వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బీజేపీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో మరోసారి నోరు జారారు. దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన బాబుల్ ‘మీ కాళ్లు విరగొట్టాలా’ అంటూ అక్కడికి వచ్చిన వారిని బెదిరించాడు. వివరాల ప్రకారం.. అసన్సోల్‌లో దివ్యాంగులకు వీల్ చైర్లు, ఇతర పరికారాలు అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాబుల్ సుప్రీయో అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నారు.