మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే... జైలుకే | Missed call to women will lead to jail in Bihar | Sakshi
Sakshi News home page

మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే... జైలుకే

Published Wed, Sep 24 2014 4:52 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే... జైలుకే

మహిళలకు మిస్డ్ కాల్ ఇస్తే... జైలుకే

పాట్నా: ఆకాతాయిల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు బీహార్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఉద్దేశపూర్వకంగా మహిళలకు మిస్డ్ కాల్స్ ఇస్తే జైల్లో గడపాల్సిఉంటుందని ఆ రాష్ట్ర సీఐడీ ఇన్స్పెక్టర్ జనరల్ అరవింద్ పాండే హెచ్చరించారు.

ఇలాంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీహార్లోని అన్ని జిల్లాల ఎస్పీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పదే పదే మిస్డ్ కాల్స్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించనున్నారు. దీని వల్ల మహిళలు అభద్రతకు లోనుకావడంతో పాటు మనశ్శాంతిని కోల్పోతారని పాండే అన్నారు. 354 డీ 1, 2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement