మిస్డ్‌ కాల్‌తో ఏర్పడ్డ ప్రేమ కారణంగా.. | Married Women Cheat Youngman in Tamil nadu | Sakshi
Sakshi News home page

ఇద్దరు పిల్లలను వదిలేసి..

Published Wed, Jul 8 2020 9:44 AM | Last Updated on Wed, Jul 8 2020 10:10 AM

Married Women Cheat Youngman in Tamil nadu - Sakshi

చెన్నై, అన్నానగర్‌: మిస్డ్‌ కాల్‌తో ఏర్పడ్డ ప్రేమ కారణంగా ఇద్దరు పిల్లలను వదిలేసి వివాహం కాలేదని ఓ యువకుడిని మోసం చేసిన మహిళను ప్రస్తుతం ఇద్దరు భర్తలు, బంధువులు ఆమెను అంగీకరించలేదు. తమిళనాడులోని నెల్‌లై జిల్లా సేరన్‌ మహాదేవికి చెందిన కూలీ కార్మికుడికి పాళయంకోటై కృష్ణాపురానికి చెందిన బంధువు మహిళకి గత పదేళ్లకు ముందు వివాహం జరిగింది. తల్లిదండ్రులను కోల్పోయి బంధువుల పరామర్శలతో పెరుగుతూ వచ్చిన ఆ మహిళ వద్ద నగలు, నగదు వంటివి ఏమీ తీసుకోకుండా కూలీ కార్మికుడు వివాహం చేసుకున్నాడు. వీరికి 8 ఏళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. ఈ స్థితిలో ఒక్కటిన్నర సంవత్సరాల ముందు ఆ మహిళకి ఓ మిస్డ్‌ కాల్‌ వచ్చింది. కాయత్తార్‌కి చెందిన యువకుడితో పరిచయమై కాలక్రమేణా ప్రేమగా మారింది. ప్రేమ మత్తులో ఉన్న ఆ మహిళ ఆ యువకుడి వద్ద తనకు వివాహం జరిగి పిల్లలు ఉన్నారనే విషయాన్ని దాచిపెట్టింది. ప్రియుడిని కలవడానికి వెళ్లినప్పుడు మంగళసూత్రాన్ని తీసేసి బ్యాగులో పెట్టుకుని ఊరు తిరిగింది. 29 ఏళ్ల ఆ మహిళ 24 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకోవడానికి పథకం వేశారు.

అనంతరం ఆ మహిళ గత 20వ తేదీ నాగర్‌కోవిల్‌లో ఇంటర్వ్యూ అని భర్తకు చెప్పి వెళ్లింది. తరువాత ప్రియుడితో తెన్‌కాశి సమీపంలో సుందరపాండియన్‌ పురానికి వెళ్లిన ఆ మహిళ ప్రియుడి బంధువుల ముందు 24వ తేదీ వివాహం చేసుకున్నారు. ఈ విషయం తెలియని భర్త తన భార్య కనబడడం లేదని, భార్యను కనిపెట్టి ఇవ్వమని సేరన్‌ మహాదేవి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఫొటోని ఆ మహిళ తన ఫొన్‌లో స్టేటస్‌గా పెట్టింది. దీన్ని ఆమె బంధువులు, కుటుంబీకులుకు తెలిపిన అనంతరం వారు సేరాన్‌ మహాదేవి పోలీసులకు తెలిపారు. వారు కయత్తార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు జులై 1వ తేదీ ఇద్దరినీ పిలుచుకుని విచారణ చేసినప్పుడు ఆ మహిళకు ముందుగానే వివాహం జరిగి పిల్లలు ఉన్నట్లు తెలిసింది.

అనంతరం ఆ యువకుడు ఆమెను అంగీకరించలేదు. సేరణ్‌ మహాదేవి పోలీసులు గత రెండో తేదీ సేరన మహాదేవిని పిలుచుకుని వెళ్లి వచ్చారు. దీనిపై భర్త, బంధువులకు తెలిపితే వారు కూడా ఆమెను అంగీకరించలేదు. ఆమెను ఆ రోజు రాత్రి సేరన్‌ మహాదేవిలో ఉన్న కరోన శిబిరంలో ఉంచారు. మరుసటి రోజు కృష్ణాపురంలో ఉన్న బంధువులకు సమాచారం తెలిపి వారి పర్యవేక్షణలో వాగ్వాదం ఏర్పడింది. ఇందులో ఆ మహిళను అంగీకరించడానికి ఎవరూ ముందుకు రాలేదు. మరలా ఆ మహిళను సేరన్‌ మహాదేవి శిబిరానికి పంపారు. వేరే జిల్లా నుంచి మహిళ రావడం వల్ల ఆమెకు జులై 4వ తేదీ వరకు కరోనా పరిశోధన చేశారు. శిబిరంలో ఉన్న మిగతా వారికి పరిశోధన ముగిసి రిజల్ట్‌ వచ్చిన స్థితిలో ఈమెకి మాత్రం రిజల్ట్‌ వెయిటింగ్‌లో ఉంది. మూడు రోజులుగా ఆ మహిళ శిబిరంలోనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement