missed call
-
Gold Prices: మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మొబైల్‌కే బంగారం ధరలు!
భారతీయులకు బంగారం అంటే ఎంతో మక్కువో తెలిసిందే. దేశవ్యాప్తంగా ప్రతిరోజు అనేక మంది పసిడిని కొనుగోలు చేస్తుంటారు. ఇందుకోసం ఏ రోజు బంగారం ధర తగ్గుతుందో అని ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏ రోజు బంగారం ధర ఎంతుందో తెలుసుకునేందుకు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) సులువైన అవకాశం కల్పించింది. మిస్డ్ కాల్ ఇస్తే చాలు పసిడి కొనుగోలుదారులు ఏ రోజు బంగారం ధర ఎంత ఉందో తెలుసుకునేందుకు ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్‌కు సంబంధించిన 8955664433 మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. ఆ రోజు పసిడి ధరలు ఎస్సెమ్మెస్ రూపంలో వెంటనే మొబైల్‌కు వచ్చేస్తాయి. అలాగే ఐబీజేఏ అధికారిక వెబ్సైట్ కూడా సందర్శించవచ్చు. ఐబీజేఏ గురించి.. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (IBJA) అనేది దేశంలోని పసిడి వ్యాపారుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన సంస్థ. 1919లో దీన్ని ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని బులియన్, జ్యువెలరీ అసోసియేషన్లకు దీన్ని అపెక్స్ అసోసియేషన్‌గా పరిగణిస్తారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు అప్పటికి ఉన్న బంగారం ధరలను ప్రచురిస్తుంది. బంగారం ధరలు Gold Rates today: ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ ప్రకారం.. దేశంలో ఈరోజు (అక్టోబర్ 25) సాయంత్రం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 60,560 ఉండగా 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.59,110 ఉంది. వీటికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. -
హాయ్ అంటూ దగ్గరయ్యాడు.. నమ్మకంతో ఆమె వీడియో కాల్స్ చేసి..
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అపరిచిత వ్యక్తితో పరిచయం కారణంగా ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నారు. వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన వివాహిత సౌజన్యకు కొద్దిరోజుల క్రితం తిరుపతి అనే వ్యక్తి నుంచి మిస్ కాల్ వచ్చింది. ఈ క్రమంలో ఆమె తిరిగి కాల్ చేయడంతో అనుకోకుండా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే ఈ పరిచయం కాస్తా చనువుగా మారింది. దీంతో, తిరపతి.. సౌజన్యకు తరచుగా కాల్ చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మాయ మాటలు చెప్పి క్లోజ్ అయ్యాక.. వీడియో కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అయితే, వీడియో చేసిన తర్వాత థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ద్వారా సౌజన్య ఫోన్లోని డేటాను తిరపతి తస్కరించాడు. అనంతరం, వారిద్దరూ చనువుగా మాట్లాడుకున్న వీడియోలను తన భర్తకు, కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో, ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. ఇక, ఈ విషయం తన భర్తకు తెలియడంతో సౌజన్య తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో, నీటి సంపులో దూకి సౌజన్య ఆత్మహత్యకు పాల్పడింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సౌజన్య మృతిచెందింది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. ఇక, సౌజన్య ఓ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్నారు. ఇది కూడా చదవండి: విశాఖలో రియల్టర్, భార్య కిడ్నాప్.. గంటల్లోనే చేధించిన పోలీసులు -
రాష్ట్రపతి ముర్ముకు మిస్డ్‌కాల్
న్యూఢిల్లీ: సెల్‌ఫోన్‌ను వాడే అలవాటు అంతగా లేని ద్రౌపదీ ముర్ము.. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఫోన్‌కాల్‌ను మిస్సయ్యారు..! ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పిలుపు అది. రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని ఆమెను కోరేందుకు స్వయంగా ప్రధాని మోదీయే చేసిన కాల్ అది..! ‘ద్రౌపదీ ముర్ము: ఫ్రం ట్రైబల్ హింటర్ ల్యాండ్స్ టూ రైజినా హిల్’ పేరుతో జర్నలిస్ట్ కస్తూరి రే రాసిన తాజా పుస్తకంలో 2022 జూన్ 21న జరిగిన ఘటన సహా పలు వివరాలున్నాయి. పలు ఇంటర్వ్యూలు, విశ్లేషణల ఆధారంగా ముర్ము జీవితంలో ఘటనల క్రమాన్ని స్కూల్, కాలేజీ రోజులవరకు టీచర్ నుంచి సామాజిక కార్యకర్తగా, అటునుంచి కౌన్సిలర్..మంత్రి..గవర్నర్..దేశ మొట్టమొదటి గిరిజన మహిళా రాష్ట్రపతి వరకు సాగిన ఆమె ప్రస్థానాన్ని అందులో ప్రస్తావించారు. గతేడాది జూన్ 21న ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 275 కిలోమీటర్ల దూరంలోని తన మారుమూల స్వగ్రామం ఉపర్‌బేడలో ముర్ము ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము అని తెలిసినా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. దీని కోసం అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయమది. అయితే, ముర్ము స్వగ్రామంలో కరెంటు కట్ అమలవుతోంది. బయట జరుగుతున్న ఇలాంటి విషయాలేవీ ఆమెకు తెలియవు. మొబైల్‌ను ఎక్కువగా వాడే అలవాటు లేని ముర్ము, దాన్ని ఎక్కడో ఉంచారు. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్ సహా ప్రముఖ వ్యక్తుల నుంచి వచ్చిన అనేక ఫోన్‌కాల్స్‌ను ఆమె రిసీవ్ చేసుకోలేకపోయారు. చివరికి పీఎంఓ అధికారులు ముర్ము మాజీ ఓఎస్డీ, రాయ్రంగ్పూర్లో ఉంటున్న బికాశ్ చంద్ర మహంతకు ఫోన్ చేశారు. ఆయన ఆగమేఘాల మీద తన మెడికల్ షాపును మూసేసి ముర్ము ఇంటికి చేరుకున్నారు. ఫోన్ ఆమె చేతికందించారు. దీంతో ప్రధాని మోదీతో ఆమె నేరుగా మాట్లాడగలిగారు. ఆ తర్వాతే ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన వెలువడింది. -
వాట్సాప్ కి ఆ తరహా కాల్స్ లిఫ్ట్ చేస్తే ఇక అంతే సంగతి
-
ఇంటింటా ప్రజాదరణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందేనని ప్రతి ఒక్కరి నోటా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లు.. సీఎం వైఎస్ జగన్ ప్రతినిధులుగా గురువారం కూడా ఇంటింటికీ వెళ్లారు. ప్రస్తుత ప్రభుత్వంలో గత నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధితో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేస్తూ వివరించారు. ఈ నాలుగు సంవత్సరాల్లో తమకు ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలతో పంచుకున్నారు. కులం, మతం, వర్గం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తుండటం ఒక్క సీఎం జగన్‌కే సాధ్యమైందని ఊరూరా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు స్పష్టీకరిస్తున్నారు. మరోసారి వైఎస్ జగన్ సీఎం అయితేనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 19 నాటికి 70 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. -
ఊరూరా సందడి.. ప్రతి ఇంటా వైఎస్ జగన్ మాట
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. సీఎం జగన్ ప్రతినిధులుగా వచ్చిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వినర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ప్రజలు చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారు. పలు చోట్ల ఎదురువెళ్లి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల వద్దకే ఎమ్మెల్యే రావడం అంటే అది కేవలం ఒక్క సీఎం జగనన్న వల్లే సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లలో ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలకు వివరిస్తుండటం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అందరి బాగు కోరుకుంటున్న జగనన్ననే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 7వ తేదీన ’జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో మెగా పీపుల్స్ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్ 18 నాటికి ఏకంగా 63 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు తెలిపారని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యలు తెలిపారు. బుధవారం వారు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీలను చూడకుండా అర్హులందరికీ లబ్ధి కలిగిస్తోందన్నారు. మలి దశ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అందించిన సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దకే వెళ్లి వివరిస్తామని చెప్పారు. అపూర్వ ప్రజా స్పందన చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేపోతున్నాయన్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేస్తే.. సీఎం జగన్ సులభతర పరిపాలన, సచివాలయం ద్వారా నేరుగా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ఈ నెల 29 వరకు ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన, సీఎం వైఎస్ జగన్ పాలన పట్ల విశేష సానుకూలత నేపథ్యంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ఈ నెల (ఏప్రిల్) 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మెగా సర్వే ఫలితాలను కూడా అదే రోజున ప్రకటించనున్నారు. -
మిస్టరీగా 11 ఏళ్ల చిన్నారి హత్య..చిక్కుముడి విప్పిన మిస్డ్ కాల్
కిడ్నాప్‌కి గురైన 11 ఏళ్ల చిన్నారి హత్య తీవ్ర కలకలం రేపింది. అదికూడా ఒక పట్టాన అంతు చిక్కని ఈకేసు చిక్కుముడిని ఒక మిస్డ్‌కాల్ చేధించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో 11 ఏళ్ల చిన్నారి ఫిబ్రవరి 9న పాఠశాలకు వెళ్లి కనిపించకుండాపోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా..చిన్నారి తల్లికి కూతురు కిడ్నాప్ అయ్యిన రోజే ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు మొబైల్‌నెంబర్‌ను ట్రాక్ చేసి పంజాబ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఫిబ్రవరి 21న నిందితుడు రోహిత్ అలియాస్ వినోద్ అనే వ్యక్తిని అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడమే గాక బాలికను హత్య చేసి శవాన్ని ఘెవ్రా మోర్ సమీపంలో పడేసినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఐతే ఆ చిన్నారి నలుగురు అన్నదమ్ములకు ఒక్కతే చెల్లి అని తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నట్లు బాధితురాలి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ఈ హత్యకు దారితీసిన కారణాలు గురించి ఇంకా తెలియాల్సి ఉంది. (చదవండి: 70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ!) -
మిస్డ్ కాల్స్ ఇచ్చి రూ.50 లక్షలు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
మొబైల్‌కు వచ్చిన ఓటిపీ చెప్పమని అడిగి బ్యాంకు ఖాతాల నుంచి రూ.లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల గురించి విన్నాం. కానీ ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో ఆన్లైన్ నేరగాళ్లు ఓటీపీ అవసరం లేకుండానే రూ.50 లక్షలు కొల్లగొట్టారు. కేవలం ఫోన్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చి బ్యాంకు ఖాతా నుంచి పలుమార్లు నగదు బదిలీ చేశారు. దీంతో బాధితుడు కంగుతిన్నాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అక్టోబర్ 19న ఢిల్లీలోని ఓ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ ఎండీకి కొత్త నంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. అదే నంబర్ నుంచి పదే పదే కాల్ వస్తోంది. కొన్ని సార్లు ఆయన కాల్ లిఫ్ట్ చేసినా అవతలి వ్యక్తి మాట్లాడలేదు. అయితే కాసేపటికే ఆయన బ్యాంకు ఖాతాలో రూ.50 లక్షలు మాయమయ్యాయి. రూ.12లక్షలు ఒకసారి, రూ.10 లక్షలు ఒకసారి, రూ.4.6 లక్షలు ఒకసారి.. ఇలా పలుమార్లు ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్ ద్వారా అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు ఇతర అకౌంట్లలలోకి వెళ్లిపోయాయి. దీంతో అతడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 'సిమ్ స్వాపింగ్' టెక్నిక్‌ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. నకిలీ సిమ్ కార్డు సృష్టించి దానితోనే లావాదేవీలు జరిపి ఉంటారని పేర్కొన్నారు. బహూశా జార్ఖండ్ జంతారాకు చెందిన నేరగాళ్లే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. నగదు బదిలీ అయిన అకౌంట్లు కూడా వాళ్లవి కాదని పేర్కొన్నారు. -
మిస్డ్ కాల్ వచ్చింది..రూ.46లక్షలు పోయాయి
ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా? ఇప్పుడు దీని గురించి సైబర్ నేరస్తులు ఆలోచిస్తున్నారు. ఓవైపు కరోనా, కొత్తగా పుట్టుకొస్తున్న టెక్నాలజీలు.వెరసీ సైబర్ నేరస్తులు డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అవుతుంది. కోవిడ్ కారణంగా సైంబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ఫోన్ కాల్స్, ఓటీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నా.. కొంతమంది ఆ సూచనల్ని లైట్ తీసుకుంటున్నారు. దీన్ని అదునుగా చేసుకొని కేటుగాళ్లు మిస్డ్ కాల్ ఇచ్చి బ్యాంక్ అకౌంట్లలో మనీనీ కాజేస్తున్నారు. అహ్మాదాబాద్ శాటిలైట్ ఎక్స్టెన్షన్లో నివాసం ఉండే రాకేష్ షా కెమికల్ బిజినెస్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న రాకేష్‌కు గుర్తు తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. మిస్డ్ కాల్ వచ్చిన తర్వాత మొబైల్లో సిగ్నల్ లేకపోవడం, సిమ్ కార్డులు బ్లాక్ అయ్యాయి. దీంతో తన సిమ్ కార్డులు పనిచేయడం లేదని సదరు టెలికాం నెట్‌వర్క్‌కు చెందిన కస్టమర్ కేర్‌కి కాల్ చేశాడు. రాకేష్ ఫిర్యాదుతో నిర్వాహకులు నాలుగు గంటల్లో సిమ్‌లు యాక్టివేట్ అవుతాయని చెప్పారు. సరిగ్గా అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని మరోసారి కంపెనీకి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు ఉదయం సిమ్‌ను యాక్టివేట్ చేసే సమయంలో మళ్లీ రెండు సిమ్ కార్డ్‌లు బ్లాక్ అయినట్లు గుర్తించాడు. వెంటనే సంబంధిత సిమ్ నెట్ వర్క్‌కు సంబంధించిన స్టోర్ నిర్వాహకుల్ని నేరుగా సంప్రదించాడు. రాకేష్ ఫోన్‌ను చెక్ చేసిన స్టోర్ ప్రతినిధులు కోల్‌కతాలో రెండు సిమ్ కార్డ్‌లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు తనకు తెలియకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్లు జరిగినట్లు అనుమానించాడు. సంబంధిత బ్యాంక్‌లను సంపద్రించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరస్తులు తన బ్యాంక్ అకౌంట్లో ఉన్న రూ.46 లక్షలు కాజేశారని కంగుతిన్నాడు. ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ ద్వారా సోనాయ్ దాస్, రోహిత్ రాయ్, రాకేష్ విశ్వకర్మ బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ అయినట్లు బ్యాంక్ అధికారులు నిర్ధారించారు. దీంతో అప్రమత్తమైన రాకేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 ట్రాన్సాక్షన్ల ద్వారా రూ.46.36 లక్షలు విత్‌డ్రా అయ్యాయని, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన ఓటీపీలను సేకరించడం ద్వారా బ్యాంక్‌లో డబ్బులు మాయమైనట్లు పోలీసులు తెలిపారు. చదవండి: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..! -
మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను మొబైల్ నుంచి ఇలా తెలుసుకోండి
న్యూ ఢిల్లీ: ఉద్యోగులు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులువు. ఈపీఎఫ్ ఖాతాలో రిజస్టర్ ఐనా నంబర్ నుంచి మెసేజ్, మిస్డ్ కాల్ ఇస్తే చాలు క్షణాల్లో మీ ముందు పీఎఫ్ బ్యాలెన్స్ ప్రత్యక్షమవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాతో రిజిస్టర్ ఐనా మొబైల్ నంబర్ నుంచి 7738299899 లేదా 011-22901406 నంబర్లకు మెసేజ్ లేదా మిస్డ్‌కాల్ చేస్తే చాలు మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు కనిపిస్తోంది. ఎస్ఎంఎస్తో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ ద్వారా వారి బ్యాలెన్స్ తనిఖీ చేయవచ్చు. ఈపీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లు యాక్టివ్ మోడ్‌లో ఉండేలా చూసుకోవాలి. తరువాత రిజిస్టర్ ఐనా మొబైల్ నుంచి ‘EPFOHO UAN LAN’ అని టైప్ చేసి 7738299899 పంపాలి. మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మీకు మెసెజ్ రూపంలో వస్తుంది. మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా చెక్ చేసుకోండి. ఈపీఎఫ్ సభ్యులు ఈపీఎఫ్ సభ్యులు రిజస్టర్ ఐనా మొబైల్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో మీ పీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చును. అంతేకాకుండా ఈపీఎఫ్ సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను https://passbook.epfindia.gov.in/MemberPassBook/Loginలో లాగిన్ ద్వారా తెలుసుకోవచ్చును. దాంతో పాటుగా ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌ను ఉద్యోగులు తెలుసుకోవచ్చును. अब घर बैठे ही अपना #ईपीएफ बैलेंस चेक करें। इन आसान स्टेप्स का पालन करें और परेशानी मुक्त सेवा का आनंद लें।#EPFO #PF #पीएफ #ईपीएफओ #Employees #Services@PMOIndia @PIB_India @PIBHindi @MIB_India @MIB_Hindi @DDNewslive @airnewsalerts @mygovindia @_DigitalIndia @PTI_News pic.twitter.com/WU8L2Z2Sxl — EPFO (@socialepfo) July 8, 2021 -
మిస్డ్ కాల్‌తో ఎల్పీజీ రీఫిల్ బుకింగ్
న్యూఢిల్లీ: కేవలం ఫోన్ మిస్డ్ కాల్తోనే ఎల్పీజీ రీఫిల్ బుకింగ్ సదుపాయం ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన వినియోగదారులైనా సరే 845455555 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే రీఫిల్ సిలిండర్ బుక్ అవుతుందని ఇండియన్ ఆయిల్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి కాల్ ఛార్జీలు పడకుండానే ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించింది. గ్రామీణ ప్రాంతాల వారికి, వృద్ధులకు, ఐవీఆర్ఎస్ తెలియని వారికి ఇది సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. (చదవండి: కొనగలుగుతున్నారా... తినగలుగుతున్నారా?) -
మిస్డ్ కాల్‌తో ఏర్పడ్డ ప్రేమ కారణంగా..
చెన్నై, అన్నానగర్: మిస్డ్ కాల్‌తో ఏర్పడ్డ ప్రేమ కారణంగా ఇద్దరు పిల్లలను వదిలేసి వివాహం కాలేదని ఓ యువకుడిని మోసం చేసిన మహిళను ప్రస్తుతం ఇద్దరు భర్తలు, బంధువులు ఆమెను అంగీకరించలేదు. తమిళనాడులోని నెల్లై జిల్లా సేరన్ మహాదేవికి చెందిన కూలీ కార్మికుడికి పాళయంకోటై కృష్ణాపురానికి చెందిన బంధువు మహిళకి గత పదేళ్లకు ముందు వివాహం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల పరామర్శలతో పెరుగుతూ వచ్చిన ఆ మహిళ వద్ద నగలు, నగదు వంటివి ఏమీ తీసుకోకుండా కూలీ కార్మికుడు వివాహం చేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో ఒక్కటిన్నర సంవత్సరాల ముందు ఆ మహిళకి ఓ మిస్డ్ కాల్ వచ్చింది. కాయత్తార్‌కి చెందిన యువకుడితో పరిచయమై కాలక్రమేణా ప్రేమగా మారింది. ప్రేమ మత్తులో ఉన్న ఆ మహిళ ఆ యువకుడి వద్ద తనకు వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టింది. ప్రియుడిని కలవడానికి వెళ్లినప్పుడు మంగళసూత్రాన్ని తీసేసి బ్యాగులో పెట్టుకుని ఊరు తిరిగింది. 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడానికి పథకం వేశారు. అనంతరం ఆ మహిళ గత 20వ తేదీ నాగర్‌కోవిల్‌లో ఇంటర్వ్యూ అని భర్తకు చెప్పి వెళ్లింది. తరువాత ప్రియుడితో తెన్కాశి సమీపంలో సుందరపాండియన్ పురానికి వెళ్లిన ఆ మహిళ ప్రియుడి బంధువుల ముందు 24వ తేదీ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలియని భర్త తన భార్య కనబడడం లేదని, భార్యను కనిపెట్టి ఇవ్వమని సేరన్ మహాదేవి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఫొటోని ఆ మహిళ తన ఫొన్లో స్టేటస్‌గా పెట్టింది. దీన్ని ఆమె బంధువులు, కుటుంబీకులుకు తెలిపిన అనంతరం వారు సేరాన్ మహాదేవి పోలీసులకు తెలిపారు. వారు కయత్తార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు జులై 1వ తేదీ ఇద్దరినీ పిలుచుకుని విచారణ చేసినప్పుడు ఆ మహిళకు ముందుగానే వివాహం జరిగి పిల్లలు ఉన్నట్లు తెలిసింది. అనంతరం ఆ యువకుడు ఆమెను అంగీకరించలేదు. సేరణ్ మహాదేవి పోలీసులు గత రెండో తేదీ సేరన మహాదేవిని పిలుచుకుని వెళ్లి వచ్చారు. దీనిపై భర్త, బంధువులకు తెలిపితే వారు కూడా ఆమెను అంగీకరించలేదు. ఆమెను ఆ రోజు రాత్రి సేరన్ మహాదేవిలో ఉన్న కరోన శిబిరంలో ఉంచారు. మరుసటి రోజు కృష్ణాపురంలో ఉన్న బంధువులకు సమాచారం తెలిపి వారి పర్యవేక్షణలో వాగ్వాదం ఏర్పడింది. ఇందులో ఆ మహిళను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరలా ఆ మహిళను సేరన్ మహాదేవి శిబిరానికి పంపారు. వేరే జిల్లా నుంచి మహిళ రావడం వల్ల ఆమెకు జులై 4వ తేదీ వరకు కరోనా పరిశోధన చేశారు. శిబిరంలో ఉన్న మిగతా వారికి పరిశోధన ముగిసి రిజల్ట్ వచ్చిన స్థితిలో ఈమెకి మాత్రం రిజల్ట్ వెయిటింగ్లో ఉంది. మూడు రోజులుగా ఆ మహిళ శిబిరంలోనే ఉంది. -
ఒక్క మిస్డ్ కాల్.. ఇంటికే పండ్లు
లక్డీకాపూల్ : ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే..ఇంటి వద్దకే పండ్లు సరఫరా చేస్తున్న ‘వాక్ ఫర్ వాటర్ సంస్థ’ ప్రయత్నాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. రైతులను ప్రోత్సాహించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియకు ప్రజలు చేయూత నివ్వాలన్నారు. ప్రజలు కొనుగోలు చేసే ప్రతి పండు రైతుక అండగా నిలవటంలో భాగమన్నారు. లాక్డౌన్ కారణంగా చేతికి వచ్చిన పండ్లు తోటల్లోనే మగ్గిపోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు, వినియోగదారులకు వారధిగా నిలుస్తున్న ‘వాక్ ఫర్ వాటర్’ వ్యవస్ధాపకులు కరుణాకర్ రెడ్డి కృషిని మంత్రి కొనియాడారు. -
మిస్డ్‌కాల్ పాపం.. రూ.5లక్షల మోసం
అనంతపురం, రాయదుర్గం రూరల్: మిస్డ్ కాల్‌తో పరిచయమైన వ్యక్తి మాటలు నమ్మి అవసరం నిమిత్తం రూ.5లక్షలు ఇచ్చి మోసపోయిన ఓ ల్యాబ్ టెక్నీషియన్ ఉదంతం ఒకటి వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్స్‌రే ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నగర నాగరాజు సెల్‌కు ఓ మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరు చేశారోనని ఆ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. నెల రోజులకు పైగా రోజూ ఫోన్ ద్వారానే సంభాషించుకున్నారు. పదిహేను రోజుల క్రితం తనకు డబ్బు అవసరం వచ్చింది.. ఐదు లక్షలు కావాలని మిస్డ్ కాల్ చేసిన వ్యక్తి అయిన రాయదుర్గం పట్టణానికి చెందిన రమేష్ అడిగాడు. వారం రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మిన టెక్నీషియన్ అతడిని తిరుపతికి పిలిపించుకుని రూ.ఐదు లక్షలు సర్దుబాటు చేసి పంపించాడు. వారం రోజుల తరువాత కాల్ చేస్తే రమేష్ సెల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ల్యాబ్ టెక్నీషియన్‌కు గుండె ఆగినంత పనైంది. అనుమానం వచ్చి తిరుపతి నుంచి రాయదుర్గం వచ్చాడు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన గోడు వెల్లబోసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. -
మిస్డ్ కాల్‌తో మిస్సెస్సై..
ప్రకాశం, గిద్దలూరు: మిస్డ్ కాల్‌తో మిసెస్‌ను చేసుకుని రెండు నెలల కాపురం చేసి ఆ తర్వాత ఆమెను పుట్టింట్లో వదిలేసి పారిపోయి వచ్చిన ఓబులాపురానికి చెందిన మహేశ్వరరెడ్డి ఉదంతమిది. భర్త ఇంకా వస్తాడని ఎదురు చూసిన భార్య ఎంతకీ రాకపోగా ఫోన్ పని చేయకపోవడంతో గురువారం నేరుగా ఓబులాపురం వచ్చిన యువతి మహేశ్వరరెడ్డి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలతి మండలంలోని ఓబులాపురానికి చెందిన వేమిరెడ్డి మహేశ్వరరెడ్డికి మిస్డ్ కాల్ ద్వారా ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని నమ్మబలికి మాలతి కుటుంబ సభ్యులను నమ్మించి గుడిలో మహేశ్వరరెడ్డి వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అనంతరం హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటూ అక్కడే కాపురం పెడదామని ఉప్పల్‌లోని గణేష్‌నగర్ తీసుకెళ్లి అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. రెండు నెలల కాపురం చేసిన తర్వాత భార్యను శ్రీకాకుళం తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. అప్పటికే ఆమె గర్భం దాల్చింది. రెండు నెలలుగా ఆమెతో మాట్లాడటం లేదు. ఫోన్ చేయడం లేదు. ఆమె ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు. ఇక తన బంధువులకు ముఖం ఎలా చూపించగలనని బాధితురాలు విలపిస్తోంది. తాను వచ్చినట్లు సమాచారం తెలుసుకున్న మహేశ్వరరెడ్డి తన బంధువుల ద్వారా బెదిరిస్తున్నాడని, అతని తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారని బాధితురాలు చెబుతోంది. చావైనా బతుకైనా తన భర్త మహేశ్వరరెడ్డితోనేనని, ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెబుతోంది. భర్త ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని మాలతి కోరుతోంది. మహేశ్వరరెడ్డి గతంలోనూ గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంటి నుంచి తీసుకెళ్తుండగా గమనించిన ఆమె కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాదినట్లు సమాచారం. -
ఒక్క మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్..
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటును కల్పించింది. కేవలం ఒక్క మిస్డ్ కాల్తోనే ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకునే వీలుకల్పించింది. ఉద్యోగస్తులు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను సులువుగా పొందడానికే ఈ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్(ఈపీఎఫ్ఓ) స్కీమ్‌లోని ఉద్యోగులు ఎవరైతే యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) పోర్టల్‌లో కూడా రిజస్టర్ అయి ఉంటారో వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు పొందే మాదిరిగానే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను కూడా తెలుసుకోవచ్చన్న మాట. యూఏఎన్ పోర్టల్‌లో ఉద్యోగులు పేర్కొన్న తమ ఫోన్ నెంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇస్తే చాలూ.. వెంటనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. ఈ సర్వీస్‌కు ఎలాంటి చార్జీలు ఉండబోవని కార్మిక శాఖ తెలిపింది. అదే విధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కూడా వివరాలు పొందవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో బ్యాలెన్స్ వివరాలు పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. -
లవర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారని..
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): శ్రీరామ్‌నగర్‌కు చెందిన అనూక్, విశ్వనాథ్ అలియాస్ బన్నీలపై అదే కాలనీకి చెందిన దినేష్‌రెడ్డి, అమర్, సాయికుమార్, తరుణ్ సోమవారం రాత్రి దాడి చేశారు. బాధితుల్లో ఒకరు దాడి చేసిన వారిలోని ఓ వ్యక్తి లవర్ సెల్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో ఘర్షణ పడ్డారు. మాటకు మాట పెరిగి అనూక్, విశ్వనాథ్‌లపై తీవ్రంగా దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ మధుసూదన్‌రావు మంగళవారం తెలిపారు. -
మిస్ కాల్ కొట్టు..
డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. వినూత్న తరహాలో మిస్డ్ కాల్ కొట్టూ, అంటూ ఫ్యాన్సీ నంబర్‌గా 7220072200ను ప్రకటించారు. ఇక ఎన్నికల బరిలో దిగేందుకు దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధమయ్యారు. సీట్ల పందేరానికి దళపతి స్టాలిన్ నేతృత్వంలో కమిటీని నియమించారు. * వినూత్నంగా కరుణ ప్రచారం * ప్రచారానికి 7220072200 ఫ్యాన్సీ నంబర్ * 22 నుంచి ఆశావహుల ఇంటర్వ్యూ * సీట్ల పందేరానికి ‘స్టాలిన్’ కమిటీ సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో ముందుకు సాగుతున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి అందరి కన్నా ముందుగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టేశారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లు వంటి మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్న కరుణానిధి, మంగళవారం తన ప్రత్యేక ప్రసంగం కోసం మిస్డ్ కాల్ కొట్టూ అంటూ ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ప్రకటించేశారు. వినూత్న రీతిలో ఆసక్తి గల వారు.. మిస్డ్ కాల్ కొట్టూ అంటూ మొబైల్ ఫోన్లలో ఈ ఫ్యాన్సీ నంబర్ ప్రత్యక్షం అవుతున్నాయి. దీనికి మిస్డ్ కాల్ ఇస్తే చాలు, కొన్ని క్షణాల్లో ల్యాండ్ లైన్ నంబర్ నుంచి కాల్ రావడం, నేను మీ..కరుణానిధి అంటూ ప్రసంగం, ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలంటూ ముప్పై నిమిషాల పాటుగా ప్రచారం సాగుతుండడం గమనార్హం. అయితే, ప్రసంగం వినేందుకు ఓపిక ఉండాలే గానీ, మిస్డ్ కాల్ కొట్టిన వాళ్లకు మాత్రం ఎలాంటి చార్జీల భారం ఉండదు. ఇంటర్వ్యూలు : డీఎంకే తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న ఆశావహులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. దరఖాస్తుల పరిశీలన పర్వం ముగిసింది. ఇక, ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేసి, ఎన్నికల బరిలో దించేందుకు తగ్గ కసరత్తుల్లో కరుణానిధి నిమగ్నం అయ్యారు. ఈనెల 22 నుంచి 27వ తేది వ రకు అన్నా అరివాలయంలో ఆశావహుల్ని ఇంటర్వ్యూ చేయనున్నారు. 22న ఉదయం తొమ్మిది గంటలకు కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా, సాయంత్రం నాలుగు గంటలకు విరుదునగర్, తేని, దిండుగల్ జిల్లాల్లోని నియోజకవర్గాలకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 23న ఉదయం తొమ్మిది గంటలకు శివగంగై, మదురై, ఈరోడ్, సాయంత్రం నాలుగు గంటలకు నీలగిరి, కోయంబత్తూరు, సేలం, 24న ఉదయం తొమ్మిది గంటలకు పుదుకోట్టై, నామక్కల్, తిరుప్పూర్, సాయంత్రం నాలుగు గంటలకు కరూర్, పెరంబలూరు, అరియలూరు, 25న ఉదయం నాగపట్నం, తిరువారూర్, తంజావూరు, కడలూరు, సాయంత్రం విల్లుపురం, ధర్మపురి , కృష్ణగిరి, 26న ఉదయం తిరువణ్ణామలై, వేలూరు, కాంచీపురం, సాయంత్రం తిరువళ్లూరు, చెన్నై జిల్లాల్లోని నియోజకవర్గాల వారీగా ఆశావహుల ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇక, 27వ తేది ఉదయం పుదుచ్చేరి, కారైక్కాల్లలోని ఆశావహుల ఇంటర్వ్యూలు జరుగుతాయని డీఎంకే కార్యాలయం ప్రకటించింది. స్టాలిన్ కమిటీ : బలమైన కూటమి లక్ష్యంగా డీఎంకే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్‌లు డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్నాయి. ఇక, మరికొన్ని కుల, మైనారిటీ సామాజిక వర్గాల పార్టీలతో పాటుగా డీఎండీకే ఈ కూటమిలోకి వస్తుందన్న ప్రచారం సాగుతున్నది. ఈ పార్టీలతో పొత్తులు ఖరారు చేయడంతో పాటుగా, సీట్ల పందేరం కొలిక్కి తెచ్చేందుకు తగ్గట్టుగా డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో నాయకులు దురై మురుగన్, టీఆర్ బాలుల కమిటీని రంగంలోకి దించనున్నారు. -
ఓ మిస్డ్‌కాల్.. ప్రేమ..పెళ్లి.. విషాదం!
బోథ్ (ఆదిలాబాద్): ఓ మిస్డ్ కాల్.. వారి మధ్య పరిచయూనికి దారితీసింది. అది ప్రేమగా మారి పెళ్లి దాకా చేరింది. చివరికి ఆ యువతి ప్రాణాన్నే బలితీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని కొత్త కాలనీకి చెందిన గుమ్ముల స్వరూప (22) బీడీ కార్మికురాలు. గుమ్ముల లక్ష్మి, రాములు మూడో సంతానమైన ఆమె పెద్దగా చదువుకోలేదు. మూడేళ్ల క్రితం ఆమె ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ వచ్చింది. ఎవరు కాల్ చేశారో తెలియక ఆమె తిరిగి కాల్ చేసింది. అవతలి వ్యక్తి తన పేరు అశోక్ అని, తాను ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తినని పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొన్ని రోజులపాటు ప్రేమలో గడిపారు. అనంతరం అశోక్ పెళ్లికి నిరాకరించడంతో స్వరూప పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు, పెద్ద మనుషుల ద్వారా రాజీ కుదుర్చుకుని పెళ్లి చేసుకున్న వారికి 20 రోజుల క్రితమే కూతురు పుట్టింది. ఏమైందో ఏమో తెలియదు కానీ మంగళవారం సాయంత్రం స్వరూప ఆత్మహత్య చేసుకుందని కాలనీవాసులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే.. స్వరూప ఆత్మహత్య చేసుకోలేదని, భర్తే చితకబాది బలవంతంగా పురుగుల మందు తాగించాడని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అతను హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాడని అంటున్నారు. ఆదిలాబాద్‌లోని రూరల్ పోలీసులు స్వరూప భర్త అశోక్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మిస్డ్‌కాల్.. విచారణ మిస్!
కొంతమంది నిందితులతోనే సరి.. బయటకురాని ‘పెద్ద మనుషుల’ పేర్లు విచారణ తీరుపై ఆరోపణలు వరంగల్ : సంచలనం సృష్టించిన ‘మిస్డ్ కాల్’ కేసులో పోలీసు విచారణ ఎంతకీ ముందుకు కదలడం లేదు. అమ్మాయిలను ఎరవేసి సమాజంలోని ఉన్నతస్థాయి వారిని, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన విషయంలో వరంగల్ కమిషరేట్ పోలీసులు గతనెల 6న కొందరు నిందితులను అరెస్టు చేశారు. సమాజంలోని పలువురు పెద్దలు ఈ కేసులో ఉన్నట్లు చెప్పారు. మోసం చేసినవారుగా పేర్కొంటూ అరెస్టు చేసిన వారి వివరాలు వెల్లడించారు. మహిళలతో ఫోన్లో మాట్లాడి వారి పిలిచిన చోటికి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న వారు ఎవరనే విషయాలు పోలీసులు చెప్పడం లేదు. సాధారణంగా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న అందరినీ నిందితులుగా భావించే పోలీసులు మిస్డ్ కాల్ కేసులో మాత్రం మహిళలను, మరికొందరిని అరెస్టు చేసి.. భాగస్వాములు అయిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో పోలీసుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. కేసును నీరుగార్చుతున్న పోలీసులు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి ఉన్నతస్థాయి వ్యక్తులకు మహిళలతో ఫోన్లో మిస్డ్ కాల్‌తో పరిచయడం పెంచుకుని బ్లాక్ మెయిలింగ్‌కు తెరతీసిన వ్యవహారం గత నెలలో జిల్లాలో సంచలనం సృష్టించింది. పలువురు ఉన్నతస్థాయి అధికారులు, బడా వ్యాపారులు ఈ ముఠా ప్రలోభాలకు గురయ్యారు. వ్యభిచారం ముఠా వలలో చిక్కి ఏకంగా రూ.12 లక్షలు వసూలు చేశారు. ఇదే విషయంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. పరారీలో ఇద్దరు వ్యక్తులు చిక్కితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తామని పోలీసులు అప్పుడు చెప్పారు. వీరిని ఎంతకీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పరారీలో ఉన్న ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఈ విషయాన్ని బహిరంగ పర్చడం లేదని తెలుస్తోంది. మరో కీలక నిందితుడిని అరెస్టు చేస్తే వ్యభిచారం ముఠాకు భారీగా డబ్బులు ఇచ్చిన ఉన్నతాధికారులు, వ్యాపారుల వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. వీరి వివరాలు బయటికి రాకుండా ఏదో మతలబు జరిగినందునే పోలీసులు ఈ కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితులను పట్టుకోకుండా కేసును నీరుగారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద మనుషులనేనా! మిస్డ్ కాల్ కేసులో భాగస్వామ్యం ఉన్న ‘పెద్ద మనుషుల’ను పోలీసులు బాధితులుగా చెబుతున్నారు. ఆర్టీసీ, ఎఫ్‌సీఐ, పాల డైరీలోని ఉన్నత ఉద్యోగులు, ఓ ప్రముఖ కంపెనీ షోరూం యజమాని ‘పెద్ద మనుషులలో’ ఉన్నట్లు కేసు వివరాలు వెల్లడించిన రోజున పోలీసులే స్వయంగా చెప్పారు. పెద్ద మనుషులను వ్యవహరాలను బ్లాక్మెయిల్ ముఠా వీడియో తీసిన టేపులు ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఈ విషయంలో ఉదాసీనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మిస్డ్‌కాల్ ముఠా వ్యవహరం బహిర్గతమైన తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. ముఠా సభ్యులు తమను బ్లాక్మెయిల్ చేసినట్లు వారు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఎందరో ప్రముఖులు ఉన్నా బ్లాక్‌మెయిలింగ్ ముఠా వీరినే లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణాలు ఏమిటనేది పోలీసులకు తెలిసినా.. వీరి పేర్లను వెల్లడించకపోవడానికి కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు తమ పేర్లను వెల్లడించవద్దని పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఒప్పందం విషయంలో ఆలస్యం చేసిన కారణంగానే తన పేరును పోలీసులు బయటి కి వెల్లడించారని ఎఫ్‌సీఐ ఉద్యోగి ఒకరు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. దీంతో మిగిలిన ‘పెద్దమనుషులు’ పోలీసులను సంప్రదించి మేనేజ్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మిగిలిన పోలీసుల పేర్లు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. -
ఒక్క మిస్డ్‌కాల్‌తో పుష్కర సమాచారం
హైదరాబాద్ సిటీ: ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి సమాచారం కావాల్సిన వారు 8333000020 నెంబరుకు ఫోను చేసి మిస్‌కాల్ ఇస్తే చాలు. ఫోను చేసిన వారు కాల్ కట్ అయిన కొద్దిసేపటికే వారికి ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) కాల్ అందుబాటులోకి వస్తోంది. ఐవీఆర్ కాల్ ద్వారా పుష్కర ఘాట్ల సమాచారం.. దేవాలయాల సమాచారం.. హోటళ్లలో గదుల వివరాలు.. రవాణా సమాచారం.. రాజమండ్రి బస్సు వేళల.. రాజమండ్రికి ప్రత్యేక రైళ్ల వేళల.. పూజా వివరాల.. ప్రైవేట్ వాహానాల పార్కింగ్ వివరాలకు.. ఆసుపత్రుల వివరాలలో దేనికి సంబంధించిన వివరాలు కావాలో తెలియజేయాలని ఫోను చేసిన సంబంధిత వ్యక్తిని కోరుతుంది. కావాల్సిన సమాచారానికి ఉద్దేశించిన నెంబరును తన ఫోనులో నొక్కితే..కొద్ది సేపటికే దానికి సంబంధించిన వివరాలు ఎస్ఎంఎస్ రూపంలో లభిస్తాయి. దీనికి తోడు భక్తులకు పుష్కర సమాచారం అందజేసేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబరు 12890కు ఫోను చేస్తే ఉచితంగా పుష్కర సమాచారం పొందవచ్చు. ఫుష్కరాలకు వచ్చిన భక్తులు తాము ఉన్న ప్రాంతంలో ఏటీఎం, హోటల్ గదుల ఖాళీల వివరాలు, రాకపోకల మార్గాల వివరాలను తెలియజేసుకునేందుకు ఘాట్ల వద్ద 25 మీడియా సెంటర్లను ఏర్పాటు చేశారు. మరోపక్క ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చిత్రీకరించే దృశ్యాల ద్వారా రద్దీని అంచనా వేయడానికి 20 మంది నిపుణుల బృందం ప్రత్యేకంగా పనిచేస్తోంది. -
మిస్డ్ కాల్ ఇచ్చి ముగ్గులోకి దించుతారు
వరంగల్ : మీడియా ముసుగులో నలుగురు వ్యక్తులు బృందంగా ఏర్పడి పలువురిని బ్లాక్మెయిల్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిన సంఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఎప్పుడూ వినని టీవీ చానళ్ల పేర్లు చెబుతూ ఈ ముఠా సమాజంలో పేరున్న వ్యక్తులను టార్గెట్ చేస్తుంది. ముఠా వ్యక్తి ఒకరు సదరు టార్గెట్ వ్యక్తి సెల్‌ఫోన్‌కు ఒక మిస్డ్ కాల్ ఇస్తారు. తిరిగి వారు ఫోన్ చేయగానే.. ఇటు వైపు నుంచి ఓ యువతి మాట్లాడుతుంది. ఒకసారి పరిచయం అయిన తర్వాత వారికి పదే పదే ఆమె ఫోన్ చేస్తుంటుంది. మాటలతో సదరు వ్యక్తులను ట్రాప్ చేయడం ఆమె పని. అయితే ఆమె వెనుక సిండికేట్ సభ్యులు ఉండి ఈ తతంగం నడిపిస్తారు. మొదట బేకరీలు, స్టార్ హోటళ్లలో పరిచయం పెంచుకోవడం.. చివరకు సదరు వ్యక్తి యువతిని సీక్రెట్‌గా కలిసే విధంగా రంగం సిద్ధం చేస్తారు. ఇద్దరు కలిసి ఇల్లు లేదా లాడ్జికి వెళ్లగానే క్షణాల్లో ఈ నలుగురు రంగంలోకి దిగుతారు. ఆ ఇద్దరు లోపలికి వెళ్లి గడియ వేసుకోగానే.. వీరు బయటి నుంచి తలుపు కొడతారు. వారు తలుపులు తీయగానే ఇద్దరినీ కెమెరాలో చిత్రీకరిస్తారు. ఇక్కడ కెమెరాలు రెండు విధాలుగా పనిచేస్తాయి. ముందుగా తాము ఎంచుకున్న గదికి సదరు వ్యక్తి వచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. గదిలోనే సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేసి, ఇద్దరు లోనికి వెళ్లగానే తలుపు కొడతారు. కెమెరాల్లో రికార్డు అయిన అంశాన్ని చూపెట్టి భయపెడతారు. ఇక రెండవ విధానంలో.. సదరు వ్యక్తి చెప్పిన చోటికి యువతి రావాల్సి వస్తే మాత్రం కెమెరాలతో సిద్ధంగా ఉండి వారు గదిలోకి వెళ్లిన కొద్ది సమయంలోనే వీరు ఎంట్రీ ఇస్తారు. ఇలా చిత్రీకరించిన తర్వాత తమ చానళ్లలో ప్రసారం చేస్తామని బెదిరిస్తారు. బేరసారాలకు దిగుతారు. లక్షలాది రూపాయలు డిమాండ్ చేసి గుంజుతారు. గతంలో వీరి చేతికి కేయూకు చెందిన ఓ ప్రొఫెసర్ చిక్కి రూ. లక్షలు పొగొట్టుకున్నట్లు సమాచారం. ఇలా సమాజంలో మహిళల వ్యసనం ఉన్న కొందరు ప్రొఫెషనల్స్‌ను, పెద్ద మనుషులను కూడా మభ్యపెట్టి అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తారు. బయటపడిందిలా... తాజాగా వీరు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ట్రాప్ చేశారు. యధాతథంగా ఫోన్‌కాల్ వెళ్లడం.. మిగిలిన తతంగమంతా పూర్తై... చివరకు ఆ ఉపాధ్యాయుడు వారి కెమెరాలకు చిక్కాడు. దీంతో ఈ బృందంలోని వారు రూ. 5 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు ఒప్పందానికి వచ్చినా.. ఒక చానల్లో స్క్రోలింగ్ వచ్చింది. అయితే వీరు తనతో మాట్లాడిన మాటలను సదరు ఉపాధ్యాయుడు ముందుగా రికార్డు చేసి పెట్టుకున్నాడు. స్క్రోలింగ్ రావడంతో పోలీసులను ఆశ్రయించి తన గోడును వెళ్లబోసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తులను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. -
సేవ్ ఎన్టీఆర్ స్టేడియం..సేవ్ ఇందిరాపార్క్
మారేడ్‌పల్లి (హైదరాబాద్) : సేవ్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్క్ అనే నినాదాలతో లోక్‌సత్తా పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఈస్ట్‌మారేడుపల్లిలోని తెలంగాణ శాఖ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పాండురంగారావు మిస్డ్‌కాల్, పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియం, ఇందిరా పార్కుల స్థానంలో తెలంగాణ భవన్, వినాయక్సాగర్ను నిర్మించాలని తలపెట్టటం సరికాదని అన్నారు. వాటిని వేరేచోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు తమతో కలసి పాల్గొనదలచిన వారు 8688047100 నంబర్‌కు మిస్ట్ కాల్ చేయాలని, లేదంటే పోస్టు కార్డు ద్వారా కేసీఆర్‌కు నిరసన లేఖలు రాయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఆయన మిస్డ్ కాల్ బ్యానర్ ఆవిష్కరించి, పోస్టు కార్డు రాస్తూ ఉద్యమాన్ని ప్రారంభించారు. -
మిస్డ్ కాల్‌తో సమాచారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. సమాచారం క్షణాల్లో అందించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎస్ ఫ్రీ టు డయల్ కమ్యూనికేషన్స్ ‘ఫ్రీ టు డయల్’ పేరుతో సేవలను ప్రారంభించింది. రెస్టారెంట్లు, ఫుడ్, దుస్తులు, క్లినిక్స్, విద్య.. ఇలా సమాచారం ఏదైనా 040-66444466 నంబరుకు మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. ప్రతిగా కంపెనీ ప్రతినిధి కాల్ చేసి కస్టమర్‌కు కావాల్సిన సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తారు. అటు వెండార్‌కు కూడా ఈ సమాచారం వెళ్తుంది. ప్రస్తుతం 2 వేలకుపైగా వెండార్లతో చేతులు కలిపినట్టు కంపెనీ డెరైక్టర్ సునీల్‌కుమార్ సింగ్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. వైజాగ్, విజయవాడ, బెంగళూరు నగరాలకూ విస్తరించాలన్నది ప్రణాళిక. ఇప్పటి వరకు కంపెనీ రూ.3 కోట్లు వెచ్చించింది. ఫ్రీటుడయల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ సర్చ్ ఇంజన్ సేవలను అందిస్తోంది. -
'మిస్డ్ కాల్ వస్తే తిరిగి చేయొద్దు..'
రనితా డిసౌజా అనే ఆవిడ..గాఢ నిద్రలో ఉండగా సరిగ్గా అర్థరాత్రి 1.30కు ఓ ఫోన్‌కు కాల్ వచ్చింది. ఆమె సెల్ ఫోన్ ఎత్తాక అవతలి వ్యక్తి మాట్లాడకుండా కట్ చేశారు. ఆ ఫోన్ కాల్ కోడ్ ప్లస్ 216గా ఉంది. దీంతో అది ముఖ్యమైన ఫోన్ కాల్ అనుకొని రనితా డిసౌజా తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేయగా అవతల ఫోన్ ఎత్తారు కానీ ఏం మాట్లాడలేదు.. దీంతో ఆమె ఫోన్ పెట్టేశారు. తీరా చూస్తే ఆమె సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ మాత్రం ఒక్కసారిగా 60 రూపాయలు కట్ అయింది. దాంతో ఖంగుతిన్నరనితా డిసౌజా కస్టమర్ కేర్ కు కాల్ చేసి బ్యాలెన్స్ కట్ అయినట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఇది రనితా డిసౌజా ఒక్కరి సమస్యే కాదు.. ఇలాంటి సమస్యలు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. చాలామందికి తెలియక ఇలాంటి నెంబర్లను చూసి పొరపడి తిరిగి ఫోన్లు చేస్తున్నారు. దీనిపై ఎయిర్టెల్ సంస్థకు చెందిన శరత్ తేజస్వీ అనే వ్యక్తి స్పందిస్తూ ఇప్పటికే తాము తమ కస్టమర్లకు ఇలాంటి నెంబర్ల నుంచి మిస్డ్ కాల్ వస్తే తిరిగి చేయొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.