Asansol town
-
బతికుండగానే మీ చర్మం ఒలిచేస్తాను
-
‘కూర్చుంటావా లేదా కాళ్లు విరగ్గొట్టాలా..?’
కోల్‌కతా : వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మరోసారి నోరు జారారు. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాబుల్ ‘మీ కాళ్లు విరగొట్టాలా’ అంటూ అక్కడికి వచ్చిన వారిని బెదిరించాడు. వివరాల ప్రకారం.. అసన్సోల్లో దివ్యాంగులకు వీల్ చైర్లు, ఇతర పరికారాలు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబుల్ సుప్రీయో అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో కార్యక్రమానికి హాజరైన ఓ వ్యక్తి బయటకు వెళ్లాలని భావించాడు. కానీ సభ నిర్వాహకుడు అతన్ని అడ్డగించి కూర్చోవాల్సిందిగా కోరాడు. దీన్ని గమనించిన బాబుల్ తన ప్రసంగాన్ని ఆపి.. సదరు వ్యక్తితో ‘నీ సమస్య ఏంటీ.. ఎక్కడికి వెళ్తున్నావ్.. కూర్చో, లేదంటే నీ కాళ్లు విరగొట్టి స్ట్రెచర్ మీద పడుకోబెడతాను. నేను ఒక్క మాట చెబితే సెక్యూరిటీ వాళ్లు నీకు తగిన శాస్తి చేస్తారం’టూ సదరు దివ్యాంగున్ని హెచ్చరించారు. దివ్యాంగులు కార్యక్రమానికి వచ్చిన మంత్రి వారినే ఇలా బెదిరించడంతో అక్కడున్న వారు విస్తు పోయారు. అయితే బాబుల్ ఇలా దురుసుగా మాట్లాడటం ఇదే ప్రథమం కాదు. ఈ ఏడాది మార్చిలో శ్రీరామ నవమి ఏర్పాట్లలో భాగంగా అల్లర్లు చెలరేగాయి. అసన్సోలో కూడా ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ పర్యటించిన బాబుల్ సుప్రియో చుట్టూ జనాలు గుమికూడారు. దాంతో సుప్రియో వారి మీద చిరాకు పడుతూ ‘నేను తల్చుకుంటే బతికుండగానే మీ చర్మం ఒలిచేస్తాను’ అంటూ వారిపై మండి పడ్డారు -
ఇలా చేస్తే ఊరు విడిచి వెళ్లిపోతా...
సాక్షి, కోల్‌కతా : ‘నా కొడుకు చనిపోయాడు.. అలాగని మరో వ్యక్తి కొడుకు చనిపోవాలని నేను కోరుకోను. ఇంకోసారి ఇలాంటి రక్తపాతం జరిగితే నేను ఊరు విడిచి వెళ్లిపోతా’ . ఇది పశ్చిమ బెంగాల్లో శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా జరిగిన మారణకాండలో కుమారుడిని పోగొట్టుకున్న ఓ తండ్రి ఆవేదన. అసన్సోల్ పట్టణంలోని మసీదు ఇమామ్ మౌలానా ఇందాదుల్ రషీదీ కుమారుడు షిబ్‌తుల్లా రషీదీ గత ఆదివారం చోటుచేసుకున్న మత ఘర్షణల్లో మరణించాడు. తాను అసన్సోల్లో శాంతిని మాత్రమే కోరుకుంటున్నానని, అందరూ శాంతంగా ఉండాలని గురువారం కొడుకు అంత్యక్రియలకు వచ్చిన వారిని ఆయన కోరారు. అధికార పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. ఇందాదుల్ వ్యాఖ్యలతో అక్కడ శాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆయన కుమారుడు షిబ్‌తుల్లా మరణానికి గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. పోలీసులు నిర్లక్ష్యం కారణంగానే మత ఘర్షణలు జరిగాయని, పోలీసులు సరైన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదని విశ్వహిందూ పరిషత్ నాయకులు అభిప్రాయపడ్డారు. -
మావోయిస్ట్ నేత కిషన్ జీ వ్యక్తిగత వైద్యుడు అరెస్ట్
మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ వ్యక్తిగత వైద్యుడు సమీర్ బిశ్వాస్‌ను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. బుర్ద్వాన్ జిల్లా అసన్సోల్ పట్టణంలోని సమీర్ని అతడి సోదరుని నివాసంలో నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. సమీర్ గత మూడు ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు. మావోయిస్టు అగ్రనేతలు కిషన్ జీతోపాటు పలువురికి సమీర్ తరచు వైద్య సేవలు అందించేవాడని తమ వద్ద పూర్తి సమాచారం ఉందని తెలిపారు. మావోయిస్టు నేతల కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సమీర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. అటు కేంద్రప్రభుత్వానికి ఇటు బెంగాల్‌లోని మమత ప్రభుత్వాని కొరకరాని కొయ్యలా మావోయిస్టు అగ్రనేత కిషన్ తయారయ్యారు. ఈ నేపథ్యంలో 2011, నవంబర్‌లో కిషన్ జీని పశ్చిమ మిడ్నాపూర్‌లోని బురిశోల్ అడువుల్లో కేంద్ర బలగాలు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.