Married women
-
అమ్మా! వద్దు.. వద్దంటున్నా..
గోదావరిఖని: ‘అమ్మా.. వద్దు వద్దు! నువ్వు ఏం జేస్తున్నవో నాకు తెలుస్తలేదు.. ఆ పని చేయొద్దమ్మా.. నాకు భయమేస్తుంది అమ్మా!’అని కూతురు వారిస్తున్నా వినకుండా ఓ వివాహిత, ఓ వ్యక్తితో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శనివారం ఈ ఘటన జరిగింది.పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన చొప్పరి అంజయ్య, మాధవి భార్యాభర్తలు. ఉపాధి కోసం వారు పదేళ్ల క్రితం గోదావరిఖని విఠల్‌నగర్‌కు వలస వచ్చారు. అంజయ్య సెంట్రింగ్ పనులు చేస్తున్నాడు. వీరికి ఏడేళ్ల వయసున్న రితిక అనే కూతురు ఉంది. తిలక్‌నగర్‌కు చెందిన సింగరేణి ఉద్యోగి ఎండీ యూసుఫ్ కుటుంబసభ్యులతో అంజయ్య, మాధవి కుటుంబానికి ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.ఈ క్రమంలో యూసుఫ్ తరచూ వీరి ఇంటికి వచ్చివెళ్లేవాడు. మాధవి, యూసుఫ్ ఫోన్లో కూడా మాట్లాడుకునేవారు. అంజయ్య శనివారం ఉదయం సెంట్రింగ్ పనులు చేసేందుకు గోదావరిఖని సమీపంలోని సుందిళ్ల గ్రామానికి వెళ్లాడు. ఏం జరిగిందో ఏమోకానీ.. యూసుఫ్‌తో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉదయం 10 గంటల సమయంలో మాధవి (30) ఉరివేసుకుంది. ఉరివేసుకుంటుండగా పక్కనే ఉన్న ఆమె కూతురు అమ్మా వద్దు వద్దు.. అని వారించినా వినలేదు. తన భార్య మరణం విషయంలో యూసుఫ్‌పై అనుమానంగా ఉందని మృతురాలి భర్త అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
వివాహిత మహిళలకు నో జాబ్..
-
ఐఫోన్ ప్లాంట్‌లో వివాహితలకు ‘నో జాబ్’.. రంగంలోకి దిగిన కేంద్రం
దేశంలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ఉత్పత్తులు తయారు చేసే ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఉద్యోగాలకు వివాహిత మహిళలను తిరస్కరించిందని రాయిటర్స్ ఓ సంచలన కథనం వెలువరించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.1976 నాటి సమాన వేతన చట్టాన్ని ఉటంకిస్తూ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, ఉద్యోగ నియామకాల్లో పురుషులు, మహిళల మధ్య ఎటువంటి వివక్ష చేయరాదని చట్టం స్పష్టంగా నిర్దేశిస్తుందని పేర్కొంది. చైన్నై సమీపంలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఈ వివక్ష కొనసాగుతోందని రాయిటర్స్ బయటపెట్టిన నేపథ్యంలో తమిళనాడు కార్మిక శాఖ నుంచి వివరణాత్మక నివేదికను కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రకటనపై యాపిల్, ఫాక్స్‌కాన్ యాజమాన్యాలు వెంటనే స్పందించలేదు.రాయిటర్స్ మంగళవారం ప్రచురించిన పరిశోధనాత్మక కథనంలో ఫాక్స్‌కాన్ తమిళనాడులోని చెన్నై సమీపంలోని తన ప్రధాన ఐఫోన్ ప్లాంటులో ఉద్యోగాల కోసం వివాహిత మహిళలను ఉద్దేశపూర్వకంగా తిరస్కరిస్తున్నారని కనుగొంది. పెళ్లైన మహిళలు ఎక్కువ కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారనే కారణంతోనే వారిని క్రమపద్ధతిలో మినహాయిస్తున్నట్లు రాయిటర్స్ గుర్తించింది. రాయిటర్స్ ఇంటర్వ్యూ చేసిన ఫాక్స్‌కాన్ నియామక ఏజెంట్లు, హెచ్ఆర్ వర్గాలు ఇదే విషయాన్ని చెప్పారు. కుటుంబ బాధ్యతలు, గర్భం, అధిక గైర్హాజరును ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో వివాహిత మహిళలను నియమించకపోవడానికి కారణాలుగా పేర్కొన్నారు. -
భర్తను వదిలేసి రావాలన్న తల్లిదండ్రులు.. వివాహిత తీవ్ర నిర్ణయం..!
భూదాన్‌పోచంపల్లి: కుటుంబ కలహాలతో వివాహిత ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జిబ్లక్‌పల్లి గ్రామంలో చోటు చేసుకొంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జిబ్లక్‌పల్లి గ్రామానికి చెందిన కొండపల్లి నర్సింహ, చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామానికి చెందిన తన మేనమామ కుమార్తె కప్పెర సంతోష(18)ను ప్రేమించి 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కాగా సంతోష తల్లి మల్లమ్మకు ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇదే విషయమై సంతోష తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతుండేవారు. అంతేకాక కుమార్తె సంతోషకు తల్లి మల్లమ్మ ప్రతి రోజూ ఫోన్ చేసి భర్తను వదిలేసి వస్తే మంచి సంబంధం చూసి తిరిగి పెళ్లి చేస్తానని చెప్పేది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోష సోమవారం భర్త నర్సింహ బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విక్రమ్‌రెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలను కాపాడిన ట్రాక్‌మన్.. ఆ విషయం చెప్పకపోయుంటే!
పిఠాపురం: వరుసగా ఆడపిల్లలనే కన్నావని అత్తవారు వేధించడంతో ఓ వివాహిత తన పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఇద్దరు బిడ్డలతో కలిసి, రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ట్రాక్‌మన్ అప్రమత్తంగా వ్యవహరించి ఆ ముగ్గురినీ కాపాడాడు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైల్వే స్టేషన్ సమీపాన ఆదివారం ఈ ఘటన జరిగింది. జిల్లాలోని పోతులూరుకు చెందిన శివకు, చేబ్రోలుకు చెందిన వెంకటలక్ష్మిలకు భవ్యశ్రీ, పార్థు అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివాహమై 11 ఏళ్లు అయినా మగ పిల్లవాడు పుట్టలేదని వెంకటలక్ష్మిని భర్త, అత్త కాసులమ్మ వేధించేవారు. విడాకులు ఇవ్వాలంటూ ఒత్తిడి తెచ్చేవారు. రోజూ ఆమెను చిత్రహింసలు పెట్టేవారు. గత శుక్రవారం అదనపు కట్నం తేవాలని బాధితురాలిపై దాడి చేయగా పెద్దలు వెళ్లి తగువు తీర్చారు. తన మీదకు పెద్దలను తీసుకువస్తావా అంటూ కోపోద్రిక్తుడైన భర్త శివ ఆమెను కొట్టాడు. తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటలక్ష్మి తన ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, దుర్గాడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. కూతురే కాపాడింది... అదే సమయంలో విశాఖ– విజయవాడ సూపర్‌ఫాస్ట్ రైలు వస్తోంది. ట్రాక్‌మన్ పిమిడి వెంకటేశ్వరరావు ట్రాక్‌ను పరిశీలిస్తూ 655వ మైలు రాయి వద్ద తిరుగుతున్నాడు. వెంకటలక్ష్మి తన బిడ్డలతో కలిసి రైల్వే ట్రాక్‌పై వెళ్లడాన్ని గమనించి వారిని అడ్డుకున్నాడు. తనకు తెలిసిన వారు కొంత దూరంలో ఉన్నారని, దగ్గర దారి కావడంతో ఇలా వెళుతున్నానని వెంకటలక్ష్మి ట్రాక్మన్కు చెప్పింది. ఇంతలో అమ్మను నాన్న కొట్టాడని, అందుకే అమ్మ తమను తీసుకుని ఇలా వచ్చేసిందని వెంకటలక్ష్మి కుమార్తె భవ్యశ్రీ అతడికి చెప్పింది. దీంతో వెంకటేశ్వరరావు ఆ ముగ్గురినీ ట్రాక్‌పై నుంచి బయటకు తోసేసి వారి ప్రాణాలను కాపాడాడు. అప్పటికే ట్రైన్ అతి సమీపంలోకి రావడంతో రెప్పపాటులో ముగ్గురూ ప్రమాదం నుంచి బయటపడ్డారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఘటనా స్థలికి చేరుకుని బాధితురాలిని కాకినాడ తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించి, బంధువులకు అప్పగించారు. -
ఆమె జైలుకు.. బాలుడు ఇంటికి
గుడివాడ టౌన్: ఎదురింటి బాలుడిని తీసుకొని పారిపోయిన వివాహితను పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సంచలనం రేపిన ఈ కేసు వివరాలను సీఐ దుర్గారావు వెల్లడించారు. గుడివాడ గుడ్‌మెన్ పేటకు చెందిన వివాహిత స్వప్న(30) తన ఎదురింటిలో ఉండే బాలుడి(15)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నెల 19న ఆ బాలుడితో పరారయ్యింది. బాలుడి తండ్రి గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వప్న, బాలుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ గుడివాడ తీసుకొచ్చారు. మహిళను బుధవారం గుడివాడ కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆమెకు రిమాండ్ విధించినట్లు సీఐ చెప్పారు. బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. -
ఆర్కే బీచ్ లో వివాహిత గల్లంతు
-
వివాహేతర సంబంధం గుట్టురట్టు.. లాడ్జిలో గది అద్దెకు తీసుకుని..
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): వివాహితతో అక్రమ సంబంధం గుట్టురట్టు కావడం, ఆమె భర్త బెదిరించడంతో భయపడ్డ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. బెంగళూరు కురుబరహళ్లి నివాసి అరుణ్ (33) నెలమంగల పట్టణంలోని ఒక లాడ్జిలో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రైవేటు కంపెనీలో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అరుణ్ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలియడంతో బెదిరించాడు. అంతేకాకుండా భార్యతో ఫోన్ చేయించి మన ఇద్దరి పేర్లు రాసి ఆయన ఆత్మహత్య చేసుకుంటానని చెప్పించాడు. దీంతో భయపడిపోయిన అరుణ్ నెలమంగలకు వచ్చి లాడ్జిలో గది అద్దెకు తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబానికి అరుణ్ ఒక్కడే జీవనాధారం కావడంతో కుటంబ సభ్యులు కన్నరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: ఏడాదిన్నర కిందట పెళ్లి.. 9 నెలల బాబు.. చిన్న గొడవకే -
ప్రియుడే కాలయముడు
అనంతపురం క్రైం: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో చోటు చేసుకున్న వివాహిత కేసులో నిందితుడిని ఏడాదిన్నర తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. హతురాలికి చెందిన 2.5 తులాల తాళిబొట్టు చైన్ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. అనంతపురంలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఈశ్వర్‌కు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన రాజేశ్వరితో వివాహమైంది. పెళ్లికి ముందు రాజేశ్వరి ఆదోనికి చెందిన చౌదరి హిదాయతుల్లా అలియాస్ ఇనాయతుల్లా మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత హిదాయతుల్లా కొన్నాళ్ల పాటు కువైట్‌కు వెళ్లాడు. ఆ సమయంలోనే రాజేశ్వరికి ఈశ్వర్‌తో కుటుంబ పెద్దలు వివాహం జరిపించారు. కువైట్ నుంచి వచ్చిన తర్వాత రాజేశ్వరితో హిదాయతుల్లా చాలా చనువుగా ఉండేవాడు. ఈ క్రమంలోనే రూ.2 లక్షలు రాజేశ్వరికి అప్పుగా ఇచ్చాడు. ఈ డబ్బును తిరిగి ఇవ్వాలని తరచూ అడిగినా.. రాజేశ్వరి మాట దాటవేస్తూ వస్తుండడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 2020, ఆగస్టు 28న హిదాయతుల్లా ఆదోని నుంచి అనంతపురానికి వచ్చాడు. రాజేశ్వరిని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్ఎం కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. తానిచ్చిన డబ్బు తిరిగివ్వాలని గొడపడ్డాడు. తన వద్ద లేవని రాజేశ్వరి తెలపడంతో ఆమె గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం రాజేశ్వరి మెడలోని తాళిబొట్టు చైన్ తీసుకుని ఉడాయించాడు. పోలీసులు మొదట్లో మిస్సింగ్ కేసుగా, తర్వాత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన హిదాయతుల్లాగా నిర్ధారించుకున్నారు. కాగా, రాజేశ్వరిని హతమార్చిన అనంతరం భార్యాపిల్లలను ఆదోనిలోనే ఉంచి హిదాయతుల్లా నెల్లూరుకు మకాం మార్చాడు. అక్కడ ఓ పండ్ల వ్యాపారి వద్ద కూలి పనులతో జీవనం సాగించసాగాడు. శనివారం అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద తచ్చాడుతున్న నిందితుడిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడి అరెస్ట్‌లో చొరవ చూపిన త్రీటౌన్ సీఐ కత్తి శ్రీనివాసులు, ఎస్ఐలు జయపాల్ రెడ్డి, వలిబాషు, సునీత, వెంకటేశ్వర్లు, బలరాం తదితరులను డీఎస్పీ అభినందించారు. (చదవండి: పాత కక్షలతో....ప్రాణం తీసిన స్నేహితులు) -
భార్య ‘నో’ అన్నా ఓకే: భర్తలు మారారు!
న్యూఢిల్లీ: మారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించాల్సిన సమయం వచ్చిందంటూ దేశవ్యాప్తంగా కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. సతీమణి సంభోగానికి ఒప్పుకోకపోయినా సర్దుకుపోతామని 66 శాతం మంది పురుషులు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ముఖ్యంగా మూడు కారణాల వల్ల మహిళలు తమ భర్తలతో కలయికకు అభ్యంతరం చెబుతున్నారు. భర్తకు సుఖవ్యాధులు, వేరే మహిళతో వివాహేతర సంబంధం, ఆలసట లేదా కోరిక లేకపోవడం వంటి కారణాలతో 80 శాతం స్త్రీలు శృంగారానికి నో చెబుతున్నారని సర్వేలో వెల్లడైంది. ...అయినా ఇబ్బంది పెట్టం మహిళా సాధికారతపై అధ్యాయంలోని 'భర్తతో సురక్షితమైన లైంగిక సంబంధాలను చర్చించే వైఖరులు' అనే విభాగంలోని ఈ ప్రశ్న.. లింగ సమానత్వంలో కీలకమైన ‘అంగీకార’ అంశంగా సర్వేలో నిలిచింది. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న వారికి ఈ పశ్నను సంధించగా ఐదుగురిలో నలుగురు మహిళలు, పురుషులు పై కారణాలతో ఏకీభవించారు. తమకు ఇష్టం లేకపోతే ఏకాంతానికి ఒప్పుకోబోమని చెప్పిన మహిళల సంఖ్య గత సర్వేతో పోలిస్తే 12 శాతం పెరిగింది. అలాగే భార్యలను ఇబ్బంది పెట్టబోమని చెప్పిన భర్తల సంఖ్య 3 శాతం పెరిగింది. దండిస్తాం.. కుదరదు తాను కోరుకున్న సమయంలో శృంగానికి ఒప్పుకోకపోతే భార్యను దండించే హక్కు ఉందని 19 శాతం పురుషులు అభిప్రాయపడటం గమనార్హం. భర్తలకు తమను దండించే హక్కు లేదని ప్రతి ఐదుగురిలో నలుగురు మహిళలు అంటే 82 శాతం మంది కుండబద్దలు కొట్టారు. (క్లిక్: వధువు చెల్లిని పెళ్లి చేసుకున్న వరుడు... షాక్‌లో బంధువులు) అప్పుడు కొట్టడం కరెక్టే భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లం, పిల్లల్ని లేదా ఇంటిని పట్టించుకోకపోవడం, వాదనకు దిగడం, భర్తతో కలయికకు ఒప్పుకోకపోవడం, వంట సరిగా చేయకపోవడం, భర్త పట్ల నమ్మకంగా ఉండకపోవడం, అత్తమామల పట్ల గౌరవ మర్యాదలు ప్రదర్శించకపోవడం వంటి సందర్భాల్లో భార్యలపై తాము చేయిచేసుకుంటామని 44 శాతం మంది పురుషులు వెల్లడించారు. బాధాకరమైన విషయం ఏమిటంటే ఇదే రకమైన అభిప్రాయాన్ని పురుషులు కంటే మహిళలే ఎక్కువగా (45 శాతం) వ్యక్తం చేశారు. అయితే గత సర్వేతో పోల్చుకుంటే(52 శాతం) ఈ సంఖ్య 7 శాతం తగ్గడం ఊరటనిచ్చే అంశం. భార్యలను అదుపులో పెట్టుకోవడానికి కొడతామని చెప్పిన పురుషుల సంఖ్య గతంతో (42 శాతం) పోలిస్తే రెండు శాతం పెరగడం గమనార్హం. సర్వే ఇలా.. 2019-21 మధ్య కాలంలో రెండు దశల్లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 నిర్వహించారు. 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 జూన్ 17 నుంచి 2020 జనవరి 30 వరకు మొదటి దశ సర్వే చేశారు. 2020 జనవరి 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు నిర్వహించిన రెండో దశ సర్వే 11 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగింది. (చదవండి: తల్లిబిడ్డల కోసం రైల్వేశాఖ వినూత్న నిర్ణయం!) -
గత కొన్నేళ్లుగా భార్య సాగిస్తున్న నిర్వాకం.. అనారోగ్యం పాలైన భర్త!
తిరువనంతపురం: సంసారం అన్నాక చిన్నచిన్న కలహాలు సాధారణమే. కానీ ఇటీవలకాలంలో చిన్న చిన్నకలహాలే పెద్దవిగా మారి తమ జీవితాల్ని నాశనం చేసుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్న ఘటనలను చూస్తున్నాం. అచ్చం అలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది. కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణాంలో సతీష్ అతని భార్య ఆశా నివశిస్తున్నారు. 2006లో వీళ్ల వివాహం జరిగింది. సతీష్ ఒక ఐస్‌క్రీమ్ పరిశ్రమలో పరిచేస్తున్నాడు. 2012లో ఈ జంట పాలక్కాడ్‌లో సొంత ఇంటిని కూడా కొనుగోలు చేశారు. అయితే ఆశ.. చిన్ని చిన విషయాలకు భర్తతో తరుచు గొడవపడుతూ ఉండేది. గత కొన్ని రోజులుగా తాను బాగా అలిసిపోయి అనారోగ్యానికి గురవుతున్నట్లు సతీష్ గమనించాడు. దీంతో అతను వైద్యుడిని సంప్రదించాడు కూడా. అయితే షుగర్ లెవల్స్ పడిపోవడం వల్ల ఇలా జరుగుతుందని చెప్పాడు. ఈ మేరకు సెప్టెంబర్ 2021 నుంచి ఇంటిలో ఆహారం తినడం మానేశాడు. దీంతో అతని ఆరోగ్యం క్రమంగా మెరుగవ్వడం మొదలైంది. దీంతో అతను తన స్నేహితుడితో తన భార్య ఆహారంలో ఏదైన కలుపుతుందేమోనని సందేహం వ్యక్త చేయడమే కాక తన భార్య నుంచి విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా అభ్యర్థించాడు. ఈ మేరకు సతీష్ స్నేహితుడు ఆశ వద్దకు వెళ్లి విచారించగా.. తాను ఆహారంలో కొన్ని మందులు కలుపుతున్నట్లు వెల్లడించింది. పైగా ఆ మందుల వివరాలను వాట్సాప్‌లో పంపించింది. అంతేకాక సతీష్ ఇంటి సీసీఫుటేజ్‌లో కూడా ఆశా ఏవో మందులు కలుపుతున్నట్లు రికార్డు అయ్యింది. దీంతో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆశా తన భర్త తినే భోజనం, తాగే నీళ్లలో కూడా మందులు కలుపుతున్నట్లు పేర్కొన్నారు. అంతేగాక ఆమెను అరెస్టు చేసి విచారించడం మొదలు పెట్టారు. (చదవండి: భర్తతో విడాకులు.. మరో వ్యక్తితో సహజీవనం.. చిన్నారి పాలకోసం ఏడుస్తోందని..) -
మిసెస్ వరల్డ్ 2022 కంటెస్టెంట్
అందాల పోటీలు పెళ్లికాని యువతులకే అనే పేరుంది. కానీ, పెళ్లయి, బిడ్డలున్నా తమ ఘనతను చాటేలా మిసెస్ ఇండియా, మిసెస్ వరల్డ్ పోటీలూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని లాస్ వెగాస్‌లో ‘మిసెస్ వరల్డ్–2022’ వివాహిత మహిళల కోసం సరికొత్త శైలిలో జరగనుంది. 80 దేశాల నుంచి అందమైన శ్రీమతులు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. భారత దేశం నుంచి నవదీప్ కౌర్ ప్రాతినిధ్యం వహిస్తోంది. మిసెస్ ఇండియా వరల్డ్ (2020–21లో) విజేతగా నిలిచిన 38 ఏళ్ల నవదీప్ కౌర్ ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లా స్టీల్ హబ్‌లో పుట్టి పెరిగింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. స్టీల్ హబ్ నుండి మిసెస్ ఇండియా వరల్డ్‌గా మారే వరకు నవదీప్ ప్రయాణం వివాహిత మహిళలను చైతన్యపరిచే దిశగా కొనసాగుతోంది. వ్యక్తిత్వ వికాస కోచ్ నవదీప్ కౌర్‌కి పెళ్లయి ఏడేళ్లు. ఐదేళ్ల కూతురు ఉంది. ఆరేళ్లుగా పాఠశాల స్థాయి విద్యార్థులకు చదువులో శిక్షణా తరగతులు తీసుకుంటుంది. కొటక్‌మహీంద్రా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించింది. అటు తర్వాత హెచ్ఆర్, మార్కెటింగ్ గ్రాడ్యుయేషన్ కోసం మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస కోచ్‌గా ఎంతోమందిని ప్రభావితం చేస్తోంది. దేశం గర్వించేలా కృషి కిందటేడాది మిసెస్ ఇండియా వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నప్పటి నుండే నవదీప్ మిసెస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘నా చిన్ననాటి నుంచి ప్రపంచపటంలో మన దేశాన్ని నేను సైతం గొప్పగా చూపించాలనుకునేదాన్ని. అందుకోసం ప్రతి విభాగంలో పనిచేయడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాను’ అని తన జీవిత కల గురించి వివరిస్తుంది నవదీప్ కౌర్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ లేడీస్ సర్కిల్ ఇండియా, రూర్కెలా సిటీ లేడీస్ సర్కిల్‌తో అనుబంధం కలిగి ఉన్న నవదీప్ కౌర్ ఈ ప్రపంచాన్ని అందరూ జీవించడానికి మెరుగైన ప్రదేశంగా మార్చలన్న ఆకాంక్షనూ వెలిబుచ్చుతుంది. మిసెస్ వరల్డ్ పోటీలలో పాల్గొనడానికి వెళ్లిన నవదీప్ కౌర్‌కు ఈ సందర్భంగా ఆల్ ద బెస్ట్ చెబుదాం. గ్రాండ్ ఫినాలేను భారత కాలమానప్రకారం జనవరి 16న ఉదయం 6:30 గంటలకు ఆన్లైన్ ద్వారా చూసి, తెలుసుకోవచ్చు. -
భర్త దొంగతనాలు చేస్తూ తరచుగా జైలుకు.. జీవితంపై విరక్తితో..
సాక్షి,పెద్దవూర(నల్గొండ): కుటుంబ కలహాలతో ఆదివారం రాత్రి నాగార్జునసాగర్ కొత్త వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతదేహం సోమవారం మధ్యాహ్నం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్‌కాలనీకి చెందిన రమావత్ అఖిల(25)తల్లిగారింటి వద్ద పైలాన్‌కాలనీలో నివాసం ఉంటోంది. భర్త దొంగతనాలు చేస్తు తరచుగా జైలుకు వెళ్తుండటం, అతని ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో పాటు ఆమె తండ్రి మరణించటం, తల్లికి భారంగా మారుతున్నానని భావించి జీవితంపై విరక్తి చెందిన అఖిల కొత్త వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు గజ ఈతగాళ్లతో అఖిల దూకిన ప్ర దేశంలో వెతికించగా మృతదేహం లభ్యం అయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సాగర్ కమలానెహ్రూ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి సంవత్సరంన్నర, మూడున్నరేళ్ల వయస్సున్న కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నర్సింహారావు తెలిపారు. చదవండి: జైలులో స్నేహం.. బయటకు వచ్చాక.. -
భర్తకి విడాకులిచ్చి.. కుక్కతో పెళ్లి.. తరువాత మహిళ చెప్పింది వింటే మైండ్ బ్లాక్!
కొన్ని సార్లు మన చూట్లు జరిగేవి పరిణామాలను చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. అందులో కొన్నింటిని అయితే నమ్మలేము కూడా. తాజాగా అలాంటి ఘటనే లండన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన అమండా రోడ్జర్స్ (47) తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగానే జీవితాన్ని గడిపింది. అయితే ఇటీవల అమండా తన పెంపుడు కుక్కతో ప్రేమలో పడింది. ఆ కుక్క పేరుషెబా. ఆమండా ఆ కుక్కని రెండు నెలల వయస్సు ఉన్నప్పటి నుంచి పెంచుతోంది. అప్పటి నుంచి షెబా తనపై ఎంతో ప్రేమని చూపిస్తోందని తెలిపింది. అందుకే మనుషులు చూపించే ప్రేమకంటే తన షెబాలోనే నిజమైన ప్రేమను చూశానని అందుకే దాన్నే భాగస్వామిగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకుంది అమండా. అందుకు తాను మోకాళ్లపై నిలబడి షెబాకు ప్రపోజ్ చేయగా అది తోక ఊపి తన అంగీకారం తెలిపినట్లు చెప్పింది. ఆ తర్వాత అమండా తన పెంపుడు కుక్క షెబాను 200 మంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అమండా ఇప్పటి వరకు షెబాతో సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. ఆమె చుట్టు పక్కల వారికి అమండా, షెబా మధ్య ప్రేమ వింతగా అనిపించినా.. అమండా అవేమీ పట్టించుకోకుండా జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నట్లు తెలపడంతో అటువంటి వారికి మైండ్ బ్లాక్ అయ్యేలా సమాధనం చెప్పింది. చదవండి: స్క్విడ్ గేమ్ చూశాడని తుపాకులతో కాల్చి చంపి, ఆపై విద్యార్థులను.. -
బ్యూటీపార్లర్‌కు వెళ్లిన మహిళ అదృశ్యం
-
భూతవైద్యం చేసే మహిళతో ‘సంబంధం’.. ఇటీవల దూరం పెట్టడంతో...
సాక్షి,మిడ్జిల్( మహబూబ్ నగర్): తనను దూరంగా పెట్టిందని పథకం ప్రకారమే ఓ వివాహితను ప్రియుడే అత్యాచారానికి పాల్పడి.. ఆపై హత్య చేసి నగలు ఎత్తికెళ్లినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు వివరాలను మంగళవారం మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని మల్లాపూర్‌కు చెందిన లక్ష్మీదేవి (41) గత నెల 22వ తేదీ ఉదయం తన కూతురు స్వాతిని కల్వకుర్తికి చెందిన వెంకటేశ్వరాచారితో కలిసి జడ్చర్లకు తీసుకెళ్లింది. అక్కడి హాస్టల్లో కూతురిని వదిలిపెట్టి తిరిగి అదేరోజు సాయంత్రం మున్ననూర్ వద్ద దిగిపోయింది. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో మరుసటి రోజు భర్త శంకరయ్యగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, బోయిన్పల్లి శివారులో సీతాఫలాల కోసం వెళ్లిన రవిప్రకాష్‌రెడ్డికి పీర్లమాన్యంగుట్టపై ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించగా హత్యకు గురైన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ దొరికిన ఆమె ఫోన్‌కాల్ డేటా ఆధారంగా మృతురాలు గ్రామంలో భూతవైద్యం చేసేదని బయటపడింది. ఆ కోణంలో విచారణ జరపగా మల్లాపూర్‌కు చెందిన గంగిరెద్దుల వెంకటయ్యకు లక్ష్మీదేవితో వివాహేతర సంబంధం ఉన్నట్టు తేలింది. ఇటీవల అతడిని దూరం పెట్టడంతో ఎలాగైనా చంపేసి బంగారు నగలు తీసుకోవాలని పథకం పన్నాడు. పీర్లమాన్యంగుట్టలో బంగారు గనులు ఉన్నాయని వాటిని తీయాలని నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారం జరిపి, పెద్ద బండరాయితో మోది చంపేసి ఒంటిపై ఉన్న ఆరు తులాల బంగారు పుస్తెలతాడు, నక్లెస్ తోపాటు తులం చైన్, మూడు గ్రాముల చెవికమ్మలు తీసుకుని పారిపోయాడు. చివరకు మంగళవారం నిందితుడిని అరె స్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును పది రోజుల్లోనే ఛేదించిన ఎస్ఐ జయప్రసాద్, ట్రెయినీ ఎస్ఐ శ్రావణ్‌కుమార్‌ను సీఐ అభినందించారు. చదవండి: ఆడుకుందామని పిలిచి ఐదేళ్ల చిన్నారిపై.. -
యువకుడితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్న భర్తని..
సాక్షి, హైదరాబాద్: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భర్తను చంపిన భార్యను, సహకరించిన ప్రియుడిని హబీబ్‌నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మాన్గార్ బస్తీకి చెందిన ఉప్పాడే రోషన్(25)కు అదే బస్తీకి చెందిన లతకు పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడ, ఒక మగ సంతానం ఉన్నారు. రోషన్ ఓ హోటల్లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. లతకు స్థానికుడైన కాంబ్లే యువరాజ్ పరిచయం అయ్యారు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో లతకు యువరాజ్ దగ్గరయ్యారు. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భర్తకు తెలినప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో రోజూ భార్య భర్తల మధ్య ఘర్షణ జరిగేది. తమ ప్రేమకు అడ్డువస్తున్నాడనే కారణంతో భర్త రోషన్‌ను ఎలాగైనా అంతమొందించాలని భార్య లత నిర్ణయించుకుంది. ఈ నెల 7వ తేదీ మధ్యాహ్నం మద్యం సేవించి ఇంటికి వచ్చిన రోషన్‌ను భార్య లత, ప్రియుడు కాంబ్లే యువరాజ్ కలిసి కత్తితో పొడిచి చంపారు. ఈ కేసులో ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా తామే హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. ఈ మేరకు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
వివాహేతర సంబంధం: నాలుగు కుటుంబాలకు నిలువనీడ లేకుండా చేసింది
సాక్షి,జయపురం: వివాహితతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణపై ఓ యువకుని కుటుంబంతో పాటు వారి బంధువులపై గ్రామస్తులు దాడి చేశారు. అక్కడితో ఆగకుండా వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేసి వారిని గ్రామం నుంచి బహిష్కరించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానవీయ సంఘటన నవరంగపూర్ జిల్లా ఝోరిగాం సమితి అకడహిల్ గ్రామంలో చోటుచేసుకుంది. నాలుగు కుటుంబాలు గ్రామ బహిష్కరణ పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అకడహిల్ గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామంలోని వేరే కులానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో మూడు నెలల కిందట మహిళ కుటుంబ సభ్యులు ఆ యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తాళ్లతో కట్టేసి దండించారు. అనంతరం ఓ ఇంట్లో బంధించారు. సమాచారం అందుకున్న ఉమ్మరకోట్ పోలీసులు గ్రామంలో విచారణ చేసేందుకు రాగా, వివాహితపై ఆ యువకుడు అత్యాచారం చేశాడని మహిళ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మహిళ బంధువులు అక్కడితో ఆగకుండా..యువకుని కుటుంబంతో పాటు వారి కులానికి చెందిన మరో మూడు కుటుంబాలపై దాడులకు పాల్పడ్డారు. ఇళ్లు ధ్వంసం చేశారు. వారందరినీ గ్రామం నుంచి తరిమేశారు. ప్రాణభయంతో వారంతా గ్రామం విడిచిపెట్టి సమీపంలోని బాగడియా గ్రామానికి వెళ్లి తలదాచుకుంటున్నారు. ఈ సంఘటనపై బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తి మాట్లాడుతూ..యువకుడు తప్పు చేసి ఉంటే అతిడిని శిక్షించాలి. కానీ ఆ కులస్తులందరినీ హింసించి గ్రామం నుంచి బహిష్కరించడం, వారి ఇళ్లు ధ్వంసం చేయడం, ఆస్తులు దోచుకోవడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ సంఘటనపై ఉమ్మరకోట్ పోలీసు అధికారి నరేష్ కుమార్ ప్రధాన్‌ను సంప్రదించగా..యువకుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. గ్రామస్తులతో మాట్లాడి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
అత్తింటికి వెళ్లాల్సిన నవవధువు ప్రియుడితో కలిసి..
బాపట్ల (గుంటూరు): ప్రేమించుకున్నారు... కలిసి జీవించాలి అనుకున్న నేపథ్యంలో అనుకోని విధంగా యువతికి తల్లిదండ్రులు మరొక వివాహం చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో చోటుచేసుకుంది. బాపట్ల రూరల్ ఎస్ఐ వెంకటప్రసాద్ వివరాల ప్రకారం.. కొండుబొట్లవారిపాలేనికి చెందిన ప్రవల్లిక, శ్రీకాంత్‌లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు నెల రోజుల కిందట ఆమెకు మరో యువకుడితో వివాహం చేశారు. ఆషాఢమాసం కావడంతో ఆమె తల్లిదండ్రుల నివాసంలో ఉంటోంది. శ్రావణమాసం రావడంతో రెండు రోజుల్లో అత్తింటికి వెళ్లాల్సి ఉండగా సోమవారం సూర్యలంక గ్రామంలో మాజీ ప్రేమికుడితో కలసి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, యువకుడి కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువురిని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం పొన్నూరు తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
పిన్నితో గొడవ.. ఆవేశంతో తలపై రోకలితో బాదిన కుమారుడు..
సాక్షి, హసన్‌పర్తి(వరంగల్ అర్బన్): హసన్‌పర్తి మండలం పెంబర్తిలో మంగళవారం రాత్రి హత్య జరిగింది. సొంత అక్క కుమారుడే రోకలితో తలపై బాదడంతో వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. వివరాలు... పెంబర్తికి చెందిన కనుకయ్య సొంత అక్కాచెల్లెళ్లను వివాహం చేసుకున్నాడు. సింగరేణిలో విధులు నిర్వర్తించిన ఆయన ఇటీవల ఉద్యోగ పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం ఆయన ఇద్దరు భార్యలు ప్రవీణ, విజయ(55)తో కలిసి పెంబర్తిలో ఉంటున్నాడు. అయితే, చిన్న భార్య విజయ ఇటీవల కనుకయ్య పేరిట నల్లబెల్లిలో ఉన్న ఆస్తిని విక్రయించి నగదు ఆమె కుమారుడికి ఇచ్చింది. దీంతో ప్రవీణ కుమారుడు వేణుగోపాల్ ఆ డబ్బులో తనకు వాటా ఇవ్వాలని కొంతకాలంగా పిన్నితో గొడవ పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదేక్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇంట్లో గొడవ జరిగింది. ఈ మేరకు ఆవేశంతో వేణుగోపాల్ ఇంట్లోని రోకలితో విజయ తలపై బాదగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావు, ఎస్సై జితేందర్‌రెడ్డి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా, నిందితుడు వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
టీలో పొడి ఎక్కువైందని తిట్టిన అత్త, దీంతో కోడలు..
సాక్షి, గోల్కొండ(హైదరాబాద్): అత్త కోపగించుకుందని ఓ కోడలు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గోల్కొండ రేషంబాగ్‌కు చెందిన సయ్యద్ హబీబ్ భార్య బీబీ (24). ఆమె తన అత్త సతీయా బేగంతో కలిసి రేషం బాగ్‌లో ఉంటోంది. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అత్తా సతియా బేగం చిన్న విషయానికే కోపగించుకుంటోందని బీబీ పలుమార్లు భర్తకు తెలిపింది. ఇదిలాఉండగా సోమవారం ఉదయం సతీయా బేగంతన కోడలు బీబీకి టీ తెమ్మని చెప్పింది. దీంతో బీబీ ఇంట్లో టీ తయారు చేసి అత్తకు ఇచ్చింది. కాగా టీ లో పొడి ఎక్కువైందని సతీయా బేగం కోడలిపై విరుచుకుపడింది. కాగా అత్త చిన్న విషయానికే తనను దూషించినందుకు బీబీ మనస్తాపం చెంది తన గదిలోకి వెళ్లి చున్నీతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియగానే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాని స్వాధీనం చేసుకుని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మరదలిని ఆరేళ్లుగా వేధిస్తున్న బావ.. దీంతో..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని పదిర, రాచర్ల, గొల్లపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వివాహిత మహిళలను మానసికంగా వేధిస్తున్న ముగ్గురిపై ఆదివారం రాత్రి వేర్వేరుగా కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన సొంత అక్క భర్త వేధిస్తున్నాడని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఒక వివాహిత ఫిర్యాదు మేరకు కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన చీకటి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే చనిపోతానంటూ ఆరేళ్లుగా వేధిస్తున్నాడని, పుట్టింట్లో ఉండగా చేయి పట్టుకున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే గొల్లపల్లి గ్రామానికి చెందిన ముద్రకోళ్ల వంశీ అనే వ్యక్తి సహాయంతో కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన పూసల శేఖర్ మూడేళ్లుగా ఫోన్ చేస్తూ వేధిస్తున్నట్లు ఒక వివాహిత ఫిర్యాదు మేరకు వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వేధింపులు.. దీంతో ఆ మహిళ..
సాక్షి, పెద్దపల్లిరూరల్: తోటి ఉద్యోగే ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించడంతో భరించలేక పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామ వీఆర్ఏ దివ్య (33) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం నిమ్మనపల్లి గ్రామానికి చెందిన దివ్యకు సబ్బితం గ్రామానికి చెందిన శేఖర్‌తో వివాహమైంది. మనస్పర్ధల కారణంగా వారిద్దరూ విడిపోయి, విడాకులు పొందారు. నిమ్మనపల్లి వీఆర్ఎగా విధులు నిర్వహిస్తూ దివ్య ప్రస్తుతం పెద్దపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై పనిచేస్తోంది. ఈ క్రమంలో కొత్తపల్లి గ్రామ వీఆర్ఏ పెర్క వెంకటేశ్ తనను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తుండడంతో మనస్తాపానికి గురై ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతురాలి సోదరుడు దిలీప్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి తల్లిదండ్రులు పోచమ్మ, నర్సయ్య సోదరులు దిలీప్, దినేశ్ ఉన్నారు. -
పెళ్లైన మహిళతో వివాహేతర సంబంధం.. ఆపై
సాక్షి, గార్ల(మహబూబాబాద్) : వివాహేతర సంబంధం నెపంతో ఓ వ్యక్తిని పట్టపగలే హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా గార్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గార్లలోని పుట్టకోట బజారుకు చెందిన గొడుగు ధనమ్మ భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోగా కుమారుడు ఉన్నాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు(55) కారేపల్లిలోని కవిత ఇంజనీరింగ్ కళాశాల బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రోజూ గార్ల నుంచి విద్యార్థులను కళాశాలకు తీసుకెళ్లి.. తిరిగి సాయంత్రం తీసుకువచ్చి గార్లలోనే బస చేసేవాడు. ఈ క్రమంలో ధనమ్మతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహేతర సంబంధం విషయం తెలుసుకున్న ధనమ్మ తమ్ముడు చాట్ల కోటేష్, ఆమె అక్క కొడుకు గంగరబోయిన సంపత్ కలిసి పథకం ప్రకారం మధ్యాహ్నం ధనమ్మ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఇంట్లో ధనమ్మతో పాటు వెంకటేశ్వర్లు ఉండడంతో కోపోద్రిక్తులైన కోటేష్, సంపత్ ఫ్యాన్ స్టాండ్ రాడ్‌తో వెంకటేశ్వర్లును చితకబాదారు. దీంతో తలకు, చాతిపై తీవ్రగాయాలై వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన ధనమ్మకు సైతం గాయాలయ్యాయి. అనంతరం నిందితులిద్దరూ పరారయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై బాదావత్ రవి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహబూబా బాద్ నుంచి క్లూస్ టీంను రప్పించి ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు. -
పెళ్లిరోజు వేడుకలు.. అంతలోనే విషాదం!
తిరుమలగిరి (నాగార్జునసాగర్): అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని కొంపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శ్రీరాంపల్లి గ్రామానికి చెందిన పోలోజు శ్రీనివాసచారి, కోటమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు సంతానం. రెండో కుమార్తె బొడ్డుపల్లి మాధవి(26) మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి మహేష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈమె భర్త మహేష్ హాలియాలో ట్రాక్టర్ వెల్డింగ్ షాపును కొనసాగిస్తున్నాడు. కాగా, భార్యభర్తల మధ్యతరుచు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన వారి పెళ్లిరోజు వేడుకలను భార్యభర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారే సరికి బొడ్డుపల్లి మాధవి మృతిచెందింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వంటిపై గాయాలు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రి శ్రీనివాసచారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు.