narrowly escape
-
హర్యానా ఘర్షణలు.. ప్రాణాలతో బయటపడ్డ మహిళా జడ్జి, మూడేళ్ల చిన్నారి
హర్యానాలోని నూహ్ జిల్లాల్లో రెండు వర్గాల మధ్య రాజుకున్న మత ఘర్షణలు ఇంకా చల్లారడం లేదు. నాలుగు రోజులుగా హింసాత్మక పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ననూహ్ జిల్లాలో ప్రారంభమైన అల్లర్లు గురుగ్రామ్, దాని చుట్టు పక్కలా ప్రాంతాలకు సైతం వ్యాపించాయి. సోమవారం నిర్వహించిన మతపరమైన ఊరిగేంపు సందర్భంగా జరిగిన ఘర్షణలో ఓ మహిళా జడ్జీ ఆమె కూతురు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నూజ్ జిల్లా అడిషనల్ చీఫ్ జస్టిస్ అంజలి జైన్.. తన మూడేళ్ల కూమార్తె, గన్‌మెన్ సియారమ్తో కలిసి కారులో మధ్యాహ్నం 1 గంటలకు మందుల కోసం మెడికల్ కాలేజీకి వెళ్లారు. 2 గంటలకు వైద్య కళాశాల నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో సుమారు 100-150 మంది అల్లరిమూకలు ఆమె కారును అడ్డుకున్నారు. చదవండి: 100 కుటుంబాల్లో 15 మందే మిగిలాం.. కాపాడండి’.. వలస కార్మికుడి కన్నీటి పర్యంతం కారుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో కారు వెనక అద్దాలు పగిలిపోయాయి. అనంతరం ఆ ప్రాంతంలో కాల్పులు జరుపుతూ కారుకు నిప్పంటించారు. కారులో జడ్జితో పాటు మొత్తం నలుగురు ఉన్నారు. వీరంతా రోడ్డుపైనే కారు వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. నూహ్‌లోని పాత బస్టాండ్‌లోని వర్క్‌షాప్‌లో దాక్కున్నారు. తరువాత కొందరు న్యాయవాదులు వచ్చి వీరిని రక్షించారు. మరుసటి రోజు కారును చూసేందుకు వెళ్లగా దుండగులు దానిని తగలబెట్టారు. దీనిపై కోర్టు సిబ్బంది అయిన టెక్ చంద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై మంగళవారం సిటీ నూహ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణలు గత రెండు రోజులుగా గురుగ్రామ్‌కు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఆరుగురు మరణించారు. ప్రస్తుతం నూహ్‌లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇంటర్నెట్పై ఆంక్షలు సైతం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పరిస్థితులు పూర్తిస్థాయిలో అదుపులోకి రాలేదు. చదవండి: జ్ఞానవాపి మసీదు కేసులో కీలక తీర్పు.. సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -
పక్కా ప్లాన్‌తో కిడ్నాప్..త్రుటిలో తప్పించుకున్న మహిళ: వీడియో వైరల్
ఒక మహిళను కొందరూ దుండగులు పక్కాప్లాన్‌తో కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఐతే సదరు మహిళ అనుహ్యంగా ఆ ఘటన నుంచి త్రుటిలో బయటపడగలిగింది. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్లో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...జిమ్ సెంటర్ నుంచి బయటకొచ్చిన ఒక మహిళ తన కారులో కూర్చొని ఉండగా... ఇద్దరు వ్యక్తులు ఆగి ఉన్న ఆమె కారు లోకి దూసుకుంటూ వచ్చి కారు తలుపులు మూసేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు ఆమెని కిడ్నాప్చేసేందుకు యత్నించారు. ఐతే ఆమె ప్రతిఘటిస్తూ...అరవడంతో భయంతో ఆ వ్యక్తులు కొద్ది వ్యవధిలోనే కారు నుంచి బయటకొచ్చేశారు. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీఫుటేజ్‌ని పరిశీలించి..ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. #WATCH | Caught On Camera: Miscreants tried to kidnap a woman in Haryana's Yamuna Nagar city yesterday After doing gym, the woman sat in her car. 4 people came & entered her car & tried to kidnap her. One accused has been caught. Probe underway: DSP Kamaldeep Singh, Yamuna Nagar pic.twitter.com/XvuN22yfWy — ANI (@ANI) January 1, 2023 (చదవండి: ఒకేఒక్క వ్యక్తి రోడ్డుపై సృష్టించిన బీభత్సం చూస్తే..వామ్మో! అని నోరెళ్లబెడతారు) -
తప్పిన భారీ విమాన ప్రమాదం
సాక్షి బెంగళూరు: బెంగళూరు గగనతలంలో భారీ విమాన ప్రమాదం తప్పింది. బెంగళూరు గగనతలంలో రెండు ఇండిగో ఏ–320 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు బెంగళూరు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లో కలిపి 330 మంది ప్రయాణికులున్నారు. ఈ నెల 10న కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే 6ఈ–779 విమానం, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే 6ఈ–6505 విమానం బెంగళూరు నగర గగనతలంలో ఒకదాని కొకటి దగ్గరగా రావడాన్ని గుర్తించిన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అధికారులు రెండు విమానాల పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. -
గండం గడిచింది..తృటిలో తప్పిన ప్రమాదం
-
మరో ప్రమాదంలో కమల్‌హాసన్
చెన్నై: ప్రముఖ నటుడు, చిత్రనిర్మాత కమల్ హాసన్ భారీ అగ్నిప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఇటీవల ఓ ప్రమాదంలో కాలువిరిగి సంవత్సరం పాటు షూటింగ్ దూరంగా ఉన్న ఈ విలక్షణనటుడు మరోసారి ప్రమాదంలో చిక్కుకున్నారు. కానీ కమల్ సహా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం రాత్రి ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం సంభవించిందని కమల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లలో కమల్ ఇలా వివరించారు. ఎవరూ గాయపడలేదు.. నేను మూడవ అంతస్తు నుంచి క్రిందికి దూకి బయటపడ్డాను. నేను సురక్షితంగా ఉన్నాను. నా సిబ్బందికి ధన్యవాదాలు. నా ఊపిరితిత్తులు పూర్తిగా పొగతో నిండిపోయాయంటూ శనివారం తెల్లవారుఝామున ట్వీట్ చేశారు. అలాగే ప్రేమను, ఆందోళనను వ్యక్తం చేసిన అభిమాలను ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇటీవల కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ కన్నుమూశారు. ఈ సంతాపం దినాల్లో కమల్ ఉన్నారు. ప్రస్తుతం మల్టీ బైలింగ్వల్ మూవీ శభాష్ నాయుడు చిత్రం పనులను త్వరలో మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. Thanks to my staff. Escaped a fire at my house. Lungs full of smoke, I climbed down from the third floor. I am safe No one hurt . Goodnight — Kamal Haasan (@ikamalhaasan) April 7, 2017 Thanks for all the love and concern. Now off to sleep. Good night indeed:) — Kamal Haasan (@ikamalhaasan) April 7, 2017