ఇంకా రాతియుగంలోనే ఉన్నామా?
కమల్ హాసన్
ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినా మహిళలను చూసే దృష్టి కోణంలో ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికీ పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా కడుపులో ఉన్నది ఆడపిల్ల అనేది తెలియగానే చంపేస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది. దీని గురించి పోరాడటానికి లోకనాయకుడు కమల్‌హాసన్ ముందుకొచ్చారు. ‘ఫైట్ ఎగెనైస్ట్ ఫీటిసైడ్’ అనే ప్రచార చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు. ‘‘భ్రూణహత్యలకు వ్యతిరేకంగా పోరాడటమంటే మనం మన త ల్లి, చెల్లి గురించి పోరాటం చేస్తున్నట్లే. ఇలాంటి దారుణాల గురించి తెలుస్తుంటే, మనం ఇంకా రాతియుగంలోనే ఉన్నామా అనిపిస్తోంది. ఆడ శిశువులను ఈ భూమ్మీదకు రానివ్వకుండా చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఈ ప్రచార చిత్రం ద్వారా చెప్పాలన్నదే మా ఉద్దేశం’’ అని కమల్ హాసన్ చెప్పారు.