ఆస్పత్రిలో కమల్ | Kamal Haasan fractures leg, hospitalised | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో కమల్

Published Fri, Jul 15 2016 12:25 AM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

ఆస్పత్రిలో కమల్ - Sakshi

ఆస్పత్రిలో కమల్

కాలికి గాయం 
వారం తరువాత డిశ్చార్జ్

అరవై ఏళ్ల వయసులోనూ యువకుడిలా చలాకీగా కనిపిస్తారు కమల్‌హాసన్. సాధారణంగా ఆరుపదుల వయసున్న వ్యక్తుల నడకలో కాస్త వేగం తగ్గుతుంది. కానీ, కమల్ చకచకా అడుగులు వేస్తుంటారు. ఫిట్ పర్సనాలిటీ. అంతేనా.. యువ హీరోలతో పోటీపడుతూ చకచకా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం త్రిభాషా చిత్రం ‘శభాష్ నాయుడు’లో నటిస్తున్నారాయన.
 
గత నెలాఖరున అమెరికాలో భారీ షెడ్యూల్ ముగించుకుని ఇండియా తిరిగొచ్చిన ఈ విలక్షణ నటుడు చెన్నైలో నిర్మాణానంతర కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ పనుల్లో ఉండగానే గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో చెన్నైలోని తన ఇంట్లో మెట్లు దిగుతూ జారి పడ్డారు కమల్. కుడికాలికి, వెన్నెముకకు దెబ్బతగలడంతో గ్రీన్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
 
కమల్ కుడి కాలికి  ఫ్రాక్చర్ కావడంతో డాక్టర్లు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతమైంది. మరో వారం తరువాత కమల్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. కమల్ ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement