హర్యానాలోని నూహ్ జిల్లాల్లో రెండు వర్గాల మధ్య రాజుకున్న మత ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. నాలుగు రోజులుగా హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ననూహ్ జిల్లాలో ప్రారంభమైన అల్లర్లు గురుగ్రామ్, దాని చుట్టు పక్కలా ప్రాంతాలకు సైతం వ్యాపించాయి.
సోమవారం నిర్వహించిన మతపరమైన ఊరిగేంపు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఓ మహిళా జడ్జీ ఆమె కూతురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నూజ్ జిల్లా అడిషనల్ చీఫ్ జస్టిస్ అంజలి జైన్.. తన మూడేళ్ల కూమార్తె, గన్‌మెన్ సియారమ్‌తో కలిసి కారులో మధ్యాహ్నం 1 గంటలకు మందుల కోసం మెడికల్ కాలేజీకి వెళ్లారు. 2 గంటలకు వైద్య కళాశాల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో సుమారు 100-150 మంది అల్లరిమూకలు ఆమె కారును అడ్డుకున్నారు.
చదవండి: 100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం
కారుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కారు వెనక అద్దాలు పగిలిపోయాయి. అనంతరం ఆ ప్రాంతంలో కాల్పులు జరుపుతూ కారుకు నిప్పంటించారు. కారులో జడ్జితో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. వీరంతా రోడ్డుపైనే కారు వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. నూహ్‌లోని పాత బస్టాండ్‌లోని వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. తరువాత కొందరు న్యాయవాదులు వచ్చి వీరిని రక్షించారు. మరుసటి రోజు కారును చూసేందుకు వెళ్లగా దుండగులు దానిని తగలబెట్టారు.
దీనిపై కోర్టు సిబ్బంది అయిన టెక్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై మంగళవారం సిటీ నూహ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణలు గత రెండు రోజులుగా గురుగ్రామ్‌కు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం నూహ్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్‌పై ఆంక్షలు సైతం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు.
చదవండి: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు.. సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment