మరో ప్రమాదంలో కమల్‌హాసన్‌ | Kamal Haasan narrowly escapes fire tragedy | Sakshi
Sakshi News home page

మరో ప్రమాదంలో కమల్‌హాసన్‌

Apr 8 2017 8:15 AM | Updated on Oct 2 2018 2:30 PM

మరో ప్రమాదంలో కమల్‌హాసన్‌ - Sakshi

మరో ప్రమాదంలో కమల్‌హాసన్‌

ప్రముఖ నటుడు, చిత్రనిర్మాత కమల్ హాసన్ భారీ అగ్నిప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.

చెన్నై: ప్రముఖ నటుడు, చిత్రనిర్మాత  కమల్ హాసన్  భారీ అగ్నిప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.  ఇటీవల  ఓ ప్రమాదంలో కాలువిరిగి  సంవత్సరం పాటు షూటింగ్‌ దూరంగా ఉన్న  ఈ విలక్షణనటుడు మరోసారి ప్రమాదంలో చిక్కుకున్నారు. కానీ కమల్‌ సహా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
శుక్రవారం రాత్రి ఆయన  నివాసంలో  అగ్ని ప్రమాదం సంభవించిందని   కమల్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.  అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదని  ట్వీట్‌ చేశారు.  వరుస ట్వీట్లలో  కమల్‌ ఇలా వివరించారు.  
ఎవరూ గాయపడలేదు.. నేను మూడవ అంతస్తు నుంచి క్రిందికి దూకి బయటపడ్డాను.  నేను సురక్షితంగా ఉన్నాను. నా సిబ్బందికి ధన్యవాదాలు. నా ఊపిరితిత్తులు పూర్తిగా పొగతో  నిండిపోయాయంటూ శనివారం తెల్లవారుఝామున ట్వీట్‌​  చేశారు. అలాగే ప్రేమను, ఆందోళనను  వ్యక్తం చేసిన అభిమాలను ధన్యవాదాలు తెలిపారు.

కాగా  ఇటీవల కమల్‌ హాసన్‌  సోదరుడు చంద్రహాసన్‌  కన్నుమూశారు.  ఈ సంతాపం దినాల్లో కమల్‌ ఉన్నారు. ప్రస్తుతం మల్టీ బైలింగ్వల్‌ మూవీ శభాష్‌ నాయుడు చిత్రం పనులను త్వరలో మొదలు పెట్టేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement