హైదరాబాద్ సిటీ: ఆంధ్రప్రదే శ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు సంబంధించి సమాచారం కావాల్సిన వారు 8333000020 నెంబరుకు ఫోను చేసి మిస్‌కాల్ ఇస్తే చాలు. ఫోను చేసిన వారు కాల్ కట్ అయిన కొద్దిసేపటికే వారికి ఇంట్రాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) కాల్ అందుబాటులోకి వస్తోంది. ఐవీఆర్ కాల్ ద్వారా పుష్కర ఘాట్ల సమాచారం.. దేవాలయాల సమాచారం.. హోటళ్లలో గదుల వివరాలు.. రవాణా సమాచారం.. రాజమండ్రి బస్సు వేళల.. రాజమండ్రికి ప్రత్యేక రైళ్ల వేళల.. పూజా వివరాల.. ప్రైవేట్ వాహానాల పార్కింగ్ వివరాలకు.. ఆసుపత్రుల వివరాలలో దేనికి సంబంధించిన వివరాలు కావాలో తెలియజేయాలని ఫోను చేసిన సంబంధిత వ్యక్తిని కోరుతుంది.
కావాల్సిన సమాచారానికి ఉద్దేశించిన నెంబరును తన ఫోనులో నొక్కితే..కొద్ది సేపటికే దానికి సంబంధించిన వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో లభిస్తాయి. దీనికి తోడు భక్తులకు పుష్కర సమాచారం అందజేసేందుకు ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ నెంబరు 12890కు ఫోను చేస్తే ఉచితంగా పుష్కర సమాచారం పొందవచ్చు. ఫుష్కరాలకు వచ్చిన భక్తులు తాము ఉన్న ప్రాంతంలో ఏటీఎం, హోటల్ గదుల ఖాళీల వివరాలు, రాకపోకల మార్గాల వివరాలను తెలియజేసుకునేందుకు ఘాట్ల వద్ద 25 మీడియా సెంటర్లను ఏర్పాటు చేశారు. మరోపక్క ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు చిత్రీకరించే దృశ్యాల ద్వారా రద్దీని అంచనా వేయడానికి 20 మంది నిపుణుల బృందం ప్రత్యేకంగా పనిచేస్తోంది.
ఒక్క మిస్డ్‌కాల్‌తో పుష్కర సమాచారం
Published Mon, Jul 13 2015 10:16 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement
Advertisement