Haryana Nuh Violence Updates: Curfew Imposed In Haryana’s Nuh Following Violence - Sakshi
Sakshi News home page

Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు..

Published Tue, Aug 1 2023 3:13 PM | Last Updated on Tue, Aug 1 2023 4:09 PM

Haryana On After Alert Communal Clashes - Sakshi

చంఢీగర్‌: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్‌కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మరణించగా.. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. 

మంగళవారం కూడా ఘర్షణ వాతావరణం అలాగే ఉండటంతో కర్ఫ్యూ విధించినట్లు హెం మంత్రి అనిల్ విజ్ తెలిపారు. అల్లర్లను అరికట్టే విధంగా పోలీసు బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు. 20 మందిపై కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్ సోమవారం వెల్లడించారు. 

రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని సీఎం కోరారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. వదంతుల వ్యాప్తిని అడ్డుకునేందుకు బుధవారం అర్ధరాత్రి వరకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు. అలాగే ఈ రోజు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సామాజిక మాధ్యమంలో ఉంచిన ఒక వీడియో దీనంతటికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు.

హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది.

హర్యానాలో భగ్గుమన్న ఘర్షణలు.. శోభాయాత్రతో మొదలు.. రాళ్లు రువ్వుకుంటూ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement