
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధం కారణంగా తల్లి ప్రియుడితో పారిపోవడంతో ఆమె కుమారులు ఇద్దరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం కలిగించింది. పుదుకోట నామన సముద్రం ప్రాంతానికి చెందిన వెంకటాచలం (47) కూలీ కార్మికుడు. అతని భార్య జయదీప (40). వీరికి విఘ్నేశ్వరన్ (20), యోగేశ్వరన్ (18) ఇద్దరు కుమారులున్నారు. విఘ్నేశ్వర పుదుకోటై ప్రభుత్వ కళాశాలలో బి.కాం ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. యోగేశ్వరన్ ప్రైవేటు పాలిటెక్నికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వెంకటాచలం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుటుంబం నుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నాడు.
ఇద్దరు కుమరులతో జయదీప జీవనం సాగిస్తున్నారు. రెండు రోజులకు ముందు తన తల్లి వివాహేతర సంబంధం ఉన్న ప్రియుడితో కలిసి ఇల్లు వదలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇద్దరు కుమారులు తీవ్ర ఆందోళన, విరక్తితో కనబడినట్లు తెలిసింది. వీరిద్దరూ శుక్రవారం ఉదయం చాలా సేపు ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇరుగుపొరుగు వారు తలుపులు పగులగొట్టి చూడగా విఘ్నేశ్వరన్, యోగేశ్వరన్ ఇద్దరూ తన తల్లి చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వా«దీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చదవండి: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..
Comments
Please login to add a commentAdd a comment