
సంఘర్షణల నాడు గస్తీ కాస్తున్న పోలీసలు (పాత చిత్రం)
సాక్షి, కోల్‌కతా : ‘నా కొడుకు చనిపోయాడు.. అలాగని మరో వ్యక్తి కొడుకు చనిపోవాలని నేను కోరుకోను. ఇంకోసారి ఇలాంటి రక్తపాతం జరిగితే నేను ఊరు విడిచి వెళ్లిపోతా’ . ఇది పశ్చిమ బెంగాల్‌లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన మారణకాండలో కుమారుడిని పోగొట్టుకున్న ఓ తండ్రి ఆవేదన. అసన్సోల్ పట్టణంలోని మసీదు ఇమామ్ మౌలానా ఇందాదుల్ రషీదీ కుమారుడు షిబ్‌తుల్లా రషీదీ గత ఆదివారం చోటుచేసుకున్న మత ఘర్షణల్లో మరణించాడు.
తాను అసన్సోల్‌లో శాంతిని మాత్రమే కోరుకుంటున్నానని, అందరూ శాంతంగా ఉండాలని గురువారం కొడుకు అంత్యక్రియలకు వచ్చిన వారిని ఆయన కోరారు. అధికార పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. ఇందాదుల్ వ్యాఖ్యలతో అక్కడ శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన కుమారుడు షిబ్‌తుల్లా మరణానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే మత ఘర్షణలు జరిగాయని, పోలీసులు సరైన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదని విశ్వహిందూ పరిషత్ నాయకులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment