పశ్చిమ బెంగాల్‌లో మతఘర్షణలు | Communal violence in West Bengal | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌లో మతఘర్షణలు

Published Wed, Jul 5 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

Communal violence in West Bengal

కోల్‌కతా:పశ్చిమ బెంగాల్‌లో మతఘర్షణలుఓ మతానికి చెందిన పుణ్యక్షేత్రాన్ని అగౌరవపరుస్తూ అభ్యంతరకరంగా ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ వల్ల సోమవారం గొడవలు మొదలయ్యాయి. శాంతి భద్రతల లకోసం రాష్ట్ర పోలీసులకు తోడుగా 400 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లను ప్రభుత్వం మోహరించింది. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. బదూరియా ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు.

గవర్నర్‌ బెదిరించారు.. మమత: మతఘర్షణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి తనను బెదిరించారనీ, అవమానించారని మమత సంచలన ఆరోపణలు చేశారు. ‘ఆయన నన్ను ఫోన్‌లో బెదింరించారు. బీజేపీ తాలూకా స్థాయి నాయకుడిలా ఆయన మాట్లాడిన మాటలు నన్ను అవమానపరిచాయి’ అని విలేకరులతో అన్నారు. ‘ఆయన గవర్నర్‌ పదవికి నామినేట్‌ అయినవారని గుర్తుంచుకోవాలి. ఎవరి దయతోనో నేనిక్కడ లేను. ఆయన నాతో మాట్లాడిన తీరు చూసి ఒక్కసారిగా సీఎం పదవిని వదిలేయాలని అనిపించింది’ అని పేర్కొన్నారు. ‘కేంద్రంలోని అధికార పార్టీకి ఒక ఎజెండా ఉంది. వారు మనుషులను చంపడానికి గోరక్ష బృందాలను ఏర్పరిచారు. అల్లర్లు సృష్టించడానికే విద్వేష బృందం ఏర్పాటైంది. ‘హిందూ సంహతి’ పేరుతో అల్లర్లు చెలరేగుతున్నాయి’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement