన కేసు సంచలనంగా మారింది.
మిస్సింగ్ కేసులు..
మణిపూర్ రాష్ట్రంలో మరణాలు, విధ్వంసం తర్వాత మిస్సింగ్ కేసుల సంఖ్య బాగా ఆందోళనకరంగా ఉంది. గడిచిన 3 నెలల్లో మొత్తం 30 మంది మిస్సవ్వగా సుమారు 6000 జీరో ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని తెలిపారు పోలీసులు. మే 6న సమరేంద్ర సింగ్(47) అనే జర్నలిస్టుతో పాటు అతని స్నేహితుడు కిరణ్ కుమార్ సింగ్ కూడా అల్లర్ల తర్వాత ఇంటికి రాలేదని వారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే వారి డీఎన్ఏ శాంపిల్స్ అయినా ఇప్పిస్తే అంత్యక్రియలు నిర్వహించుకుంటామని వేడుకుంటున్నారు.
ఆరోజు ఏం జరిగిందంటే..
అంతలోనే మరో విద్యార్థిని హిజామ్ లువాంబి (17) స్థానికంగా పరిస్థితి కాస్త మెరుగయ్యిందని భావించి స్నేహితుడితో కలిసి నీట్ క్లాస్ కు వెళ్లిందని అప్పటినుంచి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె తలిదండ్రులు. బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. చివరిగా హిజామ్ ఫోన్ క్వాట్కా దగ్గర స్విచాఫ్ చేసినట్లు.. ఆమె స్నేహితుడి ఫోన్ మాత్రం లమదాన్ వద్ద స్విచ్చాఫ్ అయ్యినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారన్నారు.
క్వాట్కాకు లమదాన్ కు మధ్య 18 కిలోమీటర్ల దూరముంది. పైగా వేర్వేరు జిల్లాలు. ఫోన్ చేస్తే హిజామ్ ఒకసారి లిఫ్ట్ చేసి భయం భయంగా మాట్లాడిందని.. నంబోల్ లోని ఖూపంలో ఉన్నట్లుగా చెప్పిందని ఆయన అన్నారు. పోలీసులు కూడా వారిద్దరూ నంభోల్ వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో ఉందని చెప్పారు.
హిజామ్ స్నేహితుడు హేమంజిత్ తండ్రి మాట్లాడుతూ ఆ ప్రాంతం గురించి పోలీసులకు తెలిసినా కూడా వారు అక్కడికి వెళ్లడానికి భయపడ్డారని చెప్పుకొచ్చారు. హేమంజిత్ ఫోన్ స్విచాఫ్ చేసిన తర్వాత ఇపుడు వేరే నెంబరుతో వాడకంలో ఉందన్నారు. ఇదిలా ఉండగా ఇంఫాల్ ఆసుపత్రులలో సుమారు 44 అనాధ శవాలకు ఆగస్టు 3న సామూహిక అంత్యక్రియలకు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: ఉడుపి వీడియోలు తమాషా కావచ్చు
Comments
Please login to add a commentAdd a comment